Hyderabad: టీపీసీసీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర రైతంగా సమస్యలపై కందుకూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు మండల కాంగ్రెస్ అధ్యక్షులు కృష్ణ నాయక్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు చల్లా నరసింహ రెడ్డి గారు మరియు మాజీ MLA కోదండారెడ్డి పాల్గొన్నరు.
ఈ సందర్బంగా చల్లా నరసింహారెడ్డి గారు మాట్లాడుతూ 2014 లో రైతులకు ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగా రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ ఒక్కసారి కాకుండా ఆరు విడుతలలో చేయడం వల్ల రైతుల బ్యాంక్ వడ్డీలకె సరిపోయింది. 2018ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీ నాలుగు ఏండ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేస్తున్నారు.
ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకర్ల ఒత్తిడి తట్టుకోలేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. భూ రికార్డల ప్రక్షాళన,ధరణి పోర్టల్ పేరుతో ప్రభుత్వం చేపట్టిన భూ సంస్కరణల వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు అనేక మంది రైతుల రెవెన్యూ సమస్యలు పరిష్కారం కాక ఆత్మహత్య చేసుకుంటున్న ప్రభుత్వం స్పందించడం లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో దళితులకు,గిరిజనులకు వ్యవసాయం కోసం ఇచ్చిన అసైన్డ్ భూములను ప్రభుత్వం గుంజుకుంటుంది
కౌలు రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీసుకవచ్చిన కౌలు రైతు చట్టాన్ని అమలు చేసి వారికి న్యాయం చేయాలి
వీటన్నింటింపై ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కారించాలి అని లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి ఏనుగు జంగారెడ్డి గారు, దీప భాస్కర్ రెడ్డి, మేయర్ చిగురింత పారిజాతన సింహారెడ్డి, కందుకూరు మండల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణా ప్రతాపరెడ్డి, బంగారు బాబు, కార్పొరేటర్లు మనోహర్, బాలు నాయక్, దర్శన్ రెడ్డి, మీర్ పేట్ కార్పొరేటర్ చల్లా బాల్ రెడ్డి , బడంగ్ పెట్ మహిళా అధ్యక్షురాలు అమృత నాయుడు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాఘవేందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, తుక్కుగూడ మున్సిపల్ అధ్యక్షులు జంపన్న యాదవ్,కందుకూరు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఢిల్లీ శ్రీధర్, మహేశ్వరం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మారేపల్లి రమేష్, సులేమాన్, మల్లేష్, యువజన నాయకులు సురేందర్ రెడ్డి, జిల్లా మైనార్టీ సేల్ అఫ్జల్ బేగ్, మల్లారెడ్డి, జల్ పల్లి మున్సిపాలిటీ వైస్ ప్రెసిడెంట్అబ్దుల్ బారి, రవి, కృష్ణ, అమిత్ బాంబ్ వెంకటేష్, తదితరులు పాల్గొనడం జరిగింది.
టీపీసీసీ ఆదేశానుసారం అలంపూర్ నియోజకవర్గంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఆదేశానుసారం ఏడు మండలాల్లో రైతుల సమస్యలపై ఎమ్మార్వో కార్యాలయాల ముందు ధర్నాలు చేసిన కాంగ్రెస్ శ్రేణులు.