हैदराबाद: मिर्च सोना बन गई है। वरंगल के एनुमामुला बाजार में मिर्च की रिकॉर्ड कीमत देखी गई। वरंगल और खम्मम के कुछ हिस्सों में ही उगाई जाने वाली इस खास एक क्विंटल मिर्च को एक व्यापारी ने 80,100 रुपये में खरीदा है। ‘चपाटा’ नामक इस देसी प्रकार की मिर्च को एक किसान बाजार लेकर आया था।
चैत्र इंटरप्राइजेज के लोगों ने इतनी कीमत में इसे खरीदा है। व्यापारी ने बताया कि इस तरह की मिर्च की डिमांड है और इसका इस्तेमाल ज्यादातर अचार में किया जाता है। किसानों ने बताया कि उत्तर भारत में भी इस मिर्च की डिमांड है। हालांकि, इस बार उपज बहुत कम है। इसलिए इस बार मिर्ची ज्यादा ‘तीखी’ हो गई है। सामान्य मिर्च 25 से 35 हजार रुपये प्रति क्विंटल बिक रही है। यह खास मिर्च 80 हजार से ज्यादा दाम पर बिक रही है।
पिछले साल इसी तरह की मिर्च 90 हजार रुपये में बिकी थी। किसानों को उम्मीद है कि इस बार आयात कम होने के कारण कीमत एक लाख रुपये से ज्यादा हो सकती है। शुक्रवार (6 जनवरी) को जब एनुमामुला बाजार में तीन हजार बोरी मिर्च आई तो महज डेढ़ घंटे में ही खरीदारी पूरी हो गई। बाजार आते ही मिर्च की बिक्री हो जाने से किसान खुशी जाहिर की हैं।
खम्मम जिले के कुसुमंची मंडल के रावि चेट्टूतांडा निवासी रामुलू नाइक देसी मिर्ची की केवल 4 बोरी लेकर आया। इस मिर्च को खरीदने के लिए व्यापारियों में होड़ मच गई। चैत्र इंटरप्राइजेज के मालिक ने इस मिर्च को 80,100 रुपये में खरीदा। बताया जाता है कि इस कंपनी का अचार विदेशों में भी ले जाया जाता है।
बाजार प्रबंधकों ने बताया कि पिछली इस देसी किस्म की मिर्च के 1000 से 2000 बोरे रोजाना बाजार में आते थे। लेकिन पैदावार में भारी कमी के कारण इस बार चार से पांच बोरी से ज्यादा नहीं आ रही है।
మిర్చి బంగారం, క్వింటాల్ రూ. 80,100
హైదరాబాద్: మిర్చి బంగారమైంది. వరంగల్‌లోని ఎనుమాముల మార్కెట్‌లో మిర్చి రికార్డు ధర పలికింది. వరంగల్, ఖమ్మంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పండే ఈ ప్రత్యేక మిర్చిని ఓ వ్యాపారి క్వింటాలుకు రూ. 80,100 ధర పెట్టి కొనుగోలు చేశాడు. ‘చపాటా’ అని పిలిచే ఈ దేశీ రకం మిర్చిని ఖమ్మంకు చెందిన ఓ రైతు తీసుకొచ్చాడు.
చైత్ర ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన వారు ఇంత ధర పెట్టి కొనుగోలు చేశారు. ఈ రకానికి చెందిన మిర్చికి డిమాండ్ ఉందని, పచ్చళ్లలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారని ఆ వ్యాపారి తెలిపారు. ఉత్తర భారతదేశంలోనూ ఈ మిర్చికి డిమాండ్ ఉందని రైతులు చెప్పారు. అయితే, ఈసారి దిగుబడి చాలా తక్కువగా ఉందని తెలిపారు. అందుకే మిర్చి ఈసారి మరింత ఘాటెక్కింది. సాధారణ మిర్చి క్వింటాలకు 25 వేల రూపాయల నుంచి 35 వేల రూపాయల వరకు పలుకుతోంది. ప్రత్యేకమైన ఆ మిర్చి మాత్రం రూ. 80 వేలకు పైగా పలకడం ఆసక్తిగా మారింది.
గతేడాది ఇదే రకమైన మిర్చి రూ. 90 వేలు పలికింది. ఈసారి దిగుమతి తక్కువగా ఉండటంతో ధర లక్ష రూపాయలకు పైగా పలకవచ్చని రైతులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం (జనవరి 6) ఎనుమాముల మార్కెట్‌కు 3 వేల మిర్చి బస్తాలు వస్తే, కేవలం గంటన్నరలోనే కొనుగోళ్లు పూర్తయ్యాయి. మార్కెట్ వచ్చీ రాగానే మిర్చి అమ్ముడవంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం రావి చెట్టు తండాకు చెందిన రాములు నాయక్ దేశీ మిర్చి 4 బస్తాలు మాత్రమే తీసుకొచ్చారు. ఈ మిర్చిని కొనేందుకు వ్యాపారులు పోటీ పడ్డారు. చైత్ర ఎంటర్‌ప్రైజెస్ యజమాని ఈ మిర్చిని 80,100 రూపాయలకు కొనుగోలు చేశారు. ఈ సంస్థ నుంచి పచ్చళ్లు విదేశాలకు కూడా తీసుకెళ్తారని చెబుతున్నారు.
గతంలో దేశీ రకానికి చెందిన ఈ మిర్చి మార్కెట్‌కు రోజుకు 1000 నుంచి 2000 బస్తాలు వచ్చేవి. కానీ, దిగుబడి బాగా తగ్గడంతో ఈసారి నాలుగైదు బస్తాలకు మించి రావడంలేదని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా గుర్తింపు ఉన్న వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు చపాటా, తేజ, సింగిల్‌పట్టీ, వండర్ హాట్, దీపిక, మిర్చి-1048, మిర్చి – 341 రకాలు వస్తుంటాయి.
గతేడాది మార్చిలో సాధారణ మిర్చి క్వింటాల్‌కు రూ. 52 వేల ధర పలికింది. ఈ నేపథ్యంలో ముందు ముందు మిర్చి ధర మరింత ఎక్కువ ధర పలికే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు. వేసవి వస్తుండటంతో ఈ సమయంలో పచ్చళ్లకు గిరాకీ పెరుగుతుందని, మిర్చికి కూడా డిమాండ్ పెరుగుతుందని చెబుతున్నారు. (Agencies)