డా బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బుధవారం కూడ కొనసాగిన నిరసనలు
హైదరాబాద్: డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ పది ఎకరాల స్థలం జవహర్ లాల్ నెహ్రు అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి (జె.ఎన్.ఏ.ఎఫ్.ఏ.యూ) కేటాయించే లేఖను వెంటనే ఉపసంహరించుకోవాలని మాజీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు.
పది ఎకరాల స్థలం కేటాయించాలనే ప్రభుత్వ ఆలోచనను నిరసిస్తూ అంబేద్కర్ వర్షీటీ ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు లంచ్ అవర్ డెమోనిస్ట్రేషన్ లో భాగంగా బుధవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నిరసనలో విశ్వవిద్యాలయ మాజీ డిప్యూటీ రిజిస్ట్రార్, ఉద్యోగ సంఘం మాజీ నాయకులు కృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీయనుకోవాలని పేర్కొన్నారు. లేని పక్షంలో ఉద్యమం మరింత ఉదృతం చేస్తామని, రిటైర్డ్ ఉద్యోగులు అంతా నిరసనకు దిగనున్నట్లు హెచ్చరించారు.
Also Read-
ఈ నిరసన కార్యక్రమంలో జేఎసీ కన్వీనర్ ప్రొ. వడ్డాణం శ్రీనివాస్; ఛైర్పర్సన్ ప్రొ. పల్లవీ కాబ్డే; డా. అవినాష్; డా. కిషోర్; డా. ప్రమీల కేతావత్; డా. పరాంకుశం వెంకటరమణ; డా. రవీంద్రనాథ్ సోలమన్; డా . దయాకర్, ఎన్సీ వేణు గోపాల్; జేఎసీ నేతలు అధ్యాపక, అధ్యాపకేతర, అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ అసోసియేషన్; టైం స్కేల్, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు విశ్వవిద్యాలయంలోని ఈఎమ్మార్సీ అండ్ పాటి రాజం లైబ్రరీ భవనం ముందు బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.