“డిసెంబర్ 9న సోనియాగాంధీ జన్మదిన కానుకగా కాంగ్రెస్ గెలుపును అందిద్దాం”

సెప్టెంబర్ 17 న కాంగ్రెస్ మ్యానిఫెస్టో

డబుల్ ఇంజన్ అంటే ఆదానీ, ప్రధాని

దేశాన్ని దోచుకోవడమే ఈ డబుల్ ఇంజన్ పని

అధికారంలోకి వచ్చాక ధరణిని బరాబర్ రద్దు చేస్తాం

2004-2014, 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధం

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

హైదరాబాద్: “రాష్ట్రంలో కేసీఆర్ పై చేసే పోరాటంలో గెలవాలంటే యువత ముందుండాలి. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమించాలి. డిసెంబర్ 9 న సోనియా గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావాలి” అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టో ను తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17 న విడుదల చేస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

శుక్రవారం హైదరాబాద్ సోమాజిగూడలోని కత్రియా హోటల్లో జరిగిన యూత్ కాంగ్రెస్ జాతీయ సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. “కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 9న సోనియాగాంధీ జన్మదినం అధికారికంగా నిర్వహిస్తుంది.‘‘ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నా. అత్యంత కీలకమైన ఐదు అంశాలతో ప్రజలవద్దకు వెళ్తాము. అగ్రనాయకులు అందుబాటులో ఉండే అవకాశాన్ని బట్టి బహిరంగ సభలు ఉంటాయి. కర్ణాటకలో మాదిరిగానే తెలంగాణలో కూడా కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుంది.’’ అని రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో యూత్‌ కాంగ్రెస్‌ క్రియాశీల పాత్రపై సమావేశంలో చర్చించినట్లు రేవంత్‌ రెడ్డి తెలిపారు.

‘‘2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి.. రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయాలి. దీనికి అవసరమైన కార్యాచరణపై యూత్‌ కాంగ్రెస్‌కు దిశా నిర్దేశం చేశాం. క్షేత్ర స్థాయిలో కీలకంగా పని చేసిన వారు.. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నాయకులవుతారని చెప్పాం. మోదీ, కేసీఆర్‌లను గద్దె దించాలంటే యూత్‌ కాంగ్రెస్‌ క్రియాశీలకంగా పని చేయాలి.’’ అని రేవంత్ అన్నారు.

క్షేత్ర స్థాయిలో కొట్లాడేవారు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నాయకులవుతారని వ్యాఖ్యానించారు. కష్టపడితే నాయకులు అవుతారు. దేశ భవిష్యత్తును మార్చుతారు. మోదీ, కేసీఆర్ లను గద్దె దించాలంటే యూత్ కాంగ్రెస్ క్రియాశీకలకంగా పనిచేయాలి. రాజకీయ భవిష్యత్‌కు యూత్ కాంగ్రెస్ ఒక మంచి వేదికన్నారు. నాయకుడుగా మారడానికి యూత్ కాంగ్రెస్ ఒక వేదిక అని రేవంత్ తెలిపారు. ఇందుకు ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే మనకు ఉదాహరణ అని వివరించారు. 1200 మంది విద్యార్థి, యువత ప్రాణత్యాగాలతో తెలంగాణ ఏర్పడిందని గుర్తు చేశారు.

డబుల్ ఇంజన్ అంటే ఆదానీ, ప్రధాని అని ఎద్దేవా చేశారు. దేశాన్ని దోచుకోవడమే ఈ డబుల్ ఇంజన్ పని అని స్పష్టం చేశారు. వన్ నేషన్ వన్ పార్టీ అనేది బీజేపీ రహస్య ఎజెండా అని వెల్లడించారు. బీజేపీ కుట్రలను ఛేదించి దేశంలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలన్నారు. త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయని కార్యకర్తలంతా క్రియాశీలకంగా పనిచేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం అందరం సమిష్టిగా కష్టపడదామని పిలుపునిచ్చారు. తెలంగాణలో కేసీఆర్‌ను ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ పై చేసే పోరాటంలో గెలవాలంటే యువత ముందుండాలని తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమించాలని రేవంత్ రెడ్డి అన్నారు.

