हैदराबाद: दोनों तेलुगु राज्यों में हड़कंप मचाने वाली वेंकटमाधवी की हत्या के मामले में खास प्रगति सामने नहीं आई है। शक के चलते पति ने अपनी पत्नी की उस समय निर्मम हत्या कर दी, जब घर पर कोई नहीं थे। शराब पीते-पीते पति ने चाकू और आरी से उसकी लाश के टुकड़े-टुकड़े कर दिए और उसे कुकर में उबाल दिया। ज्ञात हो कि उबले हुए टुकड़ों का पाउडर और हड्डियों का चूरा करके बाल्टी में ले जाकर जिल्लेलागुडा तालाब में फेंक देने की घटना देर से प्रकाश में आई।
पुलिस को इस हत्या मामले की जांच में अबतक शव का कोई खास सुराग नहीं मिला है, जबकि हत्या को लगभग दस दिन हो चुके हैं। पुलिस ने घटनास्थल पर लगे सीसीटीवी कैमरों की जांच की है और पाया है कि इस महीने की 14 तारीख को केवल पति-पत्नी ही बाहर से घर में दाखिल हुए थे, लेकिन पति के बयान के अनुसार पत्नी के घर से बाहर जाने का कोई सबूत नहीं मिला है। इससे पुलिस का गुरुमूर्ति पर संदेह और मजबूत हो गया है।

मीरपेट पुलिस ने गुरुमूर्ति को हिरासत में लेकर पूछताछ की और बताया कि उसने अपना अपराध कबूल कर लिया है। हालांकि, पुलिस की पूछताछ के दौरान गुरुमूर्ति लगातार असंगत जवाब दे रहा है। इसके चलते पुलिस की कार्रवाई आगे नहीं बढ़ रही है। खबर है कि पुलिस ने हत्या में उपयोग किया गया चाकू के साथ हड्डियों को काटने वाली आरी भी जब्त कर ली है। लेकिन तालाब में वेंकटमाधवी के शव का कोई निशान नहीं मिला है। ऐसा लगता है कि गुरुमूर्ति ने बड़ी ही होशियारी से हत्या को अंजाम दिया। अब पुलिस हत्या के अपराध स्थल का पुनर्निर्माण (reconstruct the crime scene) करने जा रही है। पुलिस को इस बात का पता लगाना अब भी बाकी है कि क्या गुरुमूर्ति ने अकेले ही यह हत्या की या किसी और ने उसकी मदद की है?
प्रकाशम जिले के जेपीचेरुवु गांव निवासी गुरुमूर्ति की शादी 13 साल पहले उसी क्षेत्र के उप्पल सुब्बम्मा और वेंकटरमण दंपति की सबसे बड़ी बेटी वेंकटमाधवी (35) से हुई थी। इनको एक बेटी और एक बेटा है। पांच साल पहले गुरुमूर्ति और वेंकटमाधवी जिल्लेलागुडा के न्यू वेंकटेश्वर नगर कॉलोनी में चले आये। सेवानिवृत्त सेना अधिकारी गुरुमूर्ति वर्तमान में डीआरडीओ में आउटसोर्सिंग सुरक्षा गार्ड के रूप में काम कर रहा है।
संबंधित खबर-
इस महीने की 13 तारीख को भोगी त्योहार के दिन गुरुमूर्ति अपनी पत्नी वेंकटमाधवी और अपने दो बच्चों के साथ अपनी बहन के घर गए। वे उस रात वहीं थे। अगले दिन संक्रांति के दिन पति-पत्नी ने बच्चों को वहीं छोड़कर अपने घर जिल्लेलागुडा आ गये। घर पहुंचने के बाद पति-पत्नी के बीच फिर बहस शुरू हो गई। इसी बीच त्योहार के दिन अपनी बेटी वेंटकमाधवी को बार-बार फोन करने के बावजूद उत्तर नहीं मिला।
इसके चलते सुब्बम्मा और वेंकटरमण मीरपेट के जिल्लेलागुडा में अपनी बेटी के घर गये। ससुराल वालों ने अपने दामाद गुरुमूर्ति से पूछा कि उनकी बेटी कहां है। उन्होंने बताया कि हमारे बीच सुबह करीब आठ बजे झगड़ा हुआ था और वह 16 तारीख को दोपहर करीब 12 बजे घर से चली गई। इसके बाद माता-पिता ने तुरंत मीरपेट थाने में शिकायत दर्ज कराई कि उनकी बेटी लापता है। इस महीने की 18 तारीख को मीरपेट पुलिस ने गुमशुदगी का मामला दर्ज किया।
