हैदराबाद: नागरिक अधिकार के नेता प्रोफेसर हरगोपाल के खिलाफ देशद्रोह का मामला दर्ज किया गया है। माओवादियों की किताबों में उनका नाम होने के आरोप में मुलुगु जिले के ताडवाई पुलिस स्टेशन में यूएपीए एक्ट, आर्म्स एक्ट और अन्य 10 धाराओं के तहत मामला दर्ज किया गया है। इतना ही नहीं, प्रोफेसर हरगोपाल के साथ 152 अन्य के खिलाफ भी मामले दर्ज किए गए हैं।
बताया गया है कि इन सभी पर जनप्रतिनिधियों की हत्या की साजिश रचने का आरोप लगाते हुए मामले दर्ज किए गए हैं। लेकिन ये मामला 19 अगस्त 2022 को दर्ज किया गया था, जो अब यह मामला सामने आया है। वह भी पीपुल्स डेमोक्रेसी मूवमेंट के अध्यक्ष चंद्रमौली की जमानत याचिका के मामले में प्रकाश में आया है।
इसी क्रम में प्रोफेसर हरगोपाल ने याद दिलाया कि सुप्रीम कोर्ट ने कहा है कि राजद्रोह और देशद्रोह जैसे मामले दर्ज नहीं होने चाहिए। उनका कहना है कि यह केस नहीं चलेगा। साथ ही स्पष्ट किया कि इसका फैसला कोर्ट में होगा। हरगोपाल ने आगे कहा कि उनके साथ 152 लोगों के खिलाफ मामले दर्ज किए गए और ईमानदार लोगों के खिलाफ भी मामले दर्ज किए गए। इससे भी बड़ी विडंबना यह है कि मृतकों के खिलाफ भी देशद्रोह के मामले दर्ज किए गए हैं। उन्होंने मांग की किसभी से खिलाफ लगाये मामले वापस लिया जाये। इन मामले को लेकर तेलंगाना के लोगों को सरकार जवाब देना चाहिए।
ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశద్రోహం కేసు
హైదరాబాద్: పౌరహక్కుల నేత, ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశద్రోహం కేసు నమోదు అయ్యింది. మావోయిస్టుల పుస్తకాల్లో ఆయన పేరు ఉందని వాళ్లకు సహాయసహకారాలు అందిస్తున్నారనే ఆరోపణలతో ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్‌లో ఉపా (UAPA ACT), ఆర్మ్స్ యాక్ట్‌తో పాటు ఇతర 10 సెక్షన్ల కింద కేసు నమోదైంది. అయితే ప్రొఫెసర్ హరగోపాల్‌తో పాటు మరో 152 మందిపై కూడా కేసులు నమోదు చేశారు.
వీళ్లంతా ప్రజాప్రతినిధులను చంపేందుకు కుట్ర చేశారని ఆరోపిస్తూ కేసులు నమోదు చేసినట్టు సమాచారం. అయితే ఈ కేసును ఆగస్టు 19, 2022లో నమోదు కాగా ఇప్పుడు బయటకు వచ్చింది. అది కూడా పీపుల్స్ డెమెక్రసీ మూమెంట్ అధ్యక్షుడు చంద్రమౌళి బెయిల్ పిటిషన్ విషయంలో బయటపడింది.
రాజద్రోహం, దేశ ద్రోహం లాంటి కేసులు పెట్టకూడదని సుప్రీం కోర్టు చెప్పినట్టుగా ప్రొఫెసర్ హరగోపాల్ గుర్తు చేశారు. ఈ కేసు నిలబడదని చెప్పుకొచ్చారు. అయితే కోర్టులో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. అయితే తనతోపాటు 152 మందిపై కేసులు పెట్టారన్న హరగోపాల్ నిజాయితీ పరులైన వారిపై కూడా కేసులు పెట్టారని తెలిపారు. ఇంకా విడ్డూరం ఏమిటంటే చనిపోయినవారిపై కూడా కేసులు నమోదు చేశారని చెప్పుకొచ్చారు. అందరిపై నుంచి ఈ కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.
ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ పద్మజాషాలతో పాటు ప్రముఖ కళాకారులు, సామాజిక కార్యకర్తలపై రాష్ట్ర ప్రభుత్వం ఉపా కేసు నమోదు చేయడం తీవ్ర విస్మయం కలిగిస్తుందని ప్రజాసంఘాలు, జర్నలిస్టు యూనియన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) క్రింద ప్రభుత్వం వారి పేర్లను ఒక కేసులో నమోదు చేసినట్లు తెలుస్తోందని వారు తెలిపారు.
ఇదే నిజమైతే కేసు వివరాలను బహిరంగపర్చాలని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ పద్మజాషా లాంటి ప్రముఖులను ఇలాంటి కేసుల్లో ఇరికించడం వెనక లోతైన కుట్ర దాగి ఉంటుందని తాము భావిస్తున్నట్లు తెలిపారు. విద్యావేత్తలపై ఇలాంటి కేసులు నమోదు చేయటం సరైంది కాదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. (ఏజెన్సీలు)