IPL 2023 Final: बारिश प्रभावित मैच में रवींद्र जडेजा बने हीरो, CSK ने GT को 5 विकेट से हराया, धोनी के नाम 5वां खिताब दर्ज

हैदराबाद: चेन्नई सुपर किंग्स (CSK) ने गुजरात टाइटंस (GT) को 5 विकेट से हराया। टॉस जीतने के बाद चेन्नई सुपर किंग्स ने गेंदबाजी चुनी और मैच भी जीत लिया। बारिश प्रभावित मैच में सीएसके को जीत के लिए 15 ओवर में 171 रन का लक्ष्य मिला था। लेकिन सीएसके के बल्लेबाजों ने शानदार बल्लेबाजी करते हुए इस मुश्किल लक्ष्य को हासिल कर लिया। सीएसके के हर बल्लेबाज ने इस लक्ष्य को हासिल करने में अहम योगदान दिया।

टॉस जीतने के बाद सीएसके ने मैच भी जीत लिया। बारिश प्रभावित मैच में सीएसके को जीत के लिए 15 ओवर में 171 रन का लक्ष्य मिला था। लेकिन सीएसके के बल्लेबाजों ने शानदार बल्लेबाजी करते हुए इस मुश्किल लक्ष्य को हासिल कर लिया। सीएसके के हर बल्लेबाज ने इस लक्ष्य को हासिल करने में अहम योगदान दिया।

रवींद्र जडेजा ने कमाल कर दिया। आखिरी गेंद पर सीएसके को जीत के लिए चार रन की जरूरत थी। सीएसके ने चार रन स्कोर किए और पांच विकेट से गुजरात को हरा दिया।इस तरह जडेजा मैच के हीरो बन गये। सीएसके पांचवीं बार आईपीएल का विजेता बनने में कामयाब हो गया है। रवींद्र जडेजा ने 6 गेंद में 15 रन की नाबाद पारी खेली। धोनी के नाम 5वां खिताब दर्ज हो गया है। (एजेंसियां)

PL 2023 Fina: ఐదోసారి ఐపీఎల్‌‌ ట్రోఫీ గెలిచిన సీఎస్కే

హైదరాబాద్: చివరి బాల్‌‌ వరకు ఉత్కంఠ రేపిన ఐపీఎల్‌‌ ఫైనల్లో చెన్నై సూపర్‌‌కింగ్స్‌‌ అద్భుతం చేసింది. లాస్ట్‌‌ రెండు బాల్స్‌‌కు 10 రన్స్‌‌ అవసరమైన దశలో రవీంద్ర జడేజా (15 నాటౌట్‌‌) సిక్స్‌‌, ఫోర్‌‌తో చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. దీంతో సోమవారం అర్ధరాత్రి ముగిసిన టైటిల్‌‌ ఫైట్‌‌లో సీఎస్కే 5 వికెట్ల తేడాతో డిఫెండింగ్‌‌ చాంపియన్‌‌ గుజరాత్‌‌ టైటాన్స్‌‌ను ఓడించింది.

16 సీజన్లలో 10సార్లు ఫైనల్‌‌ చేరిన ధోనీసేన ఐదో ట్రోఫీని సగర్వంగా ఎత్తుకుంది. సాయి సుదర్శన్‌‌ (47 బాల్స్‌‌లో 8 ఫోర్లు, 6 సిక్స్‌‌లతో 96) సూపర్‌‌ హిట్టింగ్‌‌కు వృద్ధిమాన్‌‌ సాహా (39 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 54), శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ (20 బాల్స్‌‌లో 7 ఫోర్లతో 39) అండగా నిలవడంతో టాస్‌‌ ఓడిన గుజరాత్‌‌ 20 ఓవర్లలో 214/4 స్కోరు చేసింది.

