తెలంగాణ ప్రజలే కల్వకుంట్ల కుటుంబాన్ని బహిష్కరిస్తారు: కిషన్ రెడ్డి

హామీల అమలు చేతగాని అవినీతి పార్టీ బీఆర్ఎస్

కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే తాను ముక్కలు

రాష్ట్రానికి ఏం చేశారని బీఆర్ఎస్ పార్టీని ప్రజలు భరించాలన్న కేంద్రమంత్రి,రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి

రాష్ట్రప్రభుత్వం సహకరించకపోయినా.. తెలంగాణ అభివృద్ధికి నిరంతరం అండగా నిలుస్తూ భారీ ప్రాజెక్టులు కేటాయిస్తున్న మోదీకి సమస్త తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపిన కిషన్ రెడ్డి

వరంగల్: పచ్చి అబద్ధాలతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కల్వకుంట్ల కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలు బహిష్కరించే సమయం ఎంతో దూరంలో లేదని కేంద్ర మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. వచ్చే నాలుగు నెలల తర్వాత అధికార బీఆర్ఎస్ ను ఫామ్ హౌజ్ కే పరిమితం చేయడం ఖాయమన్నారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ వరంగల్ పర్యటన సందర్భంగా కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో కేంద్రమంత్రి, బీజేపీ చీఫ్ శ్రీ జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అవినీతి గురించి అర్థమైందని.. అందుకే అధికార పార్టీలో భయం పట్టుకుందన్నారు.

త్వరలోనే తెలంగాణలోని అన్ని వర్గాలు సంపూర్ణంగా బీఆర్ఎస్‌ను బహిష్కరించబోతున్నాయన్నారు. బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటే అని కొందరు ప్రచారం చేస్తున్నారని మండపడ్డారు. బీఆర్ఎస్‌తో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్న పార్టీ కాంగ్రెస్‌ అని రానున్న ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు తెలంగాణ ప్రజలు తప్పక బుద్ధి చెబుతారని అన్నారు.

ప్రధాని మోడీ నాయకత్వంలో తమ పోరాటం కొనసాగుతోందని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు భవిష్యత్ లేదన్న ఆయన ఈ రెండు పార్టీల నిర్లక్ష్యం కారణంగానే ఇన్నాళ్లూ తెలంగాణ అన్యాయానికి గురైందని అన్నారు. మజ్లీస్ పార్టీ తో కిలిసి గుండాయిజం, రౌడీయిజాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచి పోషిస్తోందని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్‌ను ఓడించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

అసెంబ్లీ వేదికగా అబద్ధాలతో లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవ్వనందుకు..ఎంసెట్ పేపర్, పదోతరగతి పేపర్ లీక్, TSPSC పేపర్ లీక్ లను ఆపనందుకు.. గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల నిర్వహణను మరిచిపోయినందుకు.. పోలీసుల రిక్రూట్‌మెంట్ జరపనందుకు.. 9 ఏళ్లుగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనందుకు..నిరుద్యోగ భృతి ఇవ్వనందుకు.. తెలంగాణ యువత బహిష్కరించేందుకు సిద్దంగా ఉన్నారు.

దళితబంధు పేరుతో పార్టీ కార్యకర్తలకు దోచి పెడుతున్నందుకు.. ఎస్సీ వర్గీకరణను అటకెక్కించినందుకు.. దళితులు బీఆర్ఎస్‌ను బహిష్కరిస్తారన్నారు. ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లను ఫైళ్లకే పరిమితం చేసినందుకు.. గిరిజనులు, రైతు రుణమాఫీ చేయనందుకు, ఉచితంగా ఇస్తామన్న యూరియా ఇవ్వనందుకు, ధరణి పేరుతో ఇబ్బందులు పెడుతున్నందుకు కల్వకుంట్ల కుటుంబాన్ని, ఆ పార్టీ బహిష్కరించేందుకు రైతులు సిద్దంగాఉన్నారని కిషన్ రెడ్డి అన్నారు.

