हैदराबाद: बंजारा हिल्स में एक कार ने तबाही मचाई। नए साल की जोश में दो की मौत हो गई। रविवार तड़के बंजारा हिल्स में एक तेज रफ्तार कार नियंत्रण खोकर सड़क किनारे टिफिन कर रहे दो लोगों को कुचल दी। साथ दो सड़क किनारे खड़ी दो अन्य कारों को टक्कर मार दी। इस हादसे में दो लोगों की मौके पर ही मौत हो गई और दो अन्य गंभीर रूप से घायल हो गए।
सूचना मिलने पर पुलिस मौके पर पहुंच गई। घायलों को अस्पताल में भर्ती किया गया। दुर्घटना के लिए जिम्मेदार दो युवकों को हिरासत में लिया गया। मामला दर्ज कर लिया गया और जांच की जा रही है। पुलिस का मानना है कि कार चालक शराब के नशे में कार चला रहे थे।
రోడ్డు ప్రమాదం: నూతన సంవత్సర ఉత్సాహంలో ఇద్దరు మృతి
హైదరాబాద్: బంజారాహిల్స్లో కారు బీభత్సం సృష్టించింది. న్యూ ఇయర్ జోష్ ఇద్దరి ప్రాణాలను బలిగొన్నది. ఆదివారం తెల్లవారుజామున బంజారాహిల్స్లో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి రోడ్డుపక్కన టిఫిన్ చేస్తున్న ఇద్దరిపై నుంచి దూసుకెళ్లింది.
అప్పటికీ ఆగని కారు ఆగిఉన్న మరో రెండు కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
ప్రమాదానికి కారణమైన కారులో ఉన్న యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్ మద్యం సేవించినట్లు పోలీసులు భావిస్తున్నారు. (Agemcies)