ఛేజింగ్​లో మూడు బాల్స్​ తర్వాత వర్షం పడి, మెయిన్​ వికెట్​ పక్కన పిచ్​ చిత్తడిగా మారడంతో రెండు గంటలు ఆటకు అంతరాయం కలిగింది. చివరకు  డక్​వర్త్​ లూయిస్​ ప్రకారం సీఎస్కే టార్గెట్‌‌ను 15 ఓవర్లలో 171 రన్స్‌‌కు కుదించారు. దీనిని చెన్నై 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. డేవన్‌‌ కాన్వే (25 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 2 సిక్స్‌‌లతో 47), శివమ్‌‌ దూబే (32 నాటౌట్‌‌) రాణించారు. 

భారీ టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో సీఎస్కేకు శుభారంభం లభించింది. వర్షం నుంచి వచ్చిన తర్వాత కాన్వే 6, 4, 4, 4తో  రెచ్చిపోయాడు. ఆ వెంటనే రుతురాజ్‌‌ (26) 6, 4 బాదాడు. దీంతో నాలుగు ఓవర్లలోనే చెన్నై 52/0 స్కోరు చేసింది. ఐదో ఓవర్‌‌లో నూర్‌‌ అహ్మద్‌‌ (2/17) 5 రన్సే ఇచ్చినా, తర్వాతి ఓవర్‌‌లో లిటిల్‌‌ (0/30) సిక్స్‌‌తో 14 రన్స్‌‌ ఇచ్చాడు. కానీ ఏడో ఓవర్‌‌లో సీఎస్కేకు డబుల్‌‌ ఝలక్‌‌ తగిలింది. నూర్‌‌ అహ్మద్‌‌ మూడు బాల్స్‌‌ తేడాలో రుతురాజ్‌‌, కాన్వేను  ఔట్‌‌ చేయడంతో స్కోరు 78/2గా మారింది.

ఈ దశలో రహానె (27) రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో టచ్‌‌లోకి వచ్చినా, శివమ్‌‌ దూబే  సింగిల్స్‌‌తో స్ట్రయిక్‌‌ రొటేట్‌‌ చేశారు. తర్వాతి మూడు ఓవర్లలో 34 రన్స్‌‌ రావడంతో ఫస్ట్‌‌ టెన్‌‌లో సీఎస్కే 112/2 స్కోరుతో నిలిచింది. ఇక ఫర్వాలేదనుకున్న దశలో 11వ ఓవర్‌‌లో మోహిత్‌‌ శర్మ (3/36) రహానెను ఔట్‌‌ చేయడంతో మూడో వికెట్‌‌కు 39 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ బ్రేక్‌‌ అయ్యింది.

12వ ఓవర్‌‌లో దూబే రెండు వరుస సిక్సర్లతో 15 రన్స్‌‌ దంచితే తర్వాత మోహిత్‌‌ ఓవర్‌‌లో రాయుడు వరుసగా 6, 4, 6 కొట్టడంతో 11 బాల్స్‌‌లోనే 32 రన్స్‌‌ జతయ్యాయి. కానీ ఇదే ఓవర్‌‌లో వరుస బాల్స్‌‌లో రాయుడు, ధోనీ (0) ఔట్‌‌కావడంతో విజయసమీకరణం 12 బాల్స్‌‌లో 21 రన్స్‌‌గా మారింది. దూబే, జడేజా పెనాల్టీమెట్‌‌ ఓవర్‌‌లో 8 రన్స్‌‌ రాబట్టడంతో ఆఖరి ఓవర్‌‌లో విజయానికి 14 రన్స్‌‌ అవసరం అయ్యాయి. లాస్ట్‌‌లో మోహిత్‌‌ తొలి నాలుగు బాల్స్‌‌లో 3 రన్సే ఇవ్వడంతో టార్గెట్‌‌ రెండు బాల్స్‌‌లో 10గా మారింది. 

