తెలంగాణ అమరవీరులకు, వారి కుటుంబాలకు చేతులెత్తి క్షమాపణ చెప్పిన కవిత, ‘జనం బాట’ ప్రారంభం…

ఏ ఆశయాల కోసం వారు ప్రాణత్యాగం చేశారో ఆ ఆశయాలు నెరవేరలేదు.
1200 మంది అమరులైతే 580 మందికి మాత్రమే న్యాయం జరిగింది.
ప్రతి అమరవీరుల కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా.
అమరుల కుటుంబాలకు, తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని ప్రమాణం చేస్తున్నా .
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.

హైదరాబాద్ : ‘జనం బాట’ కు బయలు దేరే ముందు గన్ పార్క్ వద్ద అమరులకు కవిత నివాళులు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో అనేక మంది అమరులయ్యారు. వారి త్యాగాలతో తెలంగాణ సాధించుకున్నాం. ఏ ఆశయాల కోసం వారు అమరులయ్యారో వాటిని ఎంత వరకు సాధించుకున్నామో ఆలోచించుకోవాలి. పేగులు తెగేదాక కొట్లాడిన ఉద్యమ కారుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో కూడా ఆలోచించుకోవాలి. తెలంగాణ కోసం 1200 మంది అమరులయ్యారని మనమే అసెంబ్లీ లో చెప్పాం. కాని వారికి ఇవ్వాల్సిన గౌరవం, వారి కుటుంబాలకు ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వలేదు.

ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షలు, ఉద్యోగం ఇస్తామని చెప్పాం. కానీ 580 మందికి మాత్రమే ఇచ్చాం. మిగతా వారికి న్యాయం చేయలేదు. ఉద్యమకారుల్లో కొంతమందికి ఎమ్మెల్యే, ఎంపీ, జడ్పీటీసీ, ఎమ్పీటీసీ, సర్పంచులు లాంటి అవకాశాలు వచ్చాయి.
కానీ ఇంకా వేలాది మందికి జరగాల్సిన న్యాయం జరగలేదు. ఇప్పటికి ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పేరుతో ఉద్యమం చేస్తున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను మంత్రిగా లేకపోయిన సరే ఎంపీగా, ఎమ్మెల్సీగా కొనసాగిన.

అప్పుడు అమరవీరుల కుటుంబాలాకు ఇంకో రూపంలోనైనా డబ్బులు ఇవ్వాలని అంతర్గత వేదికల్లో చెప్పాను. కానీ మీకోసం నేను ఇంకా ఎక్కువగా కొట్లాడేది ఉండే. అమరవీరులకు, వారి కుటుంబాలను చేతులెత్తి క్షమాపణ కోరుతున్నా. తెలంగాణ యావత్ బాగుండాలనే అమరులు వారి ప్రాణాలను త్యాగం చేశారు. ప్రతి అమరవీరుల కుటుంబానికి కోటి రూపాయలు వచ్చే విధంగా పోరాటం చేస్తానని ప్రమాణం చేస్తున్నా. ఈ ప్రభుత్వం కోటి రూపాయలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా.

ఒకవేళ ప్రభుత్వం కోటి రూపాయలు ఇవ్వకపోతే ప్రభుత్వాన్ని మార్చి వచ్చే ప్రభుత్వంతో నైనా వారికి న్యాయం జరిగేలా చేస్తానని అమరుల పాదాలకు నమస్కరించి చెబుతున్నా. ఉద్యకారుల లిస్ట్ మొత్తాన్ని ప్రజాదర్భార్ పెట్టుకొని తయారు చేద్దాం. ఆ ఉద్యమకారులందరికీ పెన్షన్ వచ్చే వరకు విరామం లేకుండా నేను పోరాటం చేస్తా. 33 జిల్లాలు 119 నియోజకవర్గాల్లో ‘జనం బాట’ పేరుతో జనం కోసం బయలుదేరుతున్నా. మీరు కూడా వచ్చేయండి. అందరం కలిసి పోరాటం చేద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామని హామీ ఇచ్చింది.

Also Read-

ఆ హామీ నెరవేరే వరకు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాల్సిందే. ఉద్యమకారుల పోరాటం కారణంగానే తెలంగాణ వచ్చింది.
అందరం బాగుండాలనే తెలంగాణ తెచ్చుకున్నాం. మహిళలు, రైతులు, యువకులు, నిరుద్యోగులు, కార్మికులు ఇలా అన్ని వర్గాలకు మేలు జరగాలని తెలంగాణ సాధించుకున్నాం. కానీ అన్ని వర్గాలకు న్యాయం జరిగిందా అంటే జరగలేదనే చాలా మంది చెబుతున్నారు. అందరు బాగుండాలంటే సామాజిక తెలంగాణ రావాలి. ప్రతి ఒక్కరికీ సమానంగా రాజకీయ, ఆర్థిక పరమైన అవకాశాలు దక్కాలి. జాగృతి ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తోంది. వాటిని సాధించుకుంటాం.

