पुलिस ने सुलझाया कुकटपल्ली सहस्रा हत्याकांड मामला, सामने आये चौंकाने वाली ये बातें

हैदराबाद: पुलिस ने कुकटपल्ली थाना क्षेत्र में पाँच दिन पहले हुई सहस्रा नामक लड़की की हत्या के मामले को सुलझाया है। साथ ही इस मामले को लेकर चौंकाने वाले खुलासे किए हैं। साइबराबाद के सीपी अविनाश महंती ने बताया कि पुलिस जाँच में पता चला है कि क्रिकेट बैट चुराकर वापस आते समय लड़की के चिल्लाने पर लड़के ने उसकी हत्या कर दी है।

ओटीटी प्लेटफॉर्म पर अपराध दृश्य देखकर ही उसने लड़की की हत्या की है। सहस्रा हत्याकांड में उसके द्वारा लिखे गए नोट्स से पता चलता है कि लड़के ने एक मनोरोगी की तरह व्यवहार किया और पुलिस जाँच में यह भी पता चला कि लड़के ने एक पेशेवर अपराधी की तरह काम किया। उसके व्यवहार से स्पष्ट है कि उसने हत्या करने के बाद सबूत मिटाना भी सीखा लिया।

साइबराबाद के पुलिस आयुक्त अविनाश मोहंती ने वरिष्ठ पुलिस अधिकारियों के साथ 23 अगस्त को मीडिया के सामने इस मामले को लेकर सनसनीखेज खुलासा किया है। सहस्रा की हत्या इसी महीने की 18 तारीख की सुबह की गई और तीन दिनों तक इस मामले में कोई बड़ा सुराग नहीं मिला और न ही कोई प्रगति हुई। इस मामले में कुछ संदिग्धों की पहचान की गई और उसी दिशा में जाँच शुरू की गई, लेकिन हत्या वाले दिन, पड़ोस के घर में रहने वाले एक लड़के ने जानकारी दी कि एक लड़का उसके घर की दीवार के पास देखा गया। इसी जानकारी के आधार पर मामले की गहन जाँच शुरू की गई। तब पता चला कि सहस्रा की हत्या पड़ोस के घर में रहने वाले एक 14 वर्षीय लड़के ने की है।

मृतक के छोटे भाई ने बताया कि हत्या करने वाला लड़का सहस्रा के घर में रखे गये क्रिकेट बैट से खेलता थे। जब उसने उससे बैट मांगा तो उसने नहीं दिया। इसके चलते वह बैट चुराने की योजना बनाई। सीपी अविनाश महंती आगे ने बताया कि पूछताछ में पता चला कि उसने एक महीने पहले ही पूरी स्क्रिप्ट तैयार कर ली थी कि कैसे चोरी करनी है, अगर कोई देख ले तो कैसे बचना है और बिना सुराग मिटाने के लिए क्या करना है। योजना के मुताबिक, इसी महीने की 18 तारीख की सुबह वह बगल वाले घर में घुसा और बैट चुराकर ले जाने लगा तो लड़की ने सहस्रा को देखा और चिल्लाई तो उसने अपने साथ लाए चाकू से उसकी हत्या कर दी।

पुलिस कमिश्नर ने बताया कि फिर उसने हत्या का चाकू वहीं धोया, छत की दीवार फांदकर अपने घर में गया और खून से सने कपड़े वॉशिंग मशीन में डाल दिए और फिर बिना कुछ मालूम है, जैसा उसी जगह घुम फिरने भी लगा। उन्होंने बताया कि जब एक लड़के से मिली जानकारी के आधार पर जाँच शुरू की गई, तो उसने ठीक से जवाब नहीं दिया। फिर पुलिस ने अपने ढंग से पूछताछ की तो उसने अपराध स्वीकार कर लिया। इस तरह पुख्ता सबूतों के साथ मामला सुलझा लिया गया है। उन्होंने बताया कि हत्या वाली जगह पर सुराग मिले है। उसने यह सब पहले से तय योजना के अनुसार किया। उसने इसकी योजना एक महीना पहले बनाई थी।