టాస్‌‌‌‌‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన జీటీ స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌ ఓవర్లలో మెల్లగా ఆడినా.. ఆఖరి పది ఓవర్లలో సాయి సుదర్శన్‌‌‌‌‌‌‌‌ విశ్వరూపం చూపెట్టాడు. ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ పదో బాల్‌‌‌‌‌‌‌‌కే స్క్వేర్‌‌‌‌‌‌‌‌ లెగ్‌‌‌‌‌‌‌‌లో శుభ్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన ఈజీ క్యాచ్‌‌‌‌‌‌‌‌ను దీపక్‌‌‌‌‌‌‌‌ చహర్‌‌‌‌‌‌‌‌ (1/38) డ్రాప్‌‌‌‌‌‌‌‌ చేసి మూల్యం చెల్లించాడు. తర్వాతి ఓవర్‌‌‌‌‌‌‌‌లో 6, 4, 4తో టచ్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చిన సాహా.. ఐదో ఓవర్‌‌‌‌‌‌‌‌లో ఇచ్చిన రిటర్న్‌‌‌‌‌‌‌‌ క్యాచ్‌‌‌‌‌‌‌‌ను కూడా చహర్‌‌‌‌‌‌‌‌ వదిలేశాడు. నాలుగో ఓవర్లో హ్యాట్రిక్‌‌‌‌‌‌‌‌ ఫోర్స్‌‌‌‌‌‌‌‌ కొట్టిన గిల్‌‌‌‌‌‌‌‌.. తర్వాతి ఓవర్లలో మరో నాలుగు బౌండ్రీలు రాబట్టడంతో పవర్‌‌‌‌‌‌‌‌ప్లేలో జీటీ 62/0 స్కోరు చేసింది.

ఏడో ఓవర్‌‌‌‌‌‌‌‌లో బౌలింగ్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన జడేజా (1/38) లాస్ట్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌కు ధోనీ మెరుపు స్టంపింగ్​తో గిల్‌‌‌‌‌‌‌‌ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేయడంతో తొలి వికెట్‌‌‌‌‌‌‌‌కు 67 రన్స్‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ బ్రేక్‌‌‌‌‌‌‌‌ అయ్యింది.  సగం ఓవర్లకు గుజరాత్‌‌‌‌‌‌‌‌ 86/1  స్కోరు చేసింది. ఇక్కడి నుంచి సుదర్శన్‌‌‌‌‌‌‌‌.. సాహాతో కలిసి స్ట్రయిక్‌‌‌‌‌‌‌‌ రొటేట్‌‌‌‌‌‌‌‌ చేస్తూనే వీలైనప్పుడల్లా బౌండ్రీలు బాదాడు. 12వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో రెండు ఫోర్లతో 13 రన్స్‌‌‌‌‌‌‌‌ రాబట్టాడు. 14వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో చహర్‌‌‌‌‌‌‌‌.. సాహాను ఔట్‌‌‌‌‌‌‌‌ చేసి రెండో వికెట్‌‌‌‌‌‌‌‌కు 64 రన్స్‌‌‌‌‌‌‌‌ భాగస్వామ్యానికి తెరదించాడు.

అప్పటికి స్కోరు 131/2. ఇక15వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో రెండు సిక్స్‌‌‌‌‌‌‌‌లతో రెచ్చిపోయిన సుదర్శన్‌‌‌‌‌‌‌‌.. స్లాగ్‌‌‌‌‌‌‌‌ ఓవర్స్‌‌‌‌‌‌‌‌లో బౌండ్రీల వర్షం కురిపించాడు. పతిరణ (2/44) వేసిన16వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో బ్యాక్‌‌‌‌‌‌‌‌ టు బ్యాక్‌‌‌‌‌‌‌‌ ఫోర్లతో 33 బాల్స్‌‌‌‌‌‌‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. చివర్లో తుషార్​ (0/56) వేసిన 17వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో 6, 4, 4, 4తో 20 రన్స్‌‌‌‌‌‌‌‌, 19వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో 6, 4, 6తో 18 రన్స్‌‌‌‌‌‌‌‌ చేసిన సుదర్శన్‌‌‌‌‌‌‌‌.. లాస్ట్‌‌‌‌‌‌‌‌ ఓవర్‌‌‌‌‌‌‌‌లో తొలి రెండు బాల్స్‌‌‌‌‌‌‌‌ను రెండు సిక్సర్లుగా మలిచి సెంచరీకి నాలుగు రన్స్‌‌‌‌‌‌‌‌ దూరంలో ఔటయ్యాడు. మధ్యలో హార్దిక్‌‌‌‌‌‌‌‌ (21 నాటౌట్‌‌‌‌‌‌‌‌) కూడా బ్యాట్‌‌‌‌‌‌‌‌ ఝుళిపించడంతో జీటీ భారీ స్కోరు చేసింది.

