విజయవంతంగా ప్రజాపాలన నిర్వహణ: సి ఎస్ శాంతి కుమారి, తొలిరోజు 7,46,414 అభయహస్తం దరఖాస్తులు

హైదరాబాద్: ప్రజా పాలన ప్రారంభమైన మొదటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా 7,46,414 దరఖాస్తులను స్వీకరించడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుండి 2,88,711 దరఖాస్తులు, పట్టణ ప్రాంతాల నుండి జిహెచ్ఎమ్ సి తో సహా 4,57,703 దరఖాస్తులు స్వీకరించామని వెల్లడించారు.

ప్రజాపాలన కార్యక్రమ నిర్వహణపై నేడు జిల్లా కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. మున్సిపల్, పంచాయితీ రాజ్ శాఖల ముఖ్య కార్యదర్శులు దాన కిషోర్, సందీప్ సుల్తానియా లు కూడా పాల్గొన్న ఈ టెలీ కాన్ఫరెన్స్ లో సి.ఎస్. మాట్లాడుతూ, ప్రతీ కేంద్రంలోనూ సరిపడా ఆరు గ్యారెంటీల అభయహస్తం దరఖాస్తు ఫారాలు ఉంచాలని స్పష్టం చేశారు.

మొదటి రోజైన గురువారం నాడు గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన లభించిందని అన్నారు. ఈ అభయహస్తం ఫారాలు ఎవరైనా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ గ్రామ సభలకు హాజరయ్యే వారికి కనీస మౌలిక సదుపాయాలైన మంచినీటి వసతి కల్పించడంతో పాటు క్యూ లైన్లు పాటించేలా చర్యలు చేపట్టాలని అన్నారు.

ప్రతీ వంద మందికి ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రజా పాలనలో స్వీకరించిన ప్రతీ దరఖాస్తుకు ప్రత్యేక నెంబర్ ఇవ్వాలని మరోసారి తెలిపారు. ఫారాలను నింపడానికి, ఇతర అవసరాలకు గాను ప్రత్యేక హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X