హైదరాబాద్ : దేశ సమగ్ర వికాసానికి మహిళా సాధికారత అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఏకలవ్య ఆదర్శ పాఠశాలల ద్వారా గిరిజనులకు నాణ్యమైన విద్య అందుతున్నదని చెప్పారు. భద్రాచలం పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. రాములవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సమ్మక్క, సారలమ్మ గిరిజన పూజారుల సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏకలవ్య ఆదర్శ పాఠశాలలను వర్చువల్‌గా ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణలో తన పర్యటన తీపి జ్ఞాపకంగా మిగులుతుందన్నారు. భద్రాద్రి రాముడి దర్శనం ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని తెలిపారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్న దాశరథి వ్యాఖ్యలను రాష్ట్రపతి ప్రస్తావించారు.
సందర్భంగా రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు మాట్లాడుతూ…
దక్షిణ భారత అయోధ్యగా ప్రసిద్ధిగాంచిన భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి సన్నిధికి విచ్చేసిన, ప్రజాస్వామ్య భారత ప్రథమ పౌరులు, గిరిజన బిడ్డ గౌరవ రాష్ట్ర పతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నాను. రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము గారితో కలిసి ఈ వేదికను పంచుకునే అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో, అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే ద్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుంది.
రాష్ట్రం ఎర్పడిన అనతికాలంలోనే విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, విద్యుత్, వ్యవసాయం, రవాణా మరియు పరిపాలన వికేంద్రికరణ వంటి అనేక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు చేసి అభివృద్ధి పథంలో వేగంగా దూసుకు పోతున్న తెలంగాణ రాష్ట్రం, గిరిజన సంక్షేమానికి, మహిళ, శిశు సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టి అమలు చేస్తుంది. మారుమూల గిరిజన జిల్లాలైన నా సొంత జిల్లా మహబూబాబాద్ మరియు ఆసిఫాబాద్ జిల్లాలో ఈఏకలవ్య మోడల్ స్కూల్స్ తో పాటు, రాష్ట్రంలోని మొత్తం 23 ఎకలవ్య గురుకుల పాఠశాలల ద్వారా ఏజేన్సీ ప్రాంతాల్లోని గిరిజన ఆదివాసీ విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తూ, నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఇంగ్లీష్ మీడియం విద్యను ఉచితంగా అందించడం జరుగుతున్నది.
రాష్ట్రంలో 183 గిరిజన గురుకులాలను 22 డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేయడం జరిగింది. వీటిలొ ప్రత్యేకించి బాలికల కోసం 33 పాఠశాలలు, కేటాయించడం జరిగింది. రాష్ట్రంలోని నర్సంపేట అశోక్ నగర్ లో సైనిక్ స్కూల్ ఎర్పాటు చేసి గిరిజన విద్యార్ధులకు విద్యతో పాటు సైనిక శిక్షణ ఇప్పించి ప్రతిభా పాటవాలుగల సైనిక అధికారులను తయారు చేస్తున్నాము. సిరిసిల్లలో ప్రత్యేకంగా ఎర్పాటు చేసిన ఫైన్ ఆర్ట్స్ గురుకుల కళాశాలలో వివిధ కోర్సులలో శిక్షణ పొందుతున్నారు. అంతే కాకుండా స్టడీ సెంటర్ లను స్థాపించి, గిరిజన విద్యార్ధులకు ఐఐటీ, నీట్ వంటి జాతీయ స్ధాయి పోటీపరిక్షలకు ఉచితంగా నాణ్యమైన శిక్షణ అందిస్తున్నాము.
ఇప్పటి వరకు సుమారు 1200 మంది గిరిజన విద్యార్ధులు దేశ వ్యాప్తంగా ఉన్న పలు ప్రతిష్టాత్మక కళాశాలల్లో వైద్య, ఇంజనీరింగ్ విద్యలో ప్రవేశాలు పొందారు. విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించడానికి గాను పేద విద్యార్థులకు 20 లక్షల రూపాయల ఆర్ధిక సహయాన్ని అంబేద్కర్ ఓవర్సిస్ స్కాలర్ షిప్ పేరిట అందజేస్తున్నాము. గిరిజన విద్యతో పాటు వారి సంస్కృతి సంప్రదాయాలు ఆచారవ్యవహరాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తూ వారి పండగలైన “సంత్ సేవాలాల్ జయంతిని” “కుమ్రం బీమ్ జయంతి”లకు నిధులు విడుదల చేస్తూ అధికారికంగా నిర్వహిస్తున్నాము.
