స్వీపర్, ఆఫీస్ బోయ్ నుండి ఇంఛార్జ్ దాకా అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ అభివాదం చేసిన మోదీ

బండి సంజయ్ చొరవతో బీజేపీ స్టేట్ ఆఫీస్ సిబ్బంది అందరినీ కలిసిన ప్రధానమంత్రి

• ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయ సిబ్బందిని కలిశారు. ఆఫీస్ లో పనిచేసే స్వీపర్, ఆఫీస్ బోయ్, డ్రైవర్ మొదలు అక్కడ పనిచేసే సిబ్బంది అందిరిని ఆప్యాయంగా పలకరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చొరవతో ఈరోజు కార్యాలయానికి చెందిన సుమారు 40 మంది ఆఫీస్ సిబ్బందిని కలిసేందుకు మోదీ కార్యాలయం అనుమతిచ్చింది.

• దీంతో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి ఆయా సిబ్బందిని వెంటబెట్టుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోని ఫ్లాట్ ఫామ్ నెంబర్ 10 వద్దకు వచ్చారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుండి నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చిన మోదీ ఫామ్ నెంబర్ – 10 వద్ద కు వస్తూ అక్కడున్న సిబ్బందికి అభివాదం చేశారు.

• మీరంతా ఎన్నేళ్ల నుండి బీజేపీ ఆఫీస్ లో పనిచేస్తున్నారు? ఎలా ఉన్నారు?’’అంటూ పలకరించారు. అనంతరం ఒక్కొక్కరి వద్దకు వచ్చి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. దేవుడి లాంటి మోదీని కలిసే అవకాశం రావడం తమ అద్రుష్టమని ఆయా సిబ్బంది పేర్కొనడం గమనార్హం.

• మోదీని కలిసిన వారిలో బంగారు శ్రుతితోపాటు ఆఫీస్ ఇంఛార్జ్ కేవీఎస్ఎన్.రాజు, కార్యాలయ కార్యదర్శి ఉమాశంకర్ తదితరులున్నారు.

బిజెపి రాష్ట్ర కార్యాలయానికి విచ్చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ఘనంగా స్వాగతం పలికిన కార్యకర్తలు నాయకులు. మహిళలు నాయకులు పూలమాలలు, పూలు తో బండి సంజయ్ కుమార్ గారికి స్వాగతం పలికారు.

• మోదీ సభను గ్రాండ్ సక్సెస్ చేసిన కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.

• స్వచ్చందంగా సభకు తరలివచ్చి మోదీ నాయకత్వంపట్ల ప్రజలు చూపుతున్న ఆదరాభిమానాలు మరువలేనివి.

• తెలంగాణ అభివ్రుద్దే బీజేపీ లక్ష్యం…

• తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలతో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యం

. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్
కేసీఆర్ అభివ్రుద్ధి నిరోధకుడు

ప్రధాని రాష్ట్రానికొచ్చి వేల కోట్ల పనులకు శంకుస్థాపన చేస్తే కేసీఆర్ హాజరు కాకపోవడం సిగ్గు చేటు

అంత పీకుడు పని ఏముంది?

తెలంగాణ ప్రజలు తగిన బుద్ది చెప్పడం ఖాయం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్

వేల కోట్లతో అభివ్రుద్ధి పనులను ప్రారంభించేందుకు ప్రధానమంత్రి తెలంగాణకు వస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ మొఖం చాటేయడం సిగ్గు చేటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. కేసీఆర్ అభివ్రుద్ధి నిరోధకుడంటూ ధ్వజమెత్తారు. పరేడ్ గ్రౌండ్ వద్ద మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తీరును తప్పుపట్టారు. ఆయన వ్యాఖ్యల్లోని ముఖ్యాంశాలు…..

• ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా బీజీ… తెలంగాణ అభివ్రుద్ధి కోసం 11 వేల 360 కోట్ల పనుల ప్రారంభానికి స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ వస్తే కూడా సీఎం హాజరు కాకపోవడం సిగ్గు చేటు.

