हैदराबाद: प्रधानमंत्री नरेंद्र मोदी का तेलंगाना दौरा स्थगित किया है। तय कार्यक्रम के मुताबिक मोदी इस महीने की 19 तारीख को राज्य की राजधानी हैदराबाद आने का कार्यक्रम है। सिकंदराबाद स्टेशन के विकास कार्य के साथ-साथ वंदे भारत ट्रेन का शुभारंभ किया जाना है।
हालांकि बीजेपी तेलंगाना के अध्यक्ष बंडी संजय ने बुधवार को खुलासा किया कि मोदी की यात्रा स्थगित कर दी गई है। बताया कि बिजी शेड्यूल के चलते इसे टाल दिया गया। उन्होंने कहा कि बहुत जल्द दौरे की नई तारीख की घोषणा करेंगे। भाजपा के प्रदेश अध्यक्ष संजय ने कहा कि प्रधानमंत्री का दौरा अस्थाई रूप से स्थगित किया गया है और प्रधानमंत्री के राज्य के दौरे का कार्यक्रम जल्द ही घोषित किया जाएगा। इससे वंदे भारत ट्रेन के शुरू होने पर संशय बना हुआ है।
ప్రధాని మోదీ పర్యటన వాయిదా
హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19వ తేదీన ఆయన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు రావాల్సి ఉంది. సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి పనులతో పాటు వందే భారత్ రైలును ప్రారంభించాల్సి ఉంది.
అయితే ఈ పర్యటన వాయిదా పడినట్లు బుధవారం బీజేపీ వర్గాలు వెల్లడించాయి. బిజీ షెడ్యూల్ వల్లే వాయిదా పడిందని చెబుతున్నారు. అతి త్వరలోనే పర్యటన తేదీని ప్రకటిస్తామని తెలిపాయి.
ప్రధాని పర్యటన తాత్కాలికంగానే వాయిదా పడిందని, ప్రధాని రాష్ట్ర పర్యటన షెడ్యూల్ త్వరలోనే వెల్లడిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. దీంతో వందే భారత్ రైలు ప్రారంభంపై సందిగ్ధత ఏర్పడినట్లయ్యింది. (ఏజెన్సీ)