उन्होंने बताया कि उसने यह सब ओटीटी और रहस्यमयी फ़िल्में देखते हुए किया। उन्होंने बताया कि लड़के के माता-पिता को इस मामले की जानकारी नहीं थी। जब उसकी माँ ने हत्या के बाद थोड़े डरे हुए रह रहे लड़के से पूछा कि क्या उसने यह हत्या की है, तो उसने दो दिन बात कहा कि ऐसा लगता है कि तू ही पुलिस को मुझे पकड़ा दोगी।

पुलिस कमिश्नर ने यह भी बताया कि उनके ध्यान में आया कि उसने बिना मां-बाप के पैसे दिए ही एक फ़ोन खरीदा था। उसने यह भी नहीं बताया कि उसे यह फ़ोन कैसे मिला है। इसके बाद जब लड़के से पूछताछ की गई, तो उसने सच कबूल कर लिया। पुलिस कमिश्नर ने बताया कि पूछताछ के दौरान लड़के ने बताया कि पूरा परिवार आर्थिक तंगी में है और उसने उससे बैट खरीदना चाह रहा था। इसलिए वह चोरी करने की योजना बनाई। पुलिस ने सहस्रा हत्याकांड के आरोपी को बाल सुधार गृह भेज दिया है। इससे पहले उसे किशोर न्याय बोर्ड के समक्ष पेश किया गया।

संबंधित खबर-

క్రికెట్ బ్యాట్ దొంగిలించేందుకు వెళ్లి సహస్రను బాలుడు హత్య చేశాడు: సీపీ అవినాష్ మహంతి

హైదరాబాద్‌ : కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఐదు రోజుల క్రితం జరిగిన బాలిక సహస్ర హత్య కేసును ఛేదించిన పోలీసులు ఈ కేసులో విస్తుపోయే విషయాలు వెల్లడించారు. క్రికెట్ బ్యాట్ను దొంగిలించేందుకు వెళ్లి వస్తుండగా బాలిక చూసి అరవడంతో హత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు.

ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో క్రైమ్‌ సీన్స్‌ చూసే బాలికను హత్య చేసినట్లు తేల్చారు. సహస్ర హత్య కేసులో బాలుడు సైకోలా ప్రవర్తించినట్టు అతను రాసుకున్న నోట్స్ ప్రవర్తించిన తీరును బట్టి అర్థం అవుతుందని, పోలీసుల విచారణలో పక్కా ప్రొఫెషనల్ క్రిమినల్‌ గా వ్యవహరించిన బాలుడు. హత్య చేసి ఆధారాలు మాయం చేయడం నేర్చుకున్నట్లు స్పష్టం అవుతుంది.

సంచలనం సృష్టించిన ఈ కేసుకు సంబంధించి సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఇతర పోలీసు ఉన్నతాధికారులతో కలిసి వెల్లడించారు. ఈనెల 18న ఉదయం సహస్ర హత్య జరిగిందని, ఈ కేసులో 3 రోజుల వరకు పెద్దగా క్లూస్ ఏమీ దొరకలేదని, ఎలాంటి పురోగతి కనిపించలేదన్నారు. ఈ కేసులో కొంతమందిని అనుమానితులుగా గుర్తించి ఆ దిశగా విచారణ చేపట్టగా హత్య జరిగిన రోజు, ఆ ఇంటి గోడ సమీపంలో ఓ బాలుడు తచ్చాడినట్లు పక్క ఇంట్లో ఉండే బాలుడు ఇచ్చిన సమాచారంతో ఈ కేసును లోతుగా దర్యాప్తు చేపట్టమన్నారు. సహస్రను పక్క ఇంటిలో ఉన్న 14 ఏళ్ల బాలుడు మర్డర్ చేసినట్లు తేలిందన్నారు.

