Many Many Congratulations! तेलंगाना के नये बादशाह होंगे रेवंत रेड्डी, एलबी स्टेडियम में शपथ ग्रहण समारोह

[नोट- 6 जुलाई 2021 को तेलंगाना समाचार में रेवंत रेड्डी के अध्यक्ष बनने के बाद विशेष संपादकीय प्रकाशित हुआ था। पाठकों की जानकारी के लिए उसका लिंक यहां फिर से दे रहे हैं। आप भी कांग्रेस की नई सरकार पर अपने विचार लिखकर भेज सकते हैं।]

हैदराबाद: तेलंगाना में कांग्रेस पिछले दो दिनों से मुख्यमंत्री को लेकर चला आ रहा बड़ा सस्पेंस खत्म हो चुका है। आखिरकार आलाकमान ने तेलंगाना के नये मुख्यमंत्री के नाम की घोषणा कर दी है। आलाकमान ने आधिकारिक रूप से नये मुख्यमंत्री टीपीसीसी अध्यक्ष रेवंत रेड्डी के नाम पर मुहर लगा दी है।

गौरतलब है कि विधानसभा चुनाव नतीजों में कांग्रेस पार्टी को पूर्ण बहुमत मिला है। सरकार बनाने के लिए कांग्रेस को 60 सीटों की जरूरत थी, वहीं कांग्रेस 64 सीटों पर विजयी हुई हैं। साथ ही बीआरएस को 39, बीजेपी को 8, एआईएमआईएम को 7 और सीपीआई को 1 सीट मिली हैं।

हालांकि, कांग्रेस पार्टी में मुख्यमंत्री पद को लेकर मची होड़ के चलते नेतृत्व ने दो दिन तक सभी से लंबी चर्चा की और रेवंत रेड्डी के नाम को फाइनल किया। वहीं रेवंत रेड्डी 7 दिसंबर को सीएम पद की शपथ लेंगे। गुरुवार 7 दिसंबर को अच्छा मुहूर्त होने के चलते पार्टी ने उसी दिन को फाइनल किया है। इस महीने की 7 तारीख को दोपहर 1.04 बजे स्टेडियम में शपथ ग्रहण समारोह होगा। क्या रेवंत के साथ पूरा मंत्रिमंडल (17 सदस्य) सीएम पद के साथ शपथ लेते है या नहीं इस पर स्पष्टता आनी बाकी है।

मुख्यमंत्री की घोषणा के बाद रेवंत रेड्डी का पहला ट्वीट

तेलंगाना के मुख्यमंत्री चुने जाने के बाद रेवंत रेड्डी ने पहली बार ट्विटर पर प्रतिक्रिया दी है। उन्होंने सीएम के रूप में चुने जाने के लिए एआईसीसी अध्यक्ष मल्लिकार्जुन खड़गे, सोनिया गांधी, राहुल गांधी, प्रियंका गांधी, केसी वेणुगोपाल, डीके शिवकुमार, माणिक राव ठाकरे को धन्यवाद दिया। हाल ही में हुए तेलंगाना विधानसभा चुनाव में जनता ने कांग्रेस पार्टी को पूर्ण बहुमत दिया। जादुई आंकड़े पार कर चुकी हैं। लंबी चर्चा के बाद कांग्रेस आलाकमान ने रेवंत रेड्डी को सीएलपी नेता घोषित किया। रेवंत रेड्डी इस महीने की 7 तारीख को मुख्यमंत्री पद की शपथ लेंगे।

एलबी स्टेडियम में धन्यवाद सभा

तेलंगाना में कांग्रेस की सरकार बनने के साथ ही पार्टी की प्रदेश इकाई ने नौ दिसंबर को सोनिया गांधी के जन्मदिन के प्रतीक स्वरूप बड़े पैमाने पर धन्यवाद सभा आयोजित करने की योजना बनाई है। सबसे पहले, रेवंत रेड्डी ने सोचा कि शपथ ग्रहण समारोह और धन्यवाद सभा एक ही दिन आयोजित किया जाना चाहिए। लेकिन राज्य के राजनीतिक हालात को देखते हुए 7 तारीख को शपथ ग्रहण समारोह पर निर्णय लिया गया. कांग्रेस पार्टी को लोगों के समर्थन और उसे सत्ता में लाने के लिए धन्यवाद देने के लिए इस महीने की 9 तारीख को एलबी स्टेडियम में धन्यवाद सभा आयोजित करने के लिए प्रारंभिक कार्यक्रम को अंतिम रूप दे दिया गया है। दिल्ली दौरे के दौरान हुई चर्चा के मुताबिक रेवंत रेड्डी इस पर स्पष्ट बयान देने की संभावना है।