ఆచార సంప్రదాయాల ప్రకారం “నాగోబా జాతర”, మేడారం సమ్మక్క – సారలమ్మ జాతరలకు నిధులు కేటాయించి ఘనంగా జరుపుతున్నాం. మేడారం జాతర ఎర్పట్లకు వసతులు, సౌకర్యాల కోసం ఇప్పటి వరకు 400 కోట్ల నిధులను వెచ్చించి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి జాతరను బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాం. రాష్ట్ర రాజధాని నగరం నడిబొడ్డున అత్యంత ఖరీదైన బంజారాహిల్స్ ప్రాంతంలో ఒక్కోక్కటి 25 కోట్ల రూపాయల ఖర్చుతో వారి ఆత్మ గౌరవ ప్రతీకలుగా “ సేవాలాల్ బంజారా భవన్, కుమ్రం బీమ్ ఆదివాసీ భవన్” ల పేరిట భవనాలను నిర్మించి వారిని గౌరవించుకుంటున్నాం.
గిరిజన ఆదివాసీలకు స్వయంపాలన – కల సాకారం :
“మా గూడెంలో మా రాజ్యం – మా తండాలో మా పాలన” కావాలని దశాబ్దాలుగా ఉద్యమించిన గిరిజన ఆదివాసీ బిడ్డల కలను స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారు సాకారంచేశారు. 3,146 ఆవాసాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో గిరిజన ఆదివాసీలే పాలకులై స్వయం పాలన సాగిస్తున్నారు. గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి పాలన చేరువ చేసిన రాష్ట్ర ప్రభుత్వం వాటి అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తుంది. దాంతో పారిశుధ్యం మెరుగు పడడంతోపాటు వసతులు సమకూరాయి. ఇప్పుడు గ్రామపంచాయితీలుగా మారిన అన్ని గిరిజన ఆవాసాలలో పంచాయతీ భవనాల నిర్మాణాలు ప్రారంభించడానికి , ఒక్కో భవనానికి రూ.20లక్షల చొప్పున నిధులు కేటాయించడం జరిగింది.
నూతన గ్రామపంచాయితీలకు పల్లేప్రగతికి కేటాయిస్తున్ననిధుల ద్వారా పారిశ్యుద్ధం మేరుగు పడి పచ్చధనం పెరగడంతో గ్రామాలు కళకళలాడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో శిశువుల, మహిళల ఆరోగ్య సంరక్షణకు, వారి సంక్షేమానికి, భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను ఇస్తుంది. ఇందులో భాగంగా ఏజెన్సీ ప్రాంతాలలోని గిరిజన చిన్నారులు, గర్భిణుల సంరక్షణ కోసం గిరిపోషణ పథకం ద్వారా అదనపు పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నాము. మహిళ గర్భం దాల్చినప్పటి నుండి ప్రతి దశలోను తల్లి, బిడ్డల ఆరోగ్య పరిక్షరణకు అవసరమైన వైద్య సేవలు కల్పించడంతో పాటు, పోషక ఆహారలోపాన్ని నివారించేందుకు “కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ పథకం” ద్వారా అధనపు పౌష్టిక ఆహారం అందించడం, ప్రసవానంతరం పుట్టిన బిడ్డ సంరక్షణకు అవసరమైన సామాగ్రిని “కేసీఆర్ కిట్” ద్వారా అందించడం జరుగుతుంది.
ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా ప్రసూతి జరిపించి, నగదు ప్రోత్సహకంగా తల్లికి 13వేలు అందించడంతోపాటు “ఆరోగ్య లక్ష్మి” పథకం కింద అంగన్ వాడీల ద్వారా చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు పాలు, గుడ్లతో కూడిన పౌష్టిక ఆహారాన్ని అందించడం వంటి పటిష్టమైన సంక్షేమ చర్యలతో మహిళ, శిశు సంక్షేమాన్ని అద్భుతంగా అమలు చేయడంతో రాష్టంలో మాతా శిశు మరణాలను గణనీయంగా తగ్గించగలిగాము. బాలికల విద్యకోసం ప్రత్యేక గురుకులాలు ఎర్పాటు చేయడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్ అమలు చేయడం, పేద యువతుల వివాహ భాద్యత తల్లి దండ్రులకు భారం కాకుండా “కళ్యాణ లక్ష్మీ పథకం” కింద లక్షా నూట పదహారు రూపాయ ఆర్ధిక సహాయన్ని ప్రభుత్వం ద్వారా అందించడం వలన బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయగలిగాము.
