హైదరాబాద్ కు వచ్చారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, స్వాగతం పలకటానికి రాలేదు CM KCR (H)

హైదరాబాద్ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ కు వచ్చారు. రాష్ట్రపతి రాష్ట్రపతికి స్వాగతం పలకటానికి CM KCR రాలేదు. శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ముర్మకు అధికారులు ఘన స్వాగతం పలికారు. శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ముర్ముకు అధికారులు ఘన స్వాగతం పలికారు. శంషాబాద్ విమనాశ్రయంలో రాష్ట్రపతికి గవర్నర్ తమిళి సై, మంత్రి సత్యవతి రాథోడ్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ముర్ము హైదరాబాద్ కు వచ్చారు. బొల్లారంలోని రాష్ట్రపతి నివాసంలో ముర్ము ఐదు రోజులు బస చేయనున్నారు. 

హైదరాబాద్ నుంచి ముర్ము శ్రీశైలానికి బయలుదేరి వెళ్లారు. శ్రీశైలంలో భ్రమరాంభ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. స్వామి వారికి పంచమూర్త అభిషేకం నిర్వహించారు. భ్రమరాంభ ఆలయంలో కుంకుమార్చన కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రసాదం ప్రాజెక్టు స్కీం ద్వారా దేవస్థానం నిర్మించిన యాత్రిక భవనం, ఓపెన్ ఆడిటోరియాన్ని ప్రారంభించారు. శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. చెంచు ట్రైబల్స్ తో సమావేశమైనారు. ఇవాళ సాయంత్రం హెలికాప్టర్ లో హకీంపేట్ ఎయిర్ బేస్ కు చేరుకుంటారు. 

రాష్ట్రపతి పర్యటనకు ఆంధ్రప్రదేశ్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సున్నిపెంట హెలిప్యాడ్ దగ్గర ఇప్పటికే బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేశాయి. రాష్ట్రపతి పర్యటనకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అధికారులు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా పలుమార్లు ట్రయిల్ రన్ కూడా నిర్వహించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఏపీ చెక్ పోస్ట్ లింగాలగట్టు శిఖరం పాయింట్ దగ్గర, తెలంగాణ చెక్ పోస్ట్ దోమలపెంట దగ్గర మూడు గంటలపాటు వాహనాల రాకపోకలు నిలిపివేస్తున్నారు. రాష్ట్రపతి రాక సందర్భంగా భక్తులకు ఇవాళ ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు దర్శనాలు నిలిపివేశారు. 

శ్రీశైల మల్లన్న దర్శనం తర్వాత హెలికాప్టర్ లో 4.15 కు హకీంపేట్ ఎయిర్ బేస్ కు రానున్నారు. అక్కడ గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ సహా మంత్రులు, ఉన్నతాధికారులు స్వాగతం పలకనున్నారు. ఆ తర్వాత నేరుగా బొల్లారం రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. (Agencies)

राष्ट्रपति द्रौपदी मुर्मू हैदराबाद पहुंचीं, स्वागत करने नहीं पहुंचे सीएम केसीआर

हैदराबाद: राष्ट्रपति द्रौपदी मुर्मू हैदराबाद पहुंचीं। राष्ट्रपति का स्वागत करने नहीं पहुंचे सीएम केसीआर। शमशाबाद हवाईअड्डे पर पहुंचे मुर्मू का अधिकारियों ने गर्मजोशी से स्वागत किया। शमशाबाद हवाई अड्डे पर पहुंचे मुर्मू का अधिकारियों ने गर्मजोशी से स्वागत किया।

शमशाबाद हवाईअड्डे पर राज्यपाल तमिलिसाई सौंदरराजन, मंत्री सत्यवती राठौर सहित कई अन्य गणमान्य व्यक्तियों ने राष्ट्रपति का स्वागत किया। राष्ट्रपति मुर्मू शीतकालीन अवकाश के लिए हैदराबाद आए हैं। मुर्मू पांच दिनों तक बोलाराम स्थित राष्ट्रपति आवास में रहेंगी।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X