జై తెలంగాణ ! జై జై తెలంగాణ! ! ‘తెలంగాణ వచ్చుడో… కేసీఆర్ సచ్చుడో’ కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించిన చారిత్రక రోజు

కోట్లాది ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు, ‘తెలంగాణ వచ్చుడో..కేసీఆర్ సచ్చుడో’ అంటూ, ప్రాణాలను పణంగా పెట్టి, సమైక్య పాలకుల నిర్బంధాలను ఛేదించి, ‌సిద్దిపేట కేంద్రంగా ఉద్యమ వీరుడు కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించిన చారిత్రక రోజు…నవంబర్ 29, దీక్షా దివాస్

ఆనాటి ఆమరణ నిరాహారదీక్ష స్పూర్తితో, స్వరాష్ట్రం తెలంగాణలో సీఎం శ్రీ కేసీఆర్ గారి సారధ్యంలో, సర్కారు సంక్షేమ, అభివృద్ధి ఫలాలతో సబ్బండ వర్ణాలు సగర్వంగా, సంతోషంగా ఉన్నారు. రాష్ట్రం అన్నింటా అగ్రగామిగా నిలుస్తూ, దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది.

కేటీఆర్‌ ట్వీట్‌

తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిన కేసీఆర్‌ దీక్షకు నేటితో 13 ఏళ్లు. ఉద్యమ నాయకుడిగా ఆయన ‘తెలంగాణ తెచ్చుడో.. కేసీఆర్‌ సచ్చుడో’ నినాదంతో 2009 నవంబర్‌ 29న ఆమరణ దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నాటి రోజుల్ని మంత్రి కేటీఆర్‌ గుర్తు చేసుకున్నారు. చరిత్రను మలుపుతిప్పిన నవంబర్‌ 29తేదీ చరిత్రలో చిరస్మరణీయమైన రోజుగా నిలిచిపోతుందని అన్నారు. ఈ మేరకు కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

ఉద్యమ నాయకుడిగా కేసీఆర్‌ ‘తెలంగాణ తెచ్చుడో.. కేసీఆర్‌ సచ్చుడో’ నినాదంతో 2009 నవంబర్‌ 29న ఆమరణ దీక్షకు దిగారు. ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను ప్రజ్వలింపజేసి, తెలంగాణ రాష్ట్ర సాధనకు అంకురార్పణ చేసిన రోజును టీఆర్‌ఎస్‌ దీక్షా దివస్‌గా పాటిస్తున్నది. 2009 నవంబర్‌ 29న కరీంనగర్‌లోని ఉత్తర తెలంగాణభవన్‌ నుంచి దీక్షాస్థలి సిద్దిపేటకు కేసీఆర్‌ బయలుదేరగా, కరీంనగర్‌ మానేరు బ్రిడ్జి అలుగునూరు వద్ద పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి ఖమ్మం జైలుకు తరలించారు. ఆ తరువాత నిమ్స్‌ దవాఖానకు తరలించారు. అక్కడే కేసీఆర్‌ దీక్షను 11 రోజుల పాటు కొనసాగించారు. తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేస్తామని డిసెంబర్‌ 9న యూపీఏ ప్రభుత్వం ప్రకటించిన తరువాతనే ఆయన దీక్షను విరమించారు.

జై తెలంగాణ ! జై జై తెలంగాణ! !

https://twitter.com/KTRTRS/status/1597450977720041476?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1597450977720041476%7Ctwgr%5E1c89b6bfe4942a4265929c7fb2bdc31bcd906d29%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.ntnews.com%2Ftelangana%2Fminister-ktr-tweet-on-trs-deeksha-divas-860546

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X