భారీ ఎత్తున నిర్వహించాలనుకున్న క్లోజింగ్‌‌‌‌‌‌‌‌ సెర్మనీని నిర్వాహకులు మోస్తరు స్థాయిలోనే ముగించారు. డివైన్‌‌‌‌‌‌‌‌, కింగ్‌‌‌‌‌‌‌‌, న్యూక్లేయ, జొనితా గాంధీ రాకింగ్‌‌‌‌‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌కు అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌ స్టేడియం ఊగిపోయింది. కళ్లు చెదిరే లేజర్‌‌‌‌‌‌‌‌ షో మధ్య వీళ్లు చేసిన నృత్యాలకు ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌ హోరెత్తారు. ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ బ్రేక్‌‌‌‌‌‌‌‌లో గాంధీ, డివైన్‌‌‌‌‌‌‌‌ తమ ఆటపాటలతో కాసేపు అలరించారు. స్టేడియంలోని ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌ కూడా మొబైల్‌‌‌‌‌‌‌‌ ఫ్లాష్‌‌‌‌‌‌‌‌ లైట్లు ఆన్‌‌‌‌‌‌‌‌ చేసి డ్యాన్స్‌‌‌‌‌‌‌‌లు చేశారు. స్టేడియం మొత్తం కలర్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌ లేజర్​ లైట్స్‌‌‌‌‌‌‌‌తో మెరిసింది. భారీ వర్షంతో మ్యాచ్‌‌‌‌‌‌‌‌ రిజర్వ్‌‌‌‌‌‌‌‌ డేకు వచ్చినా ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌ మాత్రం పోటెత్తారు. స్టేడియం ఫుల్‌‌‌‌‌‌‌‌ కెపాసిటితో నిండిపోయింది. 

వర్షం ఇబ్బంది పెట్టినా బౌలర్లు నిరాశ పరిచినా ప్రత్యర్థి భారీ స్కోరుతో సవాల్​ విసిరినా అన్ని  అడ్డంకులనూ దాటుకొచ్చిన ధోనీసేన ​ ఐపీఎల్​16 ట్రోఫీ కైవసం చేసుకుంది. ఆఖరి బాల్​ వరకూ నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఫైనల్లో గుజరాత్​ టైటాన్స్​ థ్రిల్లింగ్​ విక్టరీతో  చెన్నై సూపర్ కింగ్స్ ఐదో టైటిల్ ఖాతాలో వేసుకుంది.  వాన కారణంగా ఐపీఎల్​ చరిత్రలోనే తొలిసారి రిజ్వర్​డేను ఉపయోగించి రెండో రోజునా చినుకులు ఆటగాళ్లను అభిమానులను చికాకు పెట్టిన పోరులో భారీ టార్గెట్​ను కాపాడుకోలే కపోయిన డిఫెండింగ్​ చాంప్​ జీటీ ఈసారి రన్నరప్​తో సరిపెట్టింది.

రెండు రోజులు ఎదురుచూస్తూ వానలో తడుస్తూ స్టేడియంలో గంటల పాటు నిరీక్షిస్తూ ధోనీ ధోనీ సీఎస్కే సీఎస్కే అంటూ తమకు సపోర్ట్​ ఇచ్చిన ఫ్యాన్స్​కు ఐదో ట్రోఫీతో చెన్నై  హై‘ఫైవ్’​ ఇచ్చింది. ఐపీఎల్​లో అత్యధిక టైటిళ్లు నెగ్గిన టీమ్​గా ముంబై ఇండియన్స్​ను అందుకుంది. ఛేజింగ్​లో ధోనీ సున్నాచుట్టినా కెరీర్​లో ఆఖరాట ఆడిన తెలుగోడు అంబటి రాయుడు కీలక ఇన్నింగ్స్​ ఆడగా ఆఖరి రెండు బాల్స్​కు 6,4 కొట్టిన జడేజా హీరోగా నిలిచాడు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X