हैदराबाद: बैडमिंटन स्टार खिलाड़ी पीवी सिंधु के बारे में कुछ खास कहने की जरूरत नहीं है। सिंधु ने अपने खेल में उत्कृष्ट प्रदर्शन किया और कई पदक हासिल कीं। उन्होंने न केवल तेलंगाना बल्कि देश में भी गौरवान्वित खिलाड़ियों में से एक बन गई। वह रियो ओलंपिक में रजत पदक और टोक्यो ओलंपिक में कांस्य पदक जीतने वाली पहली भारतीय महिला बनीं। अपने खाते में कई पुरस्कार और रिकॉर्ड दर्ज कराने वाली पीवी सिंधु को भारत सरकार द्वारा पद्मश्री से सम्मानित किया जा चुका है।
इसके अलावा पीवी सिंधु स्पोर्ट्स के अलावा सोशल मीडिया पर भी काफी एक्टिव रहती हैं। वह रील फोटोशूट करवाकर काफी ए्क्टिव रहती है। कभी-कभी वह अपने पसंदीदा गानों पर थिरकती हैं और डांस करती हैं। हाल ही में पीवी सिंधु ने मेगास्टार चिरंजीवी के गाने पर डांस किया। डांस का वीडियो सिंधु के इंस्ट्राग्राम पर उपलब्ध है।
మెగాస్టార్ చిరంజీవి పాటకు పీవీ సింధు డ్యాన్స్
హైదరాబాద్ : బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన ఆటతో సత్తా చాటుతూ అనేక పథకాలను సాధించింది. దీంతో తెలంగాణే కాకుండా దేశం గర్వించే క్రీడకారిణిల్లో ఒకరిగా నిలిచింది. రియో ఒలింపిక్స్ లో సిల్వర్, టోక్యో ఒలింపిక్స్ లో బ్రౌంజ్ మెడల్స్ సాధించి తొలి భారతీయ మహిళగా రికార్డ్ సృష్టించింది. ఇలా తన ఖాతాలో ఎన్నో అవార్డులు, రికార్డులు వేసుకున్న పీవీ సింధును భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది.
అయితే పీవీ సింధు ఆటల్లోనే కాకుండా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. తరచూ ఫొటోషూట్స్ రీల్స్ చేస్తూ సందడి చేస్తుంది. అప్పుడప్పుడు తనకు నచ్చిన పాటలపై స్టెప్పులేస్తూ డ్యాన్స్ లోనూ అదరగొడుతోంది. తాజాగా పీవీ సింధు మెగాస్టార్ చిరంజీవి పాటకు స్టెప్పులేసింది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ సినిమాలోని బాసు వేర్ ఈజ్ ద పార్టీ అనే పాట ఎంత హిట్టయ్యిందో అందరికి తెలిసిందే. తాజాగా ఈ పాటకు పీవీ సింధు డ్యాన్స్ చేసింది. బ్లూ కలర్ లెహంగా డ్రెస్స్‌లో స్టైలిష్‌గా ఉన్న సింధు ఈ పాటకు స్టెప్పులేసి మరింత అందం తీసుకొచ్చింది. డ్యాన్స్ వీడియోను సింధు ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా ఇది వైరల్‌గా మారింది. షేర్ చేసిన కొన్ని గంటల్లోనే 332,968 లక్షల మంది ఈ వీడియోను ఇష్టపడగా వేలకొద్ది కామెంట్స్ వచ్చాయి. గాయం నుంచి కోలుకున్న సింధు ప్రస్తుతం బ్యాడ్మింటన్ ఆసియా మిక్స్‌డ్ ఛాంపియన్‌షిప్స్‌లో అడుతుంది. ఈ టోర్నీలో భారత్ యూఏఈ, మలేసియా, కజకిస్తాన్ లతో కలిసి గ్రూప్-బిలో ఉంది. (ఏజెన్సీలు)