డా. వివేక్ వెంకట స్వామి, మాజీ ఎంపీ, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు
హైదరాబాద్: కర్ణాటకలో సిట్లు తగ్గినప్పటికీ ఓటింగ్ శాతం ఏమాత్రం తగ్గలేదు. అంటే 2018 లో బీజేపీతో ఉన్న ఓటర్లు ఇప్పుడు కూడా మాతోనే ఉన్నారు. అయితే ఈ సారి జేడీఎస్ ఓట్ల శాతం కాంగ్రెస్ కు పోవడంతో ఆ పార్టీ సీట్లు పెరిగాయి.
కర్ణాటకలో గతంలో ఎన్నడూ లేనంతగా ఈ మూడున్నరేళ్లలో భారీ అభివృద్ధి జరిగింది. అంతే కాకుండా కేంద్రం నుంచి కూడా గతం కంటే కర్ణాటకలో భారీ కేటాయింపులతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అయితే కర్ణాటక ఓటర్లు అభివృద్ధి కంటే కూడా గత మూడు దశబ్దాలుగా ప్రతి దఫా ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయానికే ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించింది. అంతే కాకుండా సరిగ్గా ఎన్నికల వేళ కాంగ్రెస్ సోషల్ మీడియా చేసిన దుష్ప్రచారం ఓటర్లను తీవ్ర గందరగోళానికి గురిచేసింది.
కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ఎట్టిపరిస్థితుల్లో తెలంగాణాపై ప్రభావం చూపవు. తెలంగాణాలో కాంగ్రెస్ గ్రౌండ్ పూర్తిగా బలహీనపడింది. రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బండి సంజయ్ గారి నాయకత్వంలో భారతీయ జనతాపార్టీ బూత్ స్థాయి నుంచి బలడుతూ వస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బీజేపీ బాగా బలడిందనేందుకు దుబ్బాక, హుజూరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలే అద్దం పడుతున్నాయి. అంతే కాకుండా మునుగోడు ఎన్నికల్లో కూడా బీజేపీ ఓటు శాతం గణనీయంగా పెరిగింది. బండి సంజయ్ గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ ఉధృతంగా ఉద్యమాలు చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా భారీ మెజార్టీతో అధికారాన్ని కైవసం చేసుకుంటుంది.
శ్రీమతి డీకే అరుణ, మాజీ మంత్రి, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు
కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ ఆశించిన దానికంటే ఎక్కువ సీట్లు గెలిచిన మాట వాస్తవమే అయినప్పటికీ, భారతీయ జనతా పార్టీ ఓట్ల శాతం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. 2018 ఎన్నికల్లో 36 శాతం ఓట్లు సాధించి 104 సీట్లలో విజయం సాధించిన బిజెపి, ఈ ఎన్నికల్లో 36 శాతం పైగా ఓట్లు సాధించింది. అయితే మెజారిటీ సీట్లు గెలవడంలో మాత్రం వెనుకబడ్డాం. గత ఎన్నికల్లో 18 శాతం ఓట్లు సాధించిన జేడీఎస్ పార్టీ.. ఈ ఎన్నికల్లో 12 శాతమే ఓట్లు పొందింది.
అనేక స్థానాల్లో జేడీఎస్ పార్టీ ఓట్లు కాంగ్రెస్ కు రావడం వల్లే ఈ 5 శాతం అదనపు ఓట్ షేర్ కాంగ్రెస్ కు సాధ్యమైంది. అదే సందర్భంగా కర్ణాటకలో ఎన్నికల చివరి దశలో ఎంఐఎం, ఎస్డీపీఐ పార్టీలు తమ అభ్యర్థులను విరమించుకుంటూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాయి. ఈ రెండు పార్టీలు ముస్లిం మైనార్టీలను కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లేందుకు కృషి చేశాయి. కాబట్టే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల శాతం, సీట్ల శాతం పెరిగింది.
అయితే, ఈ ఎన్నికల ఫలితాలు కర్ణాటక రాజకీయాల్లో కొత్త ఒరవడికి నాందిగా మారాయి. గత 4 దశాబ్దాలుగా కర్ణాటక రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన మూడో ప్రత్యామ్నాయం అయిన (ఒకప్పటి జనతా పార్టీ, తర్వాత జనతాదళ్, ఇప్పుడు జేడీఎస్)… పార్టీలు ఏమాత్రం రాజకీయంగా ప్రభావితం చూపించలేదు. రాబోయే రోజుల్లో కర్ణాటక రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీల మధ్యనే పోటీ ఉంటుందనే ఓటర్లు తీర్పునిచ్చారు. ఈ మార్పునకు అనుగుణంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి తమ ఎన్నికల ఎత్తుగడలను రూపొందించుకుంటుంది.
మరోవైపు కాంగ్రెస్ పార్టీకి కూడా ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో దేశ సమగ్రతను, సమైక్యతకు భంగం వాటిల్లే విధంగా ప్రవర్తించింది. మైనారిటీల ఓట్లను బుజ్జగించడం కోసం ఏ స్థాయికైనా దిగజారింది. దీన్ని కర్ణాటక ప్రజలతో పాటు దేశ ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఈ ఎన్నికల సమయంలో మైనారిటీలను బుజ్జగించేందుకు తీవ్రవాదాన్ని ప్రోత్సహించే సంస్థలతో కూడా కలిసేందుకు అయినా సిద్ధమేనన్నట్లు వ్యవహరించింది. ఏదేమైనా ఈ ఎన్నికల్లో బిజెపి సీట్లు తగ్గడానికి, ఓటమికి గల కారణాలను నిశితంగా విశ్లేషిస్తాం. దానికి అనుగుణంగానే వచ్చే ఎన్నికల్లో బిజెపి విజయం సాధించేలా నిర్ణయాలు తీసుకుంటుంది.
కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేస్తుందని ఏమాత్రం అనుకోవడం లేదు. గత ఎన్నికల్లో కర్ణాటకలో 105 సీట్లు గెలిచినా, తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ఒక్కసీటు మాత్రమే సాధించడాన్ని గుర్తుంచుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, దాని మిత్రపక్షమైన జేడీఎస్, ఎంఐఎం పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేశాయి. బిజెపియేతర పక్షాలన్నీ… ముఖ్యంగా ఎంఐఎం లాంటి పార్టీలు కాంగ్రెస్ కు సహకరించడం వల్లనే కాంగ్రెస్ కు ఈ గెలుపు సాధ్యమైంది. దీని వెనకాల బీఆర్ఎస్ పాత్ర ఉందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
N.V. SUBHASH (BJP State Official Spokes Person)
BJP respects the mandate. We will play the role of constructive opposition in Karnataka effectively. We hope that the Congress will not question EVMs and other constitutional institutions.
BJP is the biggest political party in the World. We have full faith in democratic processes. BJP accepts this decision of the people of Karnataka and will continue to work for the development of Karnataka. Though our seats have definitely come down, but our vote share has remained intact as compared to last elections.
The main reason for the victory of Congress is the shift of JDS votes to Congress. We could not counter the negative politics and negative election campaign of Congress properly on the ground. We accept this fact. Wherever there is a lapse, the party will sit and brainstorm on it and rectify things on the ground before the 2024 Lok Sabha election.
We demand that Congress will focus on the development of Karnataka instead of playing politics of polarization and agenda of PFI and also minority appeasement.
The Karnataka election results will have no impact in Telangana as BJP is very strong and people have decided to vote for BJP. Telangana will be the gateway of South for BJP.