సహస్ర ఇంట్లో ఉన్న క్రికెట్ బ్యాట్‌తో మృతురాలు తమ్ముడు, హత్యకు పాల్పడ్డ బాలుడు క్రికెట్ ఆడుకునే వారని, తనకు ఇవ్వమంటే ఇవ్వలేదని, స్ట్రోక్ బాగున్న ఆ బ్యాట్ ను ఎలాగైనా దొంగలించాలని అనుకున్నాడని తెలిపారు. ఇందుకోసం పక్కాగా ప్లాన్ చేసుకున్నాడని, ఎలా దొంగతనం చేయాలి, ఎవరైనా చూస్తే అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి, క్లూస్ దొరకక కుండా ఏం చేయాలి అనేది నెల రోజుల క్రితమే స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నట్లు తమ విచారణలో తేలిందని సీపీ అవినాష్ మహంతి వెల్లడించారు. అనుకున్న విధంగా ఈనెల 18న ఉదయం పక్కింటిలోని ఇంట్లోకి చొరబడి బ్యాట్ దొంగతనం చేసి తీసుకుని వస్తుండగా బాలిక సహస్ర చూడడంతో తన వెంట తీసుకువెళ్లిన కత్తితో బాలికను ఇష్టం వచ్చిన విధంగా పొడిచి చంపాడు.

అనంతరం అక్కడే మర్డర్ చేసిన కత్తిని కడిగేసి, టెర్రస్ గోడ దూకి తన ఇంటిలోకి వెళ్లి రక్తపు మరకలు అంటిన బట్టలను వాషింగ్ మెషిన్ లో వేశాడని, అనంతరం ఏమీ తెలియనట్టు మళ్లీ అదే ప్రాంతంలో ఏమీ తెలియనట్టు తిరగాడని సీపీ తెలిపారు. ఓ బాలుడి ఇచ్చిన సమాచారంతో దర్యాప్తు చేపట్టగా దర్యాప్తును పక్కదారి పట్టించేలా లేని విషయాలు చెప్పాడన్నారు. పక్కా ఆధారాలతో ఈ కేసును ఛేదించామని అన్నారు. మర్డర్ కు పాల్పడిన చోట క్లూస్ దొరికాయని, స్క్రిప్ట్ ప్రకారమే ఇదంతా చేశాడని, నెల రోజుల నుంచి ఇదంతా ప్లాన్ చేసుకున్నాడన్నారు.

ఓటీటీలు, మిస్టరీ సినిమాలు చూసే ఇదంతా చేశాడని అన్నారు. ఈ విషయం బాలుడి తల్లిదండ్రులకు కూడా తెలియదని, మర్డర్ జరిగిన తర్వాత కాస్త భయం భయంగా ఉన్న బాలుడిని అతని తల్లి నువ్వేమైన చేశావా అని అడిగితే రెండవ రోజు నువ్వే పట్టించేలా ఉన్నావని అన్నాడని ఆమె విచారణలో తెలిపిందన్నారు.

మేము డబ్బులు ఇవ్వకుండానే ఓ ఫోన్ కొనుకున్నాడని, అదెలా వచ్చింది అంటే సమాధానం చెప్పలేదని తమ దృష్టికి తీసుకు వచ్చినట్లు సీపీ తెలిపారు. అనంతరం బాలుడిని ప్రశ్నించడంతో నిజం అంగీకరించినట్టు తెలిపారు. బ్యాట్ కొనీయమని అడగాలంటే ఫ్యామిలీ మొత్తం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని అందుకే దొంగతనం చేసేందుకు సిద్ధమైనట్లు బాలుడు విచారణలో వెల్లడించినట్లు సీపీ వెల్లడించారు. సహస్ర హత్య కేసులో నిందితుడైన బాలుడిని జువైనల్ హోంకు తరలించారు పోలీసులు. అంతకుముందు అతడిని జువైనల్‌ జస్టిస్‌ బోర్డు ఎదుట హాజరుపరిచారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X