रेवंत रेड्डी की प्रोफ़ाइल

रेवंत रेड्डी का जन्म 8 नवंबर 1969 को हुआ। रेवंत का जन्म नागरकर्नूल जिले के कोंडारेड्डीपल्ली गांव में हुआ। 2006 में मिडज़िल मंडल ZPTC के सदस्य बने। 2007 में स्वतंत्र रूप से स्थानीय निकायों के एमएलसी के रूप में चुने गए। 2009 के विधानसभा चुनाव में कोडंगल ने तेलुगु देशम से विधायक के रूप में जीत हासिल की। रेवंत रेड्डी 2014 में दूसरी बार विधायक बने। 2014-17 तक कार्यकारी अध्यक्ष रहे। अक्टूबर 2017 में टीडीपी से इस्तीफा दे दिया। 2017 में कांग्रेस पार्टी में शामिल हुए। 2018 में टीपीसीसी के कार्यकारी अध्यक्ष बने। दिसंबर 2018 में कोडंगल से विधानसभा चुनाव लड़ा और हार गए। मई 2019 में हुए लोकसभा चुनाव में कांग्रेस की ओर से मलकाजीगिरी की संसदीय चुनाव में जीत गये। 26 जून, 2021 को रेवंत रेड्डी को पीसीसी अध्यक्ष नियुक्त किया गया।7 जुलाई, 2021 को टीपीसीपी अध्यक्ष के रूप में शपथ ग्रहण

Chief Minister of Telangana తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి

హైదరాబాద్: నరాలు తెగే ఉత్కంఠకు కాంగ్రెస్ తెరదించింది. ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డినే ఫైనల్ చేస్తూ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. కాగా, తెలంగాణకు రేవంత్ రెడ్డి రెండో ముఖ్యమంత్రిగా నియామకం అయ్యారు. ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజార్టీ లభించింది. ప్రభుత్వ ఏర్పాటుకు 60 సీట్లు కావాల్సి ఉండగా కాంగ్రెస్‌కు ప్రజలు 64 సీట్లు కట్టబెట్టారు. బీఆర్ఎస్‌కు 39 సీట్లు, బీజేపీకి 8, ఎమ్ఐఎమ్‌కు 7, సీపీఐకి 1 స్థానాల్లో అవకాశం ఇచ్చారు.

అయితే, ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ ఉండటంతో అధిష్టానం అందరితో రెండ్రోజుల పాటు సుదీర్ఘ మంతనాలు జరిపి రేవంత్ రెడ్డిని ఫైనల్ చేసింది. మరోవైపు రేవంత్ రెడ్డి సీఎంగా.. డిసెంబర్ 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 7వ తేదీన గురువారం మంచి ముహూర్తం ఉండటంతో పార్టీ ఆ రోజునే ఫైనల్ చేసింది. మరోవైపు రేవంత్ రెడ్డితో పాటు ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేస్తారనేది ఆసక్తిగా మారింది.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో డిసెంబరు 9వ తేదీన సోనియాగాంధీ జన్మదినం కావడంతో దానికి సింబాలిక్‌గా ఆ రోజున భారీ స్థాయిలో కృతజ్ఞతా సభను ఏర్పాటు చేసేలా పార్టీ స్టేట్ యూనిట్ ప్లాన్ చేస్తున్నది. తొలుత ఆ రోజునే ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని నిర్వహించాలని రేవంత్‌ రెడ్డి భావించారు. కానీ రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 7వ తేదీ జరిగే షెడ్యూలులో మార్పులు జరిగాయి. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు పలికి అధికారంలోకి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతగా ఈ నెల 9న ఎల్బీ స్టేడియంలో కృతజ