हैदराबाद: कंटोनमेंट बीआरएस विधायक जी लस्या नंदिता की सड़क दुर्घटना में मौत हो गई है। उसकी जान तब चली गई जब उसकी कार पटानचेरु ओआरआर पर सड़क किनारे रेलिंग से टकरा गई। शुक्रवार (23 फरवरी) तड़के हुए इस हादसे में कार चला रहे पीए-कम-ड्राइवर आकाश गंभीर रूप से घायल हो गया था। उसे इलाज के लिए हैदराबाद के एक निजी अस्पताल में भर्ती कराया गया। लेकिन आकाश के अलावा कोई नहीं जानता कि हादसा कैसे हुआ। इसी सिलसिले में उसने खुलासा किया कि हादसे के वक्त असल में क्या हुआ।
पुलिस ने आकाश का बयान दर्ज किया, जिसे अस्पताल में इलाज के दौरान उसे होश आया। इस तरह उसने हादसे के बारे में खुलासा किया। आकाश ने अपनी गवाही में कहा, “हम सदाशिवपेट दरगाह से हैदराबाद पहुंचे। हम उसकी बहन की बेटी को, जो लास्या की कार में थी, दूसरी कार में बिठा दिया। हम होटल की तलाश में गए क्योंकि लास्या ने इच्छा व्यक्त की कि कुछ खाएंगे। समझ में यह नहीं आ रहा है कि हादसा कैसे हुआ। उस वक्त मेरा माइंड ब्लैंक हो गया।”
पुलिस ने इस हादसे को लेकर आकाश के खिलाफ मामला दर्ज कर लिया है। लास्या के परिवार वालों ने भी पुलिस से शिकायत की कि आकाश की लापरवाही से गाड़ी चलाने के कारण ही लास्या की मौत हो गई है। इसी क्रम में पुलिस ने दुर्घटना में घायल और इलाज करा रहे आकाश का बयान दर्ज किया। होश में आने के बाद आकाश ने मजिस्ट्रेट के सामने गवाही दी है।
संबंधित खबर:
स्थानीय डीएसपी ने मीडिया के सामने हादसे के तरीके का खुलासा किया। आगे जा रहे वाहन की चपेट में आने के बाद विधायक की गाड़ी अनियंत्रित हो गयी और ओआरआर पर बायीं ओर की रेलिंग से टकरा गयी। उन्होंने बताया कि हादसे से पहले कार का अगला हिस्सा टूट कर नीचे गिर गया। डीएसपी ने आगे बताया कि लापरवाही पूर्वक तेज गति से गाड़ी चलाने के कारण कार दुर्घटना हुई है। लास्या की बहन की शिकायत पर आकाश के खिलाफ आईपीसी की धारा 304 ए के तहत मामला दर्ज किया गया।
विधायक लास्या नंदिता अपने परिवार के सदस्यों के साथ सदाशिवपेट में एक दरगाह पर प्रार्थना करने गईं थी। प्रारंभिक जांच में पता चला कि वहां से लौटने के बाद वे परिवार के सदस्यों को घर के पास छोड़ दिया। इसके बाद टिफिन के लिए संगारेड्डी की ओर गई। पुलिस ने पाया कि लास्या की कार शामीरपेट में बाहरी रिंग रोड में प्रवेश कर गई। पुलिस ने खुलासा किया कि वह हर पहलू से जांच कर रही है। मालूम हो कि लास्या नंदिता का अंतिम संस्कार शुक्रवार को राजकीय सम्मान के साथ पूरा किया गया।
MLA లాస్య నందిత యాక్సిడెంట్ ఎలా జరిగిందో చెప్పిన పీఏ ఆకాష్
హైదరాబాద్: కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జి లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. పటాన్‌చెరు ఓఆర్‌ఆర్‌పై రోడ్డు పక్కన రెయిలింగ్‌ను ఆమె ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. శుక్రవారం (ఫిబ్రవరి 23) తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో కారు డ్రైవింగ్ చేస్తున్న పీఏ ఆకాష్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందనే విషయం ఆకాష్‌కు తప్ప ఎవరికి తెలియదు. ఈ నేపథ్యంలో యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఏం జరిగిందో అతడు వెల్లడించాడు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్పృహలోకి వచ్చిన ఆకాష్ నుంచి పోలీసులు స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. యాక్సిడెంట్ గురించి అతడు ఈ విధంగా వెల్లడించారు. ‘ సదాశివపేట దర్గా నుండి హైదరాబాద్ చేరుకున్నాం. లాస్య కారులో ఉన్న తన అక్క కూతుర్ని మరో కారులోకి ఎక్కించాం. లాస్య ఏదానా తిందాం అని అనటంతో హోటల్స్ వెతుక్కుంటూ వెళ్లాం. యాక్సిడెంట్ ఎలా జరిగిందో అర్థం కావట్లేదు. ఆ టైంలో నా మైండ్ బ్లాంక్ అయ్యింది.’ అని ఆకాష్ వాంగ్మూలంలో పేర్కొన్నారు.
ఇక ఈ యాక్సిడెంట్‌లో ఆకాష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆకాష్ నిర్లక్ష్యపూరితంగా కారు నడపడం వల్లే లాస్య చనిపోయిందని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ఆకాష్ నుంచి పోలీసులు స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. మేజిస్ట్రేట్ సమక్షంలో స్పృహలో ఉన్న ఆకాష్ వాంగ్మూలం ఇచ్చాడు.
ఇక ప్రమాదం జరిగిన తీరును స్థానిక డీఎస్పీ మీడియాకు వెల్లడించారు. ముందు వెళ్తున్న వాహనం ఢీకొట్టిన తర్వాత ఎమ్మెల్యే కారు కంట్రోల్ కాక ఓఆర్‌ఆర్‌పై లెఫ్ట్ సైడ్ రెయిలింగ్‌కు ఢీ కొట్టిందని చెప్పారు. ప్రమాదం కంటే ముందే కారు ముందు భాగం పగిలి కింద పడిపోయి ఉన్నాయన్నారు. నిర్లక్షంగా అతివేగంగా నడపడం వల్లే కారు ప్రమాదం జరిగిందని డీఎస్పీ చెప్పారు. లాస్య సోదరి నివేదిత ఫిర్యాదుతో ఆకాష్ మీద ఐపీసీ సెక్షన్ 304 ఏ కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
సదాశివపేటలోని ఓ దర్గాలో మొక్కులు చెల్లించడానికి ఎమ్మెల్యే లాస్య నందిత తన కుటుంబ సభ్యులతో వెళ్లారు. అక్కడి నుంచి తిరిగొచ్చి.. కుటుంబ సభ్యులను ఇంటి దగ్గర దింపిన తర్వాతే టిఫిన్ కోసం సంగారెడ్డి వైపు వెళ్లారని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. షామీర్ పేట వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపైకి లాస్య కారు ఎంట్రీ అయినట్టు పోలీసులు గుర్తించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇక శుక్రవారమే ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో లాస్య నందిత అంత్యక్రియలు పూర్తైన సంగతి తెలిసిందే. (ఏజెన్సీలు)