• తెలంగాణలో వేల కోట్లతో జరిగే అభివ్రుద్ధి పనులకు హాజరు కావాలని సీఎం రావాలని నేను స్వయంగా కోరిన. ఆయన కోసం ప్రత్యేకంగా సీటు కేటాయించాం. సన్మానించేందుకు నేను శాలువా కూడా తెచ్చిన. కానీ ఎందుకు రాలేదు? ప్రధాని వచ్చినా రాలేదంటే అంత పీకుడు పనేముంది?

• తక్షణమే తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. ఈ కార్యక్రమానికి ప్రధాని, గవర్నర్, కేంద్ర మంత్రులు వచ్చినా కేసీఆర్ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలి.

• ఎన్నికలప్పుడే రాజకీయాలు… ఎన్నికలయ్యాక అభివ్రుద్దే ముఖ్యమని ప్రధాని చెప్పారు. రాజకీయాలతో సంబంధం లేకుండా తెలంగాణ అభివ్రుద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమానికి రాకుండా కేసీఆర్ అభివ్రుద్ధి నిరోధకుడని మరోసారి నిరూపించారు.

• తెలంగాణ అభివ్రుద్ధి పనులను వీక్షించేందుకు పరేడ్ గ్రౌండ్ పెద్ద ఎత్తున పజలొచ్చారు. టీవీల ద్వారా రాష్ట్ర ప్రజలంతా వీక్షించారు. సీఎం రాని విషయాన్ననని ప్రజలంతా గమనిస్తున్నారు. తగిన సమయంలో కేసీఆర్ కు బుద్ది చెప్పడం ఖాయం.

యుద్ద గుర్రాలుగా మారండి….
ఎన్నికల ఏడాదిలో ఉన్నాం… ఇకపై కఠినంగా ఉందాం
రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుందాం
బీజేపీ వివిధ మోర్చాల సమావేశంలో తరుణ్ చుగ్ స్పష్టీకరణ
మీరంతా యాక్టివ్ గా ఉంటే పార్టీ అంతగా బలోపేతమవుతుంది
కేసీఆర్ లో అహంకారం పెరిగింది
10 వేల మందితో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అతి త్వరలో నిరుద్యోగ మార్చ్
మే నాటికి అన్ని జిల్లాల్లో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తాం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వెల్లడి

• ‘‘ఎన్నికల ఏడాదిలో ఉన్నాం. మీరంతా యుద్దంలో పాల్గొనే గుర్రాల్లా మారాలి. ఇప్పుడు పెండ్లి ఊరేగింపు గుర్రాలతో పెద్దగా ప్రయోజనం ఉండదు.’’అని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన వివిధ మోర్చాల నాయకుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. చాలామంది కష్టపడి పనిచేస్తున్నారని… మిగిలిన వాళ్లు కూడా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

• ఈ సమావేశానికి తరుణ్ చుగ్ తోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శ్రుతి, ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి, డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, డాక్టర్ పద్మ, వేముల అశోక్, ఆకుల విజయ సహా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, యువ, కిసాన్, మైనారిటీ రాష్ట్ర అధ్యక్షులు, నాయకలు పాల్గొన్నారు.

• ఈ సందర్భంగా తరుణ్ చుగ్ మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్నందున పార్టీ కార్యక్రమాలను సీరియస్ గా తీసుకోవాలని ఆదేశించారు. రాబోయే నవంబర్ నుండి మే వరకు రివర్స్ ప్లాన్ లో కార్యక్రమాలను రూపొందించుకునేలా రోడ్ మ్యాప్ రెడీ చేయాలని కోరారు. అందులో భాగంగా 9,10,11 తేదీల్లో వివిధ మోర్చాలు సమావేశం కావాలని చెప్పారు. మండల స్థాయిలో క్రియాశీలంగా పనిచేస్తున్న వాళ్లెవరు? అంటీముట్టనట్లుగా ఉన్నవాళ్లెవరనే వివరాలు సేకరించి తమకు అందజేయాలని సూచించారు. ఈనెల 15, 16 తేదీల్లో మళ్లీ మోర్చాలతో సమావేశమవుతామని స్పష్టం చేశారు.

