ఎర్రబెల్లి ఏదో ఒక రోజు కేసీఆర్ ను కూడా మోసం చేస్తాడు కేసీఆర్ నిద్రపోతే ఆయనకు తెలియకుండానే కిడ్నీలు అమ్ముకునే తత్వం
చారిత్రక పాలకుర్తి గడ్డని.. ఓనమాలు రాని ఎర్రబెల్లి ఏలుతున్నాడు
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : “ఎర్రబెల్లి ఏదో ఒక రోజు కేసీఆర్ ను కూడా మోసం చేస్తాడు. కేసీఆర్ నిద్రపోతే ఆయనకు తెలియకుండానే కిడ్నీలు అమ్ముకునే తత్వం. బమ్మెర పోతన పుట్టిన చారిత్రక పాలకుర్తి గడ్డని.. ఓనమాలు రాని ఎర్రబెల్లి ఏలుతున్నాడు.” అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. హాత్ సే హత్ జోడో యాత్రలో భాగంగా పాలకుర్తి నియోజకవర్గంలో 18.5 కిలోమీటర్లపాటు రేవంత్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. అనంతరం పాలకుర్తి రాజీవ్ చౌక్ సెంటర్లో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
భాగవతం రచించిన బమ్మెర పోతన మహనీయుడు పుట్టిన గడ్డ
ఈ రోజు పాదయాత్రలో భాగంగా పీజీ చదివిన వికలాంగ నిరుద్యోగ యువకుడు నాగరాజును కలవడం జరిగింది. అతని దుఃఖం, కష్టాలను చూసి నాకూ దుఃఖం వచ్చింది. ఏ నియామకాల కోసం కొట్లాడామో తెలంగాణ ఏర్పాటు చేసుకున్నామో.. అదే తెలంగాణలో నియామకాల కోసం పోరాడాల్సిన పరిస్థితి దాపురించడం నిజంగా దురదృష్టకరం. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ విఫలమైనప్పుడు జానారెడ్డి ఇంట్లో జేఏసీ ఏర్పడింది. జేఏసీకి జెండాలు కట్టింది మనం. దొరగారికి దండాలు పెట్టింది మనం. రాష్ట్ర ఏర్పాటు అలస్యమైతే ప్రాణాలు తీసుకుంది మనం. కానీ వచ్చిన తెలంగాణ ఏవడి పాలైందో మీరే ఆలోచించండి. ఈ ప్రాంతానికి ఎంతో చరిత్ర ఉంది. భాగవతం రచించిన బమ్మెర పోతన మహనీయుడు పుట్టిన గడ్డ ఇది.
టీడీపీలో ఉండి కోవర్టు ఆపరేషన్ చేసి టీఆరెస్ కు…
దొరలు, గడీలపై తిరుగుబాటు జెండా ఎగరేసిన ఆడబిడ్డ చాకలి ఐలమ్మ గడ్డ ఇది.ఈ పోరాటాల పురిటిగడ్డలో పలక బలపం ఇచ్చినా ఏబీసీడీలు రాయలేనివాడు ఎమ్మెల్యే అయ్యాడు. చారిత్రక పాలకుర్తి గడ్డని.. ఓనమాలు రాని ఎర్రబెల్లి ఏలుతున్నాడని విమర్శించారు. పలక బలపం ఇస్తే ఈ ఎమ్మెల్యే ఏబీసీడీలు మొత్తం రాయగలడా అని రాజీవ్ చౌరస్తా సాక్షిగా సవాల్ విసురుతున్నా. సుధాకర్ రావును మోసం చేసి రాజకీయంగా ఖతం చేసిన చరిత్ర ఈ ఊసరవెల్లి దయాకర్ ది. 2014లో కేసీఆర్ సీఎం అయ్యేందుకు ఈ ఊసరవెల్లి దయాకర్ సహకరించిండు. టీడీపీలో ఉండి కోవర్టు ఆపరేషన్ చేసి టీఆరెస్ కు సహకరించి ఈ గడ్డపై టీడీపీ జెండాను పీకేసేలా చేశాడు. ఎర్రబెల్లి పచ్చిమోసగాడని..నమ్మక ద్రోహి. చంద్రబాబు నాయుడు ఎర్రబెల్లిని నమ్మి అసెంబ్లీ ప్లోర్ లీడర్ ను చేస్తే మోసం చేశాడు. టీడీపీలో ఉండి బీఆర్ఎస్ కు కోవర్టుగా పనిచేశాడు. టీడీపీ జెండాలను లేకుండా చేసిన ఎర్రబెల్లిని ఓడించి టీడీపీ ఆత్మగౌరవం కాపాడుకోవాలి.