వీటితో పాటు మహిళల భద్రతకు పెద్ద పీట వేస్తూ, “షీ టీమ్స్” పేరిట ప్రత్యేక పోలిస్ విభాగం ద్వారా వారికి ఇంట, బయట, పని ప్రదేశాలలో రక్షణ కల్పిస్తున్నాము. రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ రంగంలోనే అవసరమైన వైద్య సౌకర్యం కల్పించేందుకు పీ.హెచ్.సీ స్థాయి నుండి జిల్లా స్థాయి ఆసుపత్రులతో పాటు, సూపర్ స్పెషాలిటి ఆసుపత్రులను నెలకొల్పి, నిపుణులైన వైద్యులు, మందులు ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులకు కూడా మెరుగైన వైద్యం అందుబాటులోకి తేవాలనే సదుద్దేశంతో గౌ.ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలను నెలకొల్పాలని సంకల్పించింది. ఆ దిశగా ఇప్పటికే 12 మేడికల్ కాలేజిలను ప్రారంభించుకున్నాము. తద్వారా సుదూర ఏజెన్సీ ప్రాంతాలకు కూడా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.
షెడ్యూల్ తెగల యువతీ,యువకులను పారిశ్రామిక వెత్తలుగా తీర్చిదిద్దాడాని, వారిని ప్రోత్సహించడానికి భారీ మొత్తంలో సబ్సిడి ఇస్తూ” సిఎం ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ & ఇన్నోవేషన్ స్కీమ్” అమలు చేయడం జరుగుతుంది. ఈ పథకం వల్ల ప్రతి ఏడాది వందల మంది పారిశ్రామిక వేత్తలుగా ఎదుగుతున్నారు. వారు తమ తమ సంస్థల్లో వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి గిరిజన ఆవాసానికి బీ.టీ రోడ్డు సౌకర్యం ఉండాలనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లక్ష్యానికి అనుగుణంగా మారుమూల తండాలకు బీటీ రోడ్లు మంజూరు చేయడం జరిగింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం 12 వేల 475 గిరిజన ఆవాసాలకు బి.టీ రోడ్ల సౌకర్యం కల్పించడానికి 1000 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది.
75 ఏళ్ల స్వాతంత్రంలో కనీస విద్యుత్ సౌకర్యం లేని గిరిజన ప్రాంతాలకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేక చొరవతో, అన్ని గిరిజన అవాసాలకు 350 కోట్లతో 3 ఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పించడం జరిగింది. విద్యుత్ వైర్ల ద్వారా అందించలేని ప్రాంతాల్లో సోలార్ పవర్ సిస్టమ్ ద్వారా విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నాము. గిరివికాస పథకం క్రింద గిరిజన రైతులకు ఉచితంగా బోరుబావిని త్రవ్వించి, విద్యుత్ సౌకర్యం కల్పించడం ద్వారా బీడు భూములు వ్యవసాయ భూములుగా మారి గిరిజన రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. దీనికి అధనంగా రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి 10వేలు చొప్పున ప్రతి గిరిజన రైతుకు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం అందజేస్తున్నది.
తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్లు 6% నుంచి 10% పెంపుతో గిరిజనులకు విద్య, ఉద్యోగ, ఉపాది రంగాల్లో అవకాశాలు పెరిగాయి. దింతో గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. దీర్ఘకాలం పెండింగ్ లో ఉన్న పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారానికై గౌ.ముఖ్యమంత్రి గారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం జీఓ 140 జారీ చేయడం జరిగింది. అటవీ హక్కుల చట్టం- 2005 నిబంధనల ప్రకారం పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజన, గిరిజనేతరులకు త్వరలోనే పోడుపట్టాలని అందించబోతున్నాం.
గిరిజన ఆదివాసి, ముద్దు బిడ్డ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం దేశానికి రాష్ట్ర పతిగా ఎన్నిక కాబడే అవకాశం వచ్చిందంటే అది భారత ప్రజాస్వామ్య వ్యవస్ధ, భారత రాజ్యంగ నిర్మాత డా.బిఆర్ అంబేద్కర్ గారి వల్లే సిద్ధించింది. మారుమూల ప్రాంతంలో సీతారామచంద్రస్వామిని ఆశీస్సుల కోసం వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై మీ వద్దకు ఏ విధమైన ప్రతిపాదన వచ్చిన దానిని మనస్ఫూర్తిగా అమలు చేయాలని ఒక గిరిజన బిడ్డగా కోరుతున్నాను.