రాజ్ బహదూర్ వెంకట్రామిరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ నూతన వసతి గృహ భూమి పూజ

హైదరాబాద్: రాజ్ బహదూర్ వెంకట్రామిరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ నూతన వసతి గృహ నిర్మాణానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి నిరంజన్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి లతో కలిసి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు. ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీ వాణిదేవి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి , శ్రీధర్ రెడ్డి రాజ్ బహదూర్ వెంకట్రామిరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.

మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ

రాజ్ బహుదూర్ వెంకట్రామ్ రెడ్డి స్థాపించిన ఎడ్యుకేషనల్ సొసైటీ విస్తరణలో భాగంగా ఈరోజు కొత్త భవనానికి భూమి పూజ చేసుకోవడం సంతోషంగా ఉంది. పేద గ్రామీణ యువతకు తక్కువ ఖర్చుతో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వీలుగా ప్రపంచ స్థాయి విద్యా సంస్థ, వసతి గృహా సముదాయాన్ని ఏర్పాటు చేయడం కొరకు బుద్వేల్ నందు (15) ఎకరముల ప్రభుత్వ భూమిని కేటాయించి సీఎం గారు తన గొప్ప మనస్సును చాటుకున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశయానికి తగ్గట్టు ఇక్కడ ఏదైనా మంచి యూనివర్సిటీ వచ్చి విద్యార్థులకు ఉపయోగపడితే ఎంతగానో ఈ సమాజానికి మీ సొసైటీకి గర్వకారణంగా నిలుస్తుంది. రాజా బహదూర్ వెంకటరాం రెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ అనేది సేవా ఆధారిత, లాభాపేక్ష రహిత సంస్థ, పేద గ్రామీణ యువతకు వారి ఉన్నత విద్యను చాలా తక్కువ ఖర్చుతో అభ్యసించడానికి సేవలు అందిస్తుంది.

ముఖ్యంగా బాలికల విద్య కోసం రాజ బహుదూర్ వెంకటరామిరెడ్డి గారు చేసిన కృషి ఈరోజు ఎంతోమంది పేద గ్రామీణ విద్యార్థినిలకు అవకాశాన్ని కల్పించింది. భారత మాజీ ప్రధాని దివంగత శ్రీ పి.వి.నరసింహారావు గారు, స్వర్గీయ శ్రీ రావి నారాయణరెడ్డి, మాజీ కేంద్ర మంత్రి శ్రీ ఎస్. జైపాల్ రెడ్డి, జస్టిస్ ఎ. సీతారాంరెడ్డి, జస్టిస్ బి.పి.జీవన్ రెడ్డి, రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి, అనేక మంది ప్రముఖులు RBVRR హాస్టల్లో ఉన్నవారే.

భవన నిర్మాణానికి ఐదుకోట్ల నిధులను త్వరలో విడుదల చేసేందుకు కృషి చేస్తాం. డబ్బులు సంపాదించే విద్యా సంస్థగా కాకుండా పేద విద్యార్థులకు విద్యను అందించి సమాజంలో ఉన్నతమైన విలువలు నెలకొల్పాలని కోరుకుంటున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X