ఎర్రబెల్లి అంటేనే నమ్మకద్రోహం
ధరణి పేరుతో దందాలు చేసి అమ్ముకున్న భూములపై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక విచారణ చేపడతాం. బినామీ లపై కూడా విజిలెన్స్ తో విచారణ చేయిస్తాం. దయాకర్ ను నమ్మినబంటు అని కేసీఆర్ అనుకుంటుండు. రాజకీయ భిక్ష పెట్టిన టీడీపీని కోవర్టు ఆపరేషన్ తో ఖతం చేసిండు. నువ్ మంత్రి పదవి ఇచ్చినా నీకు ద్రోహం చేయక మానడు. ఎర్రబెల్లి అంటేనే నమ్మకద్రోహం.. నమ్మకద్రోహం అంటేనే ఎర్రబెల్లి. ఏదో ఒక రోజు కేసీఆర్ ను కూడా ఎర్రబెల్లి మోసం చేస్తాడు. కేసీఆర్ నిద్రపోతే ఆయనకు తెలియకుండానే కిడ్నీలు అమ్ముకునే తత్వం దయాకర్ రావుది. పాలకుర్తి చౌరస్తాలో రాజీవ్ విగ్రహాన్ని ముట్టుకుంటే ఊరుకునేది లేదు. 2024, జనవరిలో కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇళ్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5లక్షల ఆర్థిక సాయం చేస్తాం.
పాలకుర్తి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయండి
రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేసి వారిని ఆదుకుంటాం. ఖాళీగా ఉన్న 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను ఒక్క ఏడాదిలోనే భర్తీ చేస్తాం. ఆడబిడ్డలకు రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తాం. పేదలకు వైద్యం అందించేందుకు 2 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీ మార్జిన్ ను 5లక్షలకు పెంచుతాం. ఇన్నీ మంచి పనులు చేయాలంటే పాలకుర్తి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయండి. ఈ హామీలు అమలు చేసే బాధ్యత మేం తీసుకుంటాం. తెలంగాణ తెచ్చామని చెప్పుకుంటున్న కేసీఆర్ కు రెండుసార్లు అవకాశం ఇచ్చారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్కసారి అవకాశం ఇవ్వండి.
కరెంటు తీగలు పట్టుకునేందుకు మేం రెడీ
మంత్రి జగదీష్ రెడ్డికి పొన్నం ప్రభాకర్ సవాల్
రాష్ట్రంలో వ్యవసాయానికి 24గంటల కరెంటు అందడం లేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. కరెంట్ తీగలు పట్టుకునేందుకు తాము రేడీగా ఉన్నామని, దమ్ముంటే జగదీష్ రెడ్డి తన సవాల్ స్వీకరించాలన్నారు. శ్రీరాంసాగర్ నీళ్లను కేసీఆర్ మహారాష్ట్రకు ఎలా తీసుకెళ్తారని ప్రశ్నించారు. శ్రీరాంసాగర్ నీళ్లు ముడితే రక్తపుటేరులు పారుతాయని ఆయన హెచ్చరించారు. కొండగట్టు బస్సు ప్రమాదం బాధితులను కేసీఆర్ ఇప్పటికీ పరామర్శించలేదని, వేములవాడ రాజన్నకు శఠగోపం పెట్టిన ఘనుడు కేసీఆర్ అని ఆయన ఎద్దేవా చేశారు. అటు ప్రధాని మోదీ వైఖరిపైనా పొన్నం మండిపడ్డారు. ఆదాని వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటులో మాట్లాడకపోవడం దారుణమన్నారు. ప్రధాని మోదీ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని, బీబీసీ మీడియా సంస్థపై ఐటీ దాడులు చేయడం హేయమైన చర్యగా ఆయన అభిప్రాయపడ్డారు. అన్యాయాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని పొన్నం ప్రశ్నించారు.
ఎర్రబెల్లిపై ఛార్జ్ షీట్ విడుదల
మంత్రి ఎర్రబెల్లిపై కాంగ్రెస్ నేతలు చార్జీషీట్ విడుదల చేశారు. ఒకప్పుడు రేషన్ డీలర్ గా ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుకు ఇప్పుడు కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి ప్రశ్నించారు. కోలుకొండలో 200ఎకరాలు గ్రానైట్ కంపెనీలకు అప్పగించారని, దయాకరరావు ఏపని చేసినా 30శాతం కమీషన్ తీసుకుంటారని ఆరోపించారు. పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్రలో పాల్గొనేందుకు రైతులు ఎడ్ల బండ్లతో పాల్గొనేందుకు స్వచ్ఛందంగా వస్తే పోలీసులతో అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. రైతులను హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ కు తరలించారన్నారు. కేసీఆర్ అంటేనే అబద్దాలకు కేరాఫ్ అడ్రస్ అని మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య విమర్శించారు. దళిత బంధులో అక్రమాలు జరుగుతున్నాయని.. అయినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు.