ఎస్సీలు, ఎస్టీల కోసం పోరాటం చేస్తున్నాం. మైనార్టీలకు రిజర్వేషన్లు ఉండాలని జాగృతి ఎప్పుడో చెప్పింది. అగ్రవర్ణాల్లోని అన్ని వర్గాలకు సరైన ప్రాతినిథ్యం లేదు. వైశ్యుల జనాభాకు అనుగుణంగా వారికి ప్రాతినిథ్యం లేదు. అగ్రవర్గాల్లోని అన్ని వర్గాలకు కూడా సమాన అవకాశాలు రావాలి. అందరూ బాగుంటేనే అందమైన బతుకమ్మ లాగా తెలంగాణ ఉంటుంది. ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ది కోసమే సామాజిక తెలంగాణ కావాలని అంటున్నా. దానికోసమే నేను జనం బాట కార్యక్రమాన్ని చేపడుతున్నా. ప్రతి జిల్లాలో మేధావులను కలుస్తాం. జిల్లాలో ఎక్కడ అభివృద్ధి ఆగిపోయిందో తెలుసుకుంటాం.

ఆయా ప్రాంతాల్లో చేయాల్సిన అభివృద్ధి గురించి చర్చిస్తాం. జాగృతి లో ఇదివరకు పనిచేసిన వాళ్లను మళ్లీ కలిసి రావాలని ఆహ్వానిస్తున్నా. ఇవ్వాళ ఉన్న ప్రభుత్వానికి అసలు తెలంగాణ సోయి లేదు. తెలంగాణ తల్లి చేతుల్లోంచి బతుకమ్మను తీసేయటం మన గుండెల్ని మెలి పెట్టినట్లైంది. మళ్లీ తెలంగాణ తల్లి చేతుల్లోకి బతుకమ్మ వచ్చే వరకు పోరాటం చేద్దాం. తెలంగాణలోని చాలా ప్రాంతాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ఈ ప్రాంతంలోని బిడ్డలకే 95 శాతం ఉద్యోగవకాశాలు రావాలని రాష్ట్రపతి ఉత్తర్వులను తెచ్చుకున్నాం. కానీ ఈ ప్రభుత్వం ప్రాంతేతరులకు ఉద్యోగాలు ఇస్తోంది.

హర్యానా సహా పక్కరాష్ట్రాల వారికి తెలంగాణలో ఉద్యోగాలు వస్తున్నాయి. ఆ అన్యాయాన్ని సహించేది లేదు. జాగృతి చూస్తూ ఊరుకోదు. ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి కావాలన్నదే నా అభిమతం. మరోసారి అమరవీరులకు, వారి కుటుంబాలకు నా తరఫున క్షమాపణలు చెబుతున్నా. వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తా. తెలంగాణ సోయి లేని ఈ ప్రభుత్వంపై జంగ్ సైరన్ పూరించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ ఈ పోరాటంలో కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నా.

జనం బాట కు మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం సంఘం మద్దతు

తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు, అమర వీరుల ఆశయాల సాధనకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని ప్రకటించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కు మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం మద్దతు ప్రకటించింది. జనం బాట కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ గన్ పార్క్ అమరుల స్థూపం వద్ద నివాళులు అర్పించే కార్యక్రమంలో పాల్గొన్న కవితకు సంఘం ప్రధాన కార్యదర్శి మల్లూరి అనిల్ కుమార్ వినతి పత్రం సమర్పించారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన 250 గజాల ఇంటి స్థలంలో పాటు రూ. 25 వేల పెన్షన్ హామీని అమలయ్యేలా చూడాలని ఆయన కోరారు. దీనిపై స్పందించిన కల్వకుంట్ల కవిత కచ్చితంగా ఉద్యమకారుల సంక్షేమ సంఘానికి అండగా ఉంటానని ప్రకటించారు. ప్రభుత్వం వారికిచ్చిన హామీలు అమలయ్యే వరకు పోరాటం చేస్తానని అన్నారు. అదే విధంగా ప్రతి జిల్లాలో ఉద్యమకారుల లిస్ట్ సిద్ధం చేసి వారికి పెన్షన్ వచ్చేలా కృషి చేస్తానన్నారు. తమ పోరాటానికి కవిత అండగా ఉంటానని ప్రకటించటం పట్ల మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లూరి అనిల్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. కవిత జనం బాట కార్యక్రమానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X