Hyderabad: ధర్మపురి నియోజకవర్గం లోని మండలాల్లో ఎల్. యమ్. కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమి వారిచే ప్రదర్శించ బోయే ‘సంఘం శరణం గచ్చామి’ (నృత్య రూప నాటక ప్రదర్శన) కరపత్రాలు మరియు పోస్టర్ ఆవిష్కరించిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్.
ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు మాట్లాడుతూ..
ధర్మపురి నియోజకవర్గ ప్రజానీకాని విజ్ఞప్తి. సమసమాజ స్వాప్నికుడు, నవభారత నిర్మాత, ప్రపంచ మేధావి, భారతరత్న డా॥ బి. ఆర్.అంబేద్కర్ గారి జీవితచరిత్ర సంబంధించి ఎల్.యమ్. కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమి వారిచే సంఘం శరణం గచ్చామి నృత్య రూప నాటికను ధర్మపురి నియోజకవర్గంలోని మండల కేంద్రాలలో ప్రదర్శన నిర్వహించనున్నట్లు మంత్రి అన్నారు.
డాక్టర్ అంబేద్కర్ గారు అందరివారు, మనందరికీ ఆదర్శనీయులు. వారి జీవిత విశేషాలు, ఆశయాలు, లక్ష్యాలను మనమందరం తప్పకుండా తెలుసుకోవాలని, ప్రతీ ఒక్కరూ కులమతాలకతీతంగా ఇట్టి నృత్యనాటక ప్రదర్శనను తప్పకుండా చూడాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు
ధర్మపురి నియోజకవర్గంలో సంఘం శరణం గచ్చామి నృత్య రూప నాటక ప్రదర్శన వివరములు:-
1) వెల్గటూర్ మండలం 26-11-2022 అనగా శనివారం సా॥ 6-00 అంబేద్కర్ చౌరస్తా,
2) గొల్లపెల్లి మండలంలో 27-11-2022 అనగా ఆదివారం సా|| 6-00 ముస్కు శ్యాంసుందర్ రెడ్డి ఫంక్షన్ హాల్,
3) పెగడపల్లి మండలం 28-11-2022 అనగా సోమవారం సా|| 6-00 పద్మనాయక కళ్యాణ మండపం,
4) బుగ్గారం మండలం 29-11-2022 అనగా మంగళవారం సా॥ 6-00 ఘడి ప్రాంగణం,
5) ధర్మపురి మండలం 30-11-2022 బుధవారం అనగా సా॥ 6-00 దోనూర్ గ్రామంలోని చౌరస్తా,
6) ధర్మారం మండలం 01-12-2022 అనగా గురువారం సా|| 6-00 | శ్రీ లక్ష్మీనరసింహాస్వామి ఫంక్షన్హాల్, ఖిలా వనపర్తి
7) ఎండపల్లి మండలం 02-12-2022 అనగా శుక్రవారం సా॥ 6-00 యస్.ఆర్ గార్డెన్స్, రాజారాంపల్లి.