Errabelli will cheat KCR too one day
Illiterate Errabelli is ruling historical Palakurthi
He was in TDP and worked as a covert for BRS
TPCC President Revanth Reddy
Hydrabad : “Errabelli will cheat KCR too one day. If KCR sleeps, he will sell his kidneys without him even knowing it. Illiterate Errabelli is ruling historical Palakurthi where Bammera Potana was born.” said TPCC President Revanth Reddy. As part of Hath Se Hath Jodo Yatra, Revanth Reddy conducted a padayatra for 18.5 kilometers in Palakurti Constituency. Later, Revanth Reddy addressed the street corner meeting organized at Palakurti Rajiv Chowk. “Today as part of the padayatra we met Nagaraju, a disabled unemployed youth who studied PG. I was also saddened to see his sorrow and suffering. It is really unfortunate that we have to fight for employment in the same Telangana for which we fought for employment. JAC was formed in Jana Reddy’s house when KCR failed in the Telangana movement.
We are the ones who put up the flags for JAC. We are the ones who saluted Dora. When the formation of Telangana was delayed, it is we who sacrificed our lives. But think for yourself about what happened to Telangana once it became a separate state. This area has a lot of history. This is the birthplace of Bammera Potana who wrote the Bhagavata. This is the land of Ailamma, the legendary washerwoman who raised the flag of rebellion against the aristocrats and Gadis. In the midst of these struggles, the one who could not write ABCDs even if a slate and slate pencil is given became an MLA. He criticized that an illiterate is ruling historical Palakurthi. I am throwing a challenge from Rajeev Chowrastha if MLA will be able to write the alphabet if he is given a slate and slate pencil. The story of this chameleon Dayakar is that he cheated Sudhakar Rao and killed him politically.
This chameleon Dayakar helped KCR become CM in 2014. Being in TDP, he did a covert operation and cooperated with TRS, and made the TDP flag uprooted from this land. Errabelli is a cheater.. a traitor. Chandrababu Naidu trusted Errabelli and made him the floor leader of the assembly but he cheated Babu. He was in TDP and worked as a covert for BRS. TDP’s self-respect should be saved by defeating Errabelli who uprooted the TDP flags. After the Congress party comes to power, we will conduct an inquiry into the land settlements in the name of Dharani. We will also investigate Benamis with vigilance. KCR thinks that Dayakar is a trusted person. He killed the TDP which gavea political future with a covert operation. Even if you give him the post of minister, he will not stop betraying you. Errabelli means betrayal.. Betrayal means Errabelli. One day Errabelli will cheat KCR too.
Dayakar Rao is capable of sellig KCR’s kidneys when he is asleep. We will not watch silently if the statue of Rajiv Gandhi in Palakurti Chowrasta. Congress party will be in power in January in the new year of 2024. We will give financial assistance of Rs.5 lakh to every poor who builds houses under the Congress government. We will support the farmers by waiving their loans of Rs.2 lakhs. We will fill up 2 lakh vacant government jobs within one year. We will provide gas cylinders for women for Rs.500. We will increase the Arogyashri limit from Rs.2 lakhs to Rs.5 lakhs to provide medical care to the poor. If you want all these good things to be done, hoist the Congress flag on Palakurti soil. We will take responsibility to enforce these guarantees. KCR, who claims to have brought Telangana, was given a chance twice. Give a chance to Congress which gave Telangana.
We are ready to hold the electric wires
Ponnam Prabhakar challenges Minister Jagdish Reddy
Former MP Ponnam Prabhakar said that agriculture fields in the state is not getting 24 hours electricity. They said that they are ready to hold the electricity wires and dared Jagdish Reddy to accept his challenge. He questioned how KCR will take Sriramsagar water to Maharashtra. He warned that if the waters of Sri Ramsagar are touched, there will be bloodshed. He said that KCR has not yet visited the victims of the Kondagattu bus accident and that KCR cheated Vemulawada Rajanna. Ponnam also got angry at Prime Minister Modi’s attitude. It is outrageous that Prime Minister Narendra Modi did not speak in Parliament on the Adani issue, he said. He said that Prime Minister Modi is acting like a dictator and opined that IT attacks on BBC media organization is a heinous act. Ponnam questioned whether they would attack if injustices were questioned.
Chargesheet on Errabelli released
Congress leaders released the charge sheet against Minister Errabelli. Janagama DCC President Janga Raghavareddy asked from where did Minister Errabelli Dayakara Rao, who was once a ration dealer, get assets worth crores. He alleged that 200 acres in Kolukonda were handed over to granite companies and Dayakara Rao would take 30 percent commission for whatever he did.
He said that the development in the Palakurti constituency took place during the Congress regime. He alleged that when the farmers volunteered to participate in the Revanth Reddy padayatra, they were stopped by the police. Farmers were shifted to MLA quarters in Hyderabad. Former MP Sircilla Rajaiah criticized KCR as a care-of-address for liars. He alleged that there are irregularities in Dalit Bandhu, but the government is not paying attention.