• ‘‘ఇకపై కఠినంగా ఉంటాం. ఎవరినీ ఉపేక్షించబోం. మీరు కూడా కార్యక్రమాల అమలు విషయంలో అట్లనే ఉండాలి. అధికారమే లక్ష్యంగా పనిచేయాలి. ఎన్నికల ఏడాదిలో ఉన్నందున యుద్దం చేసే గుర్రాల్లా మారాలి. పెళ్లిల్లో ఊరేగించే గుర్రాలతో ఇప్పుడవసరం ఉండదనే విషయాన్ని గుర్తుంచుకోండి’’అని స్పష్టం చేశారు. ఇకపై మోర్చాలు చేసే ప్రతి కార్యక్రమాన్ని సరళ్ యాప్ లో లోడ్ చేయాలని సూచించారు.
• అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ…. సికింద్రాబాద్ పరేడ్ బహిరంగ సభ సక్సెస్ చేసిన వాళ్లందరికీ అభినందనలు తెలిపారు. మోర్చాలు ఎంత యాక్టివ్ గా ఉంటే పార్టీ అంతగా బలోపేతమవుతుందనే విషయాన్ని గుర్తుంచుకుని కింది స్థాయి నుండి మోర్చాలను బలోపేతం చేసే దిశగా రోడ్ మ్యాప్ రూపొందించాలని ఆదేశించారు.

• ముఖ్యమంత్రి కేసీఆర్ లో అహంకారం పెరిగిందని, 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను ప్రమాదంలో పడ్డా కనీసం నోరు విప్పడం లేదన్నారు. నిరుద్యోగుల పక్షాన మే నాటికి అన్ని ఉమ్మడి జిల్లాల్లో భారీ ఎత్తున ’’నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తాం’’ అని పేర్కొన్నారు. అతి త్వరలో 10 వేల మందితో వరంగల్ జిల్లాలో నిరుద్యోగ మార్చ్ నిర్వహించేందుకు సిద్ధమయ్యామన్నారు.

సమాఖ్య స్పూర్తిని దెబ్బతీస్తున్న కేసీఆర్

వేల కోట్ల అభివ్రుద్ధి పనుల శంకుస్థాపన చేస్తుంటే సీఎం రాకపోవడం సిగ్గు చేటు

సభను అడ్డుకోవాలని సీఎం చేసిన కుట్రలను తిప్పికొట్టిన వాళ్లందరికీ అభినందనలు

బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్

ముఖ్యమంత్రి కేసీఆర్ సమాఖ్య స్పూర్తిని దెబ్బతీస్తూ ప్రధానమంత్రిని అవమానించడం దుర్మార్గమని బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ మండిపడ్డారు. ఇలాంటి స్థితి ఏ రాష్ట్రంలోనూ లేదని, తెలంగాణ ప్రజలంతా ఆలోచించాలని కోరారు. ఈ మేరకు ఈరోజు హైదరాబాద్ లో ఒక ప్రకటన విడుదల చేశారు.

తెలంగాణ కోసం వేల కోట్ల రూపాయలను కేటాయించి అభివ్రుద్ది పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ వస్తే…. సీఎం రాకపోవడం సిగ్గు చేటన్నారు. పైగా బీఆర్ఎస్ నేతలతో నిరసనలు చేయించి, కేంద్రానికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కట్టించడం దుర్మార్గమని పేర్కొన్నారు.

అధికార దురహంకారంతో కేసీఆర్ ప్రభుత్వం ప్రధాని పర్యటనను అడ్డుకోవాలని, బహిరంగ సభను ఫెయిల్ చేయాలని కుట్రలు చేయడం దుర్మార్గమన్నారు. అయినప్పటికీ బీజేపీ కార్యకర్తలు, ప్రజలు ఆయా కార్యక్రమాలను సక్సెస్ చేసి కేసీఆర్ కుట్రలను తిప్పికొట్టారని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ బహిరంగ సభను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రజలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

దేశ ప్రజలంతా కలిసి ప్రధానిని ఎన్నుకుంటే తెలంగాణ గడ్డపై అడుగుపెట్టిన 5 సార్లు ఏనాడూ గౌరవించకుండా అవమానించడం, సమాఖ్య స్పూర్తితో ఉండాల్సిన ముఖ్యమంత్రి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు వేరు… రాజకీయాలు వేరు అనే కనీస ఆలోచన లేకుండా వ్యవహరించడం సిగ్గు చేటు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X