ధరణిని బరాబర్ రద్దు చేస్తాం

గడీల పాలన పునరుద్ధరించడానికే కేసీఆర్ ధరణి తీసుకొచ్చారు అని రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బినామీల పేరిట సీఎం కేసీఆర్ వేల ఎకరాలను కొట్టేశారని రేవంత్ ఆరోపించారు. “కొద్ది మంది భూస్వాముల కోసమే ధరణి తెచ్చారు. ధరణి పోర్టల్ ను పూర్తిగా ఎత్తివేస్తాం. 97 శాతం భూవివాదాలకు ధరణ పోర్టలే కారణం. మాట ఇచ్చిన ప్రకారం ధరణిని బరాబర్ రద్దు చేస్తాం.” రంగారెడ్డి, సంగారెడ్డి, మల్కాజ్ గిరి జిల్లాల్లో భూ అవకతవకలు జరిగాయి. “వేల ఎకరాలు కేసీఆర్ బినామీలకు కట్టబెట్టారు. అవకతవకలకు పాల్పడ్డ అధికారులను ఊచలు లెక్కబెట్టిస్తాం” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ప్రభుత్వ అధికారుల దగ్గర ఉండాల్సిన సమాచారం దళారుల చేతికి వెళ్లిందన్నారు. ధరణి పోర్టల్ ప్రభుత్వ ఆధీనంలో లేదు. ధరణి రాకముందు రైతు బంధు రాలేదా?ధరణి పోర్టల్ ప్రారంభించిన ఊరిలో భూముల రికార్డు లేదు అని ఎద్దేవా చేశారు. ధరణిని రద్దు చేస్తామంటే కేసీఆర్ కు ఎందుకంత దుఃఖం వస్తుంది అని ప్రశ్నించారు. “ధరణి పోర్టల్ ను కేసీఆర్ దోపిడీకి వాడుకున్నారు. ఖచ్చితంగా ధరణి పోర్టల్ రద్దు చేస్తాం. ఏడ్చి, గోల పెట్టినా… తండ్రి కొడుకులను జైలుకు పంపిస్తాం.ధరణి అవకతవకలపై కేసీఆర్ కుటుంబం చర్లపల్లి జైలుకెళ్లడం ఖాయం” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

మంత్రి కేటీఆర్‌ చేసిన సవాల్‌ను స్వీకరించినట్లు రేవంత్‌రెడ్డి తెలిపారు. 2004 నుంచి 2014 వరకు జరిగిన అభివృద్ధి, 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ‘ 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్‌ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధం. 2014 తర్వాత జరిగిన అభివృద్ధిపై కేటీఆర్‌, హరీశ్‌ చర్చకు సిద్ధమా?’ అని రేవంత్ అన్నారు.

“కాంగ్రెస్ చేయనిది ఏదైనా మీరు చేసి ఉంటే మేం క్షమాపణ చెప్పడానికి సిద్ధం..తండ్రి కొడుకులు నిప్పు తొక్కిన కోతిలా ఎగురుతున్నరు. కాంగ్రెస్ వస్తే ఏం చేస్తుందని అడుగుతున్నారు. కేసీఆర్ లా మేం రాష్ట్రాన్ని కొల్లగొట్టం.. దోపిడీలు చేయం..కేసీఆర్ కు బుద్ది జ్ఞానం ఉంటే ఉద్యమకారులను పువ్వుల్లో పెట్టి చూసుకునేవారు. అమరవీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం, సచివాలయ నిర్మాణంలోనూ అవినీతికి పాల్పడ్డారు. కేసీఆర్ నిజంగా తెలంగాణ బిడ్డ అయితే రేవంత్ రెడ్డి పేరు తీయాలి. నా పేరు పలికేందుకు కేసీఆర్ కు భయం” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ అడ్డుకోవడానికే కేసీఆర్ చిల్లర మల్లర వేషాలు వేస్తున్నారు. ప్రజలు ఎవరిని శంకరగిరి మాన్యాలు పట్టిస్తారో త్వరలోనే తెలుస్తుందన్నారు.కేసీఆర్ రద్దైన వెయ్యి నోటులాంటివాడుమోదీ 2వేల నోటు లాంటి వాడు అని ఎద్దేవా చేశాడు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండి ఈ దొంగల పాలన నుంచి విముక్తి కల్పిస్తామని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు మంచిరోజులు రాబోతున్నాయి. కర్ణాటక ఫలితాలు తెలంగాణలో పునరావృతం అవుతాయి అని రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X