సౌదీ బ‌స్సు ప్ర‌మాదంపై ప్ర‌ధాని మోడీ తీవ్ర‌ దిగ్బ్రాంతి, కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి प्रधानमंत्री नरेंद्र मोदी ने दु:ख जताया

హైదరాబాద్ : సౌదీలో జ‌రిగిన ఘోర బ‌స్సు ప్ర‌మాదంపై ప్ర‌ధాని మోడీ తీవ్ర‌దిగ్బ్రాంతి వ్య‌క్తం చేశారు. మ‌దీనాలో జ‌రిగిన ప్ర‌మాదంలో భార‌తీయులు మ‌ర‌ణించ‌డం త‌న‌కు చాలా బాధ క‌లిగించింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌మ ప్రియమైన వారిని కోల్పోయిన వారి కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

గాయ‌ప‌డిన వారంతా త్వ‌ర‌గా కోలుకోవాల‌ని మోడీ ప్రార్థించారు. రియాద్ లోని భార‌త రాయ‌బార కార్యాల‌యం, జెడ్డాలోని కాన్సులేట్ సాధ్య‌మైనంత స‌హాయం అందిస్తున్నాయ‌ని తెలిపారు. భార‌త అధికారులు సౌదీ అరేబియా అధికారుల‌తో స‌న్నిహితంగా ఉన్నార‌ని పేర్కొన్నారు.

బస్సు ప్రమాదం పట్ల దిగ్భాంతి వ్యక్తం చేసిన బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు

హైదరాబాద్ : సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదం పట్ల దిగ్భాంతి వ్యక్తం చేసిన బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు. సౌదీ అరేబియాలో చోటుచేసుకున్న ఘోర బస్సు ప్రమాదంలో ప్రయాణికులు, తెలంగాణ వాసులు దుర్మరణం చెందడం అత్యంత హృదయ విదారకమైన ఘటన. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాను. ఈ ఘటన రాష్ట్రాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలి. వారి కుటుంబాల పట్ల బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ సంతాపం వ్యక్తం చేస్తోంది.

ఉమ్రా యాత్రకు వెళ్లిన తెలంగాణ రాష్ట్ర పౌరులు ఇలాంటి దారుణ ప్రమాదానికి గురవడం కుటుంబాలను శోకసంద్రంలో ముంచెత్తింది. మృతిచెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాద సమయంలో భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.

ఈ ప్రమాదం అనంతరం కేంద్ర విదేశాంగ శాఖ అత్యంత వేగంగా చర్యలు ప్రారంభించింది. మృతదేహాల గుర్తింపు, సహాయక చర్యలు, అలాగే సౌదీ అధికారులతో అవసరమైన సమన్వయం కోసం భారత ఎంబసీ ఇప్పటికే కార్యాచరణ చేపట్టింది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్రంతో సమన్వయం పెంచి, మృతదేహాల తరలింపు సహా అవసరమైన అన్ని సహాయక చర్యలను వేగవంతం చేయాలని కోరుతున్నాను. (ఏజెన్సీలు)

सऊदी में 42 भारतीयों की मौत पर प्रधानमंत्री नरेंद्र मोदी ने दु:ख जताया

हैदराबाद : सऊदी में 42 भारतीयों की मौत पर प्रधानमंत्री नरेंद्र मोदी ने दु:ख जताया है। भारतीय नेताओं ने सऊदी अरब के मदीना के पास हुए बस हादसे में भारतीय नागरिकों की मौत पर गहरी शोक संवेदनाएं व्यक्त की हैं। उन्होंने मृतकों के परिवारों के प्रति संवेदना जताई और घायल हुए लोगों के शीघ्र स्वास्थ्य लाभ की कामना की। उन्होंने कहा कि भारतीय मिशन, रियाद स्थित दूतावास और जेद्दा स्थित कौंसुलेट के माध्यम से सभी संभव सहायता प्रदान कर रहा है और सऊदी अधिकारियों के साथ मिलकर स्थिति का प्रबंधन किया जा रहा है।

कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खरगे ने शोक जताया

कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खरगे ने सऊदी अरब के मदीना के पास हुए दर्दनाक बस हादसे पर गहरी संवेदना व्यक्त की, जिसमें 42 भारतीय नागरिक मारे गए हैं। उन्होंने शोक संतप्त परिवारों के प्रति संवेदनाएं जताई और घायल लोगों के शीघ्र स्वास्थ्यलाभ की प्रार्थना की है। खरगे ने कहा कि केंद्र सरकार को विदेश मंत्रालय के माध्यम से राज्य सरकारों और प्रभावित परिवारों के साथ मिलकर राहत और सहायता सुनिश्चित करनी चाहिए। उन्होंने बताया कि तेलंगाना के मुख्यमंत्री को सभी संभव मदद देने का निर्देश दिया गया है और वे स्थिति पर बारीकी से नजर रख रहे हैं। (एजेंसियां)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X