हैदराबाद: जोगुलम्बा गदवाल जिले के एर्रावल्ली मंडल के बीचपल्ली में राष्ट्रीय राजमार्ग (44) पर एक निजी ओल्वो बस पलट गई। इसके चलते बस में शॉर्ट सर्किट हो गया। इस घटना में एक महिला यात्री जिंदा जल गई और 12 अन्य यात्री घायल हो गए। घायलों को नजदीकी अस्पताल में भर्ती किया गया।
लगभग 36 यात्रियों को लेकर हैदराबाद से कडपा जा रही एक निजी ओल्वो बस सुबह करीब 3 बजे बीचुपल्ली के पास एक पेट्रोल स्टेशन के पास नियंत्रण खो बैठी और पलट गई। इसके कारण सो रहे यात्री चिल्लाते और बाहर निकलने की कोशिश करते समय शॉर्ट सर्किट के कारण बस में आग लग गई। हादसे में एक महिला यात्री जिंदा जल गई। 12 अन्य घायल हो गये।
गश्ती दल के कर्मचारी और आसपास मौजूद कुछ अन्य लोग मौके पर पहुंचे और बचाव कार्य में जुट गये। गदवाला के कांग्रेस नेता खलीम और अन्य लोगों ने वहां जाकर यात्रियों को अस्पताल पहुंचाने में महत्वपूर्ण भूमिका निभाई और 20 लोगों को 5-5 हजार रुपये देकर अपनी मानवता का परिचय दिया, ताकि बाकी लोग अपने-अपने गंतव्य तक पहुंच सकें। इसके बारे में और अधिक जानकारी की प्रतीक्षा है।
షార్ట్ సర్క్యూట్‌తో బస్సు దగ్ధం, మహిళ సజీవ దహనం
హైదరాబాద్ (ఏజెన్సీలు): జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం బీచ్‌పల్లి వద్ద జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఓ ప్రైవేటు ఓల్వో బస్సు అదుపుతప్పి బోల్తా పడి షార్ట్ సర్క్యూట్‌కు గురైంది. ఈ ఘటనలో ఓ మహిళా ప్రయాణికురాలు సజీవ దహనం కాగా మరో 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
దాదాపుగా 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుండి కడపకు బయలుదేరిన ఓ ప్రైవేట్ ఓల్వో బస్సు తెల్లవారుజామున 3 గంటల సమయంలో బీచుపల్లి వద్ద ఉన్న పెట్రోల్ బంక్ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. నిద్రలో ఉన్న ప్రయాణికులు ఈ సంఘటనతో ఒక్కసారిగా ఆహాకారాలు చేస్తూ బయటపడే ప్రయత్నాలు చేసే లోపే షార్ట్ సర్క్యూట్‌తో బస్సు మంటల్లో కూరుకుపోయింది. ప్రమాదం నుండి ప్రయాణికులు చేసిన ప్రయత్నాలలో ఓ మహిళ ప్రయాణికురాలు అందులోనే చిక్కుకొని సజీవ దహనం అయ్యింది. మరో 12 మంది గాయాలపాలు అయ్యారు.
పెట్రోలింగ్ సిబ్బంది, సమీపంలో ఉన్న మరికొంతమంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. సమీపంలో ఉన్న గద్వాలకు చెందిన కాంగ్రెస్ నేత ఖలీం, తదితరులు అక్కడికి వెళ్లి ప్రయాణికులను ఆసుపత్రికి తరలింపచేయడంలో తన వంతు పాత్రను నిర్వహించి మిగతావారు వారి వారి గమ్యస్థానాలను చేరుకోవడానికి వీలుగా ఒక్కొక్కరికి రూ.5000 చొప్పున మొత్తం 20 మందికి అందజేసి తన మానవత్వం చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది. (ఏజెన్సీలు)