నిజాం షుగర్స్, బిల్ట్ ఫ్యాక్టరీలను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చి ఓట్లేయించుకుని ఇప్పుడు మోసం చేసినందుకు కార్మికులు.. పాతబస్తీని ఇస్తాంబుల్‌గా, హైదరాబాద్‌ను డాలస్‌గా మారుస్తానని చెప్పి చేయనందుకు.. ఇలా ఎన్నో హామీలు ఇచ్చి వాటిని అమలు చేయనందుకు.. తెలంగాణ ప్రజలే కల్వకుంట్ల కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని రాష్ట్రం నుంచి బహిష్కరిస్తారని కిషన్ రెడ్డి అన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించపోయినా.. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తున్నందుకే.. మోదీ పర్యటను బహిష్కరించారా? అని ఆయన ప్రశ్నించారు. మోదీ రాకతో కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని.. తెలంగాణ అభివృద్ధి చెందడం ఇష్టం లేకే.. ఇలాంటి చవకబారు ప్రకటను చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులపై కిషన్ రెడ్డి మండిపడ్డారు.

తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందని.. కల్వకుంట్ల కుటుంబం అవినీతిపై ప్రజలు విసిగి పోయారని.. వీరిని రాష్ట్రం నుంచి బహిష్కరిస్తూ.. ఫామ్‌హౌజ్ కే పరిమితం చేసే రోజులు ఎంతో దూరంలో లేవని కిషన్ రెడ్డి అన్నారు.

అంతకుముందు.. జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ సభలోనూ కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. ఎన్నో ఏళ్ల కల అయిన రైల్వే మ్యానుఫాక్చరింగ్ యూనిట్‌ను, రైల్వే పీరియాడిక్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాప్‌ను రూ. 521 కోట్ల వ్యయంతో ఏర్పాటుచేసిన మోదీకి సమస్త తెలంగాణ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణలో మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో కేంద్రం.. ఎప్పుడు అడిగినా.. అన్నిరకాలుగా అండగా నిలుస్తోందన్నారు. రూ.5,588 కోట్ల వ్యయంతో చేపడుతున్న రెండు జాతీయ రహదారుల ప్రాజెక్టుల ద్వారా వరంగల్, కరీంనగర్ జిల్లాలతో పాటు మంచిర్యాల, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల ప్రజలకు సౌకర్యంగా ఉండటంతోపాటుగా.. ఈ ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధికి బాటలు పడతాయన్నారు. రాష్ట్రంలో మరెన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు కేంద్రం అండగా నిలుస్తోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

केसीआर सरकार को हराने की जरूरत है : किशन रेड्डी

बीजेपी तेलंगाना अध्यक्ष किशन रेड्डी ने मुख्यमंत्री केसीआर पर गंभीर टिप्पणी की है। शनिवार को किशन रेड्डी ने हनमकोंडा के आर्ट्स कॉलेज के मैदान में आयोजित विजय संकल्प सभा में हिस्सा लिया। उन्होंने कहा कि कुछ लोग प्रचार कर रहे हैं कि बीआरएस और भाजपा एक ही हैं।

किशन रेड्डी ने कहा कि कांग्रेस वह पार्टी है जिसने बीआरएस के साथ समझौता किया है। उन्होंने कहा कि तेलंगाना के लोगों को आगामी चुनाव में इन दोनों पार्टियों को अपनी समझदारी दिखानी होगी। उन्होंने साफ किया कि प्रधानमंत्री मोदी के नेतृत्व में उनका संघर्ष जारी है।

उन्होंने कहा कि कांग्रेस और बीआरएस का कोई भविष्य नहीं है। उन्होंने कहा कि इन दोनों पार्टियों की लापरवाही के कारण इतने वर्षों में तेलंगाना के साथ अन्याय हुआ है। उन्होंने कहा कि बीआरएस सरकार गुंडागर्दी और उपद्रव को बढ़ावा दे रही है। उन्होंने कहा कि राज्य में केसीआर सरकार को हराने की जरूरत है।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X