मिली शिकायत के आधार पर मीरपेट पुलिस ने सबसे पहले उस घर में लगे तीन सीसीटीवी कैमरों की जांच की, जहां गुरुमूर्ति रहता है। हालांकि, गुरुमूर्ति के कहे अनुसार 14 तारीख को केवल पति-पत्नी के बाहर से घर में प्रवेश करने के सीसीटीवी में दृश्य दर्ज है, लेकिन 16 तारीख को झगड़े के बाद दोपहर 12 बजे माधवी के घर से बाहर चले जाने का कोई दृश्य नहीं है। इसके अलावा माधवी की हत्या का कोई सबूत नहीं मिलने से पुलिस की जांच आगे नहीं बढ़ रही है।
गुरुमूर्ति किराए के जी प्लस 2 बिल्डिंग में सभी हिस्से मकानों को पहले से ही ताले लगे हुए हैं। गुरुमूर्ति वाले पोर्सन को भी को भी ताला पाया गया, जबकि बगल की रसोई की खिड़की खुली हुई पाई गई। गैस चूल्हे पर भीगे हुए चावल का एक कटोरा रखा हुआ था। इसके पास ही 100 पेपर्स कंपनी की शराब की पी गई फुल बोतल मिली है। पोर्सन के बाहर कपड़े धोने वाले स्थान पर कपड़े बिखरे पड़े पाये गये।
गुरुमूर्ति जी-प्लस 2 बिल्डिंग की दूसरी मंजिल के ईस्ट-वेस्ट वाले पोर्सन में रह रहा है। उस घर में चार सीसीसीटीवी कैमरे हैं। भूतल पर दो एकल शयन कक्ष हैं। फर्स्ठ फ्लोअर पर मकान मालिक राजेंद्र प्रसाद अपनी पत्नी, बेटे और बेटी के साथ रहते हैं। भूतल पर भी दो एकल शयन कक्ष भी हैं। मकान मालिक का परिवार घटना से कई दिन पहले बेंगलुरु गया था। हालांकि, गुरुमूर्ति के साथ दूसरे तल पर रहने वाले एक अन्य परिवार हत्या की घटना के चलते गुरुवार को ही किराये का मकान खाली करके चले गये। वास्तव में क्या हुआ? वास्तव में क्या हुआ अभी बताने वाला वहां कोई नहीं है।
हालांकि, मीरपेट पुलिस ने पहले ही उस गली में लगे छह सीसीटीवी कैमरे, अगली गली में लगे लॉर्ड्स स्कूल का एक सीसीटीवी कैमरा और तालाब में लगे सीसीटीवी कैमरे की फुटेज की हार्ड डिस्क जब्त कर ली है। गुरुमूर्ति ने पत्नी वेंकटमाधवी की हत्या करने के बाद चाकू से शव के टुकड़े किए और उसे कुकर में उबाला। उसके बाद हड्डियों को मूसल से चूरा किया। पाउडर को भी रसायनों के साथ मिलाया, उबले हुए टुकड़ों को बाल्टी में डाल दिया और कचरे को फेके जैसा घर से 1.7 किलोमीटर दूर तालाब में फेंक दिया।
సంచలనం సృష్టించిన వెంకట మాధవి హత్య కేసులో పెద్దగా పురోగతి లేదు
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన భార్య వెంకట మాధవి హత్య కేసులో పెద్దగా పురోగతి కనిపించడం లేదు. అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యను ఇంట్లో ఎవరూ లేని సమయంలో భర్తే అతికిరాతకంగా హత్య చేశాడు. మద్యం సేవిస్తూ మరీ భర్త ఆమె డెడ్ బాడీని కత్తి, రంపంతో ముక్కలుగా నరికి కుక్కర్ లో ఉడక బెట్టాడు. ఉడక బెట్టిన ముక్కలతో పాటు బొక్కలను చూర చేసి బకెట్లో తీసుకెళ్లి చందన చెరువులో పడేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసిన విషయం విధితమే.
హత్య జరిగి దాదాపు 10 రోజులు అవుతున్నా మృతదేహం తాలుకా ఎలాంటి ఆనవాళ్ళు కనిపించకపోవడంతో హత్య కేసు దర్యాప్తు ముందుకు సాగడం లేదు. ఇప్పటికే పోలీసులు ఘటనా స్థలంలోని సి.సి కెమెరాలను పరిశీలించగా ఈ నెల14వ తేదీన భార్య భర్తలు ఇద్దరే బయటి నుంచి ఇంట్లోకి వెళ్లినట్లు మాత్రమే దృశ్యాలు కనిపించాయే తప్పా భర్త చెబుతున్న దాని ప్రకారం ఇంట్లో నుంచి భార్య బయటకు వెళ్లిన దృశ్యాలు కనిపించనే లేదు. దీంతో పోలీసులు గురుమూర్తి పై అనుమానాలు బలమయ్యాయి.
దీంతో గురుమూర్తిని మీర్పేట్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. అయితే గురుమూర్తి పోలీసులు విచారణలో ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా పొంతన లేని సమాధానాలు చెబుతుండడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. అయితే హత్యకు ఉపయోగించిన కత్తితో పాటు రంపంను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే మాధవి మృతదేహం కు సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు కూడా చెరువులో లభించకపోవడంతో చాలా తెలివితో గురుమూర్తి హత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా పోలీసులు హత్యకు సంబంధించిన క్రైమ్ సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. గురుమూర్తి ఒక్కరే ఈ హత్యకు పాల్పడ్డాడా? అతనికి ఇంకా ఎవరైనా సహకరించారా? అన్నది పోలీసుల విచారణలో ఇంకా తేలాల్సి ఉంది.
ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తికి 13 ఏళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన ఉప్పల సుబ్బమ్మ, వెంకటరమణ దంపతుల పెద్ద కూతురు వెంకట మాధవి(35)తో వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు, కుమారుడు సంతానం. ఐదేళ్ల క్రితం గురుమూర్తి, వెంకట మాధవి దంపతులు జిల్లెల్లగూడ లోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీకి వలస వచ్చారు. రిటైర్డ్ ఆర్మీ అయిన గురుమూర్తి ప్రస్తుతం డి ఆర్ డి ఓ లో ఔట్ సోర్సింగ్ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు.
ఈ నెల 13వ తేదీన భోగి పండుగ రోజు గురుమూర్తి భార్య వెంకట మాధవితో పాటు తన ఇద్దరు పిల్లలతో కలిసి తన చెల్లెలు ఇంటికి వెళ్లాడు. ఆరోజు రాత్రి అక్కడే ఉన్నారు. మరునాడు సంక్రాంతి పండుగ రోజున పిల్లలను అక్కడే వదిలేసి భార్య భర్తలు ఇద్దరే జిల్లెలగూడలోని ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న తర్వాత భార్య భర్తల మధ్య మరో మారు వివాదం తలెత్తింది. అయితే పండుగ పూట తన కూతురు మాధవికి ఎన్ని ఫోన్లు చేసిన లిఫ్ట్ చేయకపోవడంతో తల్లి సుబ్బమ్మ, వెంకటరమణ దంపతులు మీర్పేట్ లోని జిల్లెలగూడలోని అల్లుడింటికి చేరుకున్నారు.
తమ కూతురు ఎక్కడికి వెళ్లిందని అల్లుడు గురుమూర్తిని అత్తింటి వారు నిలదీశారు. దీంతో అతడు మా ఇద్దరి మధ్య ఉదయం 8 గంటల ప్రాంతంలో గొడవ జరిగిందని, ఈ నెల 16వ తేదీన మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని చెప్పాడు. వెంటనే ఆమె తల్లిదండ్రులు కూతురు కనిపించడం లేదని మీర్ పేట్ పోలీసులకు 16వ తేదీన ఫిర్యాదు చేశారు. ఈ నెల 18వ తేదీన మీర్పేట్ పోలీసులు మిస్సింగ్ కేసులు నమోదు చేశారు.
సుబ్బమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మీర్పేట్ పోలీసులు ముందుగా గురుమూర్తి నివసించే ఇంటికి ఉన్న మూడు సి.సి కెమెరాలను పరిశీలించారు. అయితే గురుమూర్తి చెబుతున్న దాని ప్రకారం 14వ తేదీన బయటి నుంచి భార్య భర్తలు ఇంట్లోకి వెళ్ళే దృశ్యాలు మాత్రమే కనిపించాయి తప్ప 16 వతేదీన గొడవ పడి మాధవి మధ్యాహ్నం 12 గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చినట్టు చెబుతున్న దృశ్యాలు మాత్రం కనిపించలేదు. దీంతో మీర్పేట్ పోలీసులకు గురుమూర్తి మీద అనుమానం బలమయ్యింది. అంతేగాకుండా మాధవిని హత్య చేసిన ఎలాంటి ఆనవాళ్లు కనిపించకపోవడంతో పోలీసులు దర్యాప్తు ముందుకు సాగడం లేదని తెలుస్తోంది
గురుమూర్తి అద్దెకు ఉంటున్న జి ప్లస్ 2 భవనంలో ఇప్పటికే అన్ని పోర్షన్లకు తాళాలు ఉన్నాయి. గురుమూర్తి ఉన్న పోర్షన్ కి కూడా తాళాలు ఉండగా, పక్కనే ఉన్న కిచెన్ కిటికీ ఓపెన్‌గా కనిపించింది. గ్యాస్ పొయ్యి మీద నాన పెట్టిన బియ్యం గిన్నె కనిపించింది. పక్కనే 100 పేపర్స్ కంపెనీకి చెందిన సగం తాగిన మద్యం ఫుల్ బాటిల్ కనిపించింది. పోర్షన్ బయట క్లాత్ వాషింగ్ ఏరియాలో ఇడిసిన బట్టలు చిందరవందరగా పడి ఉండడం కనిపించింది.
గురుమూర్తి అద్దెకు ఉంటున్న జి ప్లస్ 2 భవనంలోని రెండవ ఫ్లోర్‌లోని ఈస్ట్ ఫేస్ డోర్లో ఉన్న పోర్షన్లో అద్దెకు ఉంటున్నాడు. ఆ ఇంటికి నాలుగు సి. సి కెమెరాలు ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో రెండు సింగిల్ బెడ్ రూమ్ పోర్షన్ లు ఉండగా, ఫస్ట్ ఫ్లోర్లో ఇంటి యజమాని రాజేంద్ర ప్రసాద్ తో పాటు అతని భార్య, కుమారుడు, కుమార్తె నివసిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో కూడా రెండు సింగిల్ బెడ్ రూమ్ పోర్షన్లు ఉన్నాయి. ఘటనకు చాలా రోజుల ముందే ఇంటి యజమాని కుటుంబం బెంగూళూరుకు వెళ్లినట్లు సమాచారం. అయితే రెండవ ఫ్లోర్లో గురుమూర్తితో పాటు పక్క పోర్షన్లో ఉండే మరో ఫ్యామిలీ పక్క పోర్షన్లో జరిగిన హత్య ఉదంతానికి భయపడి గురువారం అద్దె ఇల్లును ఖాళీ చేశారు. అసలు ఏం జరిగిందో? చెప్పడానికి ప్రస్తుతం ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడం గమనార్హం. అయితే ఆ వీధిలో ఆరు సి.సి కెమెరాలు, పక్క వీధిలో లార్డ్స్ పాఠశాల కు సంబంధించిన సి.సి కెమెరా, చందన చెరువు వద్ద ఒక సి.సి కెమెరా ఫుటేజీ హార్డ్ డిస్క్‌ను మీర్పేట్ పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు.
గురుమూర్తి మాధవిని హత్య చేసిన అనంతరం కత్తితో డెడ్‌బాడీని ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడక బెట్టాడు. అనంతరం బొక్కలను కూడా రోకలితో చూర చేసినట్లు సమాచారం. ఆ పొడిని కూడా కెమికల్ లో కలిపి, ఉడకబెట్టిన ముక్కలను బకెట్లో వేసి చెత్త పడవేసినట్లుగా ఇంటి నుంచి 1.7 కిలీమీటర్ల దూరంలో ఉన్న చందన చెరువులో పడవేశాడు. (ఏజెన్సీలు)
