प्रजा प्रस्थानम पदयात्रा: वाईएस शर्मिला का आह्वान- “पैसा लो लेकिन वोट उसी को दो जो तुम्हारा साथ दें”

हैदराबाद: वाईएसआर तेलंगाना पार्टी की अध्यक्ष वाईएस शर्मिला ने सवाल किया कि क्या केसीआर ने नौ साल मुख्यमंत्री रहने के बाद तेलंगाना के लिए कुछ किया? शर्मिला ने लोगों से बीआरएस की उस हुकूमत को खत्म करने को कहा, जिसने एक भी वादा पूरा नहीं किया। शर्मिला की प्रजा प्रस्थानम पदयात्रा गुरुवार से फिर शुरू हो गई है। शर्मिला ने लिंगगिरी एक्स रोड पर वाईएसआर की प्रतिमा पर श्रद्धासुमन अर्पित किए।

शर्मिला ने कहा कि इस साल राज्य में चुनाव होंगे और केसीआर दोबारा वोट मांगने आएंगे। केसीआर की बात सुनकर मूर्ख मत बनो। पैसा मिले तो ले लेना चाहिए, लेकिन वोट उसी को देना चाहिए जो आपका साथ दे। इस मौके पर शर्मिला ने खुलासा किया कि उनका मिशन वाईएसआर कल्याणकारी योजनाओं को लागू करना है। इससे पहले वाईएसआरटीपी अध्यक्ष वाईएस शर्मिला ने तेलंगाना के सीएम केसीआर पर जमकर निशाना साधा। उन्होंने कहा कि अगर केसीआर साबित कर दें कि तेलंगदाना में कोई समस्या नहीं है तो वह राजनीति छोड़ देंगे। अगर यह सच नहीं हुआ तो केसीआर ने सीएम पद से इस्तीफा देने की मांग कर दी।

కేసీఆర్ మాటలు విని మళ్లీ మోసపోవద్దు

హైదరాబాద్ : తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కేసీఆర్ రాష్ట్రానికి ఏమైనా చేశారా అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ ((YSRTP)) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ప్రశ్నించారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చని  బీఆర్ఎస్ పాలనకు అంతం పలకాలని ప్రజలను కోరారు. షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఇవాళ్టి నుంచి పునఃప్రారంభం అయింది. లింగగిరి ఎక్స్ రోడ్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి షర్మిల నివాళులు అర్పించారు.  

ఈ ఏడాది రాష్ట్రానికి ఎన్నికలు జరగనున్నాయని, మళ్లీ ఓట్ల కోసం కేసీఆర్ వస్తారని షర్మిల అన్నారు. కేసీఆర్ మాటలు విని మోసపోవద్దన్నారు. డబ్బులిస్తే  తీసుకోవాలని కానీ ఓటు మాత్రం మీ కోసం పాటు పడే పార్టీకే వేయలన్నారు. వైఎస్సార్ సంక్షేమ పథకాలు అమలు చేయడమే తన  ధ్యేయమని ఈ సందర్భంగా షర్మిల వెల్లడించారు. 

దీనికంటే ముందు వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు లేవని కేసీఆర్ నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. అది నిజం కాకపోతే కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తన పాలనపై తనకు నమ్మకం ఉంటే తనతో ఒక్కరోజు పాదయాత్రకు రావాలంటూ కేసీఆర్‌కు షూ గిఫ్ట్‌గా ఇచ్చారు. కేసీఆర్‌కు సైజ్ సరిపోకుంటే చెప్పాలని, రిటర్న్ ఆప్షన్ కూడా ఉందని ఆసక్తికర కామెంట్లు చేశారు.

సీఎం కేసీఆర్ ఇది బంగారు తెలంగాణ అని, ఎలాంటి సమస్యలు లేవని చెప్పారు. ఆయన నాతో పాటు పాదయాత్రలో నడవవాలని షూ బాక్స్ పంపిస్తున్నా. ఆయన చెప్పినట్టు రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు లేవని చూపిస్తే నేను ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పి రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఇది నిజం కాకపోతే, కేసీఆర్ రాజీనామా చేసి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఆయన ఇచ్చిన మాట ప్రకారం దళితుడిని సీఎం చేయాలి. వైఎస్సార్ హయాంలో సామాన్యులు సైతం సీఎంను కలిసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు నాయకులే కలిసే పరిస్థితి లేదు.’ అని వైఎస్ షర్మిల వ్యాఖ్యనించారు.

కేసీఆర్ పాలనలో ఏ తెలంగాణలోని ఏ వర్గం సంతోషంగా లేదని షర్మిల అన్నారు. రైతుబంధు పేరుతో ఇతర పథకాలను నిలిపివేశారని.. లక్ష రూపాయల రుణమాఫీ హామీ ఏమైందని ఆమె ప్రశ్నించారు. రైతులకు రూ.5 వేలు ఇచ్చి రూ.30 వేల సబ్సిడీ ఆపేశారని షర్మిల ధ్వజమెత్తారు. అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. ఆ తర్వాత వాటిని గాలికొదిలేశారని మండిపడ్డారు. నేరవర్చలేనప్పుడు వాగ్ధానాలు ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఏడాది ఏ పథకం ప్రవేశ పెట్టి్న అది ఎన్నికల కోసమేనని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో పబ్లిక్ ఫోరం నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు. అప్పుడే వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. సీఎం కేసీఆర్‌ను గద్ద దించటమే తన ఏకైక లక్ష్యమని షర్మిల వ్యాఖ్యనించారు.

కేంద్ర బడ్జెట్‌పై స్పందించిన ఆమె.. బడ్జెట్‌లో తెలంగాణకు మరోసారి అన్యాయం జరిగిందన్నారు. బడ్జెట్‌లో రాష్ట్రానికి ఎలాంటి కేటాయింపులు లేవని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు నెరవేర్చలేదని మండిపడ్డారు. గతేడాది నర్సంపేట నియోజకవర్గంలో ఎక్కడైతే పాదయాత్ర నిలిచిపోయిందో అక్కడి నుంచే తిరిగి యాత్రను ప్రారంభిస్తామని షర్మిల స్పష్టం చేశారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X