हैदराबाद: भद्राद्री कोत्तागुडेम जिले में भीषण सड़क हादसा हुआ। भगवान सीता माता और श्रीराम के दर्शन कर घर लौट रहे श्रद्धालुओं का वाहन अनियंत्रित होकर नदी में गिर गया। खबर है कि इस हादसे में चार बच्चों की दर्दनाक मौत हो चुकी है। बताया जा रहा है कि घटना के समय वाहन में 20 यात्री सवार थे।
मिली जानकारी के अनुसार, आंध्र प्रदेश के एलुरु जिले के नरसापुरम मंडल के तिरुमलदेवीपेट गांव निवासी एक ही परिवार के 20 लोग सीता माता और भद्राद्री रामय्या के दर्शन के लिए टाटा ऐस वाहन में भद्राचलम गया था। सीता माता और श्रीराम के दर्शन करने के बाद वे सभी उसी वाहन से वापस रवाना हो गये। हालांकि, बुर्गमपाडु मंडल के वेलेरू ब्रिज पर पहुंचते ही वाहन अचानक चालक के नियंत्रण से बाहर हो गया।
इसके चलते टाटा ऐस वाहन पुल के ऊपर से सीधे किन्नरसानी नदी में गिर गया। स्थानीय लोगों ने तुरं नदी में गिरे वाहन से यात्रियों को बाहर निकाला। घायलों को इलाज के लिए बुर्गमपाडु सरकारी अस्पताल में भर्ती कराया है। घायलों में बच्चे भी हैं।
सूचना मिलते ही पुलिस मौके पर पहुंची और घटना की जांच शुरू कर दी है। पुलिस हादसे की जांच कर रही है। हादसा चालक की लापरवाही से हुआ या कोई और कारण है इसकी जांच की जा रही है।
భద్రాద్రి కొత్తగూడెంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు చిన్నారులు మృతి
హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. రామయ్యను దర్శించుకుని తిరిగి ఇంటికి వెళ్తున్న భక్తుల వాహనం అదుపుతప్పి వాగులో పడిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటివరకు మొత్తం నలుగురు చిన్నారులు ప్రాణాలు వదిలినట్టు సమాచారం. అయితే ఈ ఘటన జరిగినప్పుడు వాహనంలో 20 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం.
కాగా ఏలూరు జిల్లా నర్సాపురం మండలం తిరుమలదేవిపేటకు చెందిన 20 మందితో ఓ ఫ్యామిలీ భద్రాద్రి రామయ్యను దర్శించుకునేందుకు ఓ టాటా ఏస్ వాహనంలో భద్రాచలం వెళ్లారు. సీతాసమేత రాములవారిని దర్శించుకున్న అనంతరం అదే వాహనంలో తిరుగుప్రయాణమయ్యారు. అయితే ఈ క్రమంలోనే బుర్గంపాడు మండలం వేలేరు బ్రిడ్జిపైకి రాగానే వాహనం ఒక్కసారిగా అదుపు తప్పింది. దీంతో టాటాఏస్ వాహనం బ్రిడ్జ్ పైనుంచి నేరుగా కిన్నెరసాని వాగులో పడిపోయింది.
స్థానికులు స్పందించి వాగులో పడిన వాహనం నుంచి ప్రయాణికులను బయటకు తీశారు. గాయపాలైన క్షతగాత్రులను బూర్గంపాడు ప్రభుత్వాసుపత్రికి చేర్చి చికిత్స చేయిస్తున్నారు. క్షతగాత్రుల్లో చిన్నారులు కూడా ఉన్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. అసలు ప్రమాదం ఎలా జరిగిందనేది దర్యాప్తు చేస్తున్నారు. అయితే డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణాల్లో విచారణ చేస్తున్నారు. (ఏజెన్సీలు)