हैदराबाद: आंध्र प्रदेश में अलग-अलग सड़क हादसे में नौ लोगों की मौत हो गई और नौ अन्य गंभीर रूप से घायल हो गये। सभी घायलों को नजदीकी अस्पतालों में भर्ती किया गया है। घायलों में कुछ लोगों की हालत नाजूक बताई गई है।
मिली जानकारी के अनुसार, चित्तूर जिले में भीषण सड़क हादसा हो गया। तेज रफ्तार एंबुलेंस ने सड़क पर खड़ी टैंकर को तेज रफ्तार से टक्कर मार दी। उस वक्त एंबुलेंस में सवार सात लोगों में से चार की मौके पर ही मौत हो गई। चूंकि तीन अन्य की हालत गंभीर है। स्थानीय लोगों ने घायलों को नजदीकी अस्पताल पहुंचाया। यह सड़क दुर्घटना शुक्रवार सुबह तड़के हुई है।
चित्तूर जिले के तवनमपल्ली मंडल के तेल्लगुंडलापल्ली के पास एंबुलेंस बेंगलुरु से भुवनेश्वर जा रही थी। मामले की जानकारी होने पर पुलिस तुरंत मौके पर पहुंची और मृतकों की पहचान उमेश चंद्र, विजय, त्रिलोचन और मंजुलता के रूप में की है।
दूसरी ओर अन्नामैया जिले में एक और गंभीर सड़क दुर्घटना हुई। तूफान वाहन और लॉरी की आमने-सामने टक्कर हो गई। इस दुर्घटना में पांच लोगों की मौके पर ही मौत हो गई। छह अन्य गंभीर रूप से घायल हैं, जिनमें से चार की हालत गंभीर बताई जा रही है। मामले की जानकारी मिलते ही पुलिस तुरंत मौके पर पहुंची और मृतकों की पहचान कर्नाटक के बडची के ग्रामीणों के रूप में की गई है।
पुलिस ने पुष्टि की कि दुर्घटना के समय तुफान वाहन में 16 यात्री सवार थे। उन्होंने बताया कि तिरुमाला दर्शन के लिए जाते समय केवीपल्ली मंडल के मथमपल्ली में यह हादसा हुआ। हादसे का कारण तेज रफ्तार माना जा रहा है। पुलिस आगे की कार्रवाई कर रही है।
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదాలు, తొమ్మిది మంది దుర్మరణం
హైదరాబాద్: చిత్తూరు (ఆంధ్రప్రదేశ్) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుమీద ఆగివున్న ట్యాంకర్‌ను అతివేగంగా వచ్చిన ఓ అంబులెన్స్ బలంగా ఢీకొట్టింది. ఆ సమయంలో అంబులెన్స్‌లో ఉన్న ఏడుగురిలో నలుగురు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.
చిత్తూరు జిల్లాలోని తవనంపల్లి మండలం తెల్లగుండ్లపల్లి వద్ద అంబులెన్స బెంగళూరు నుంచి భువనేశ్శర్ వెళ్తుండగా శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మృతులు ఉమేశ్ చంద్ర, విజయ్, త్రిలోచన్, మంజులతగా గుర్తించారు.
ఇదిలా ఉండగా అన్నమయ్య జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుఫాన్ వాహనం, లారీ ఎదురెదురుగా ఢీకొని ఐదుగురు అక్కడిక్కడే మృతిచెందారు. మరో ఆరుగురి తీవ్ర గాయాలు కాగా, అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకొని హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు కర్నాటకలోని బడచి గ్రామస్తులుగా గుర్తించారు.
ప్రమాద సమయంలో తుఫాన్ వాహనంలో మొత్తం 16 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. తిరుమల దర్శనానికి వెళ్లి వస్తుండగా కేవీపల్లి మండలం మఠంపల్లి వద్ద శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రమాదానికి అతివేగమే కారణమని అనుమానిస్తున్నారు. (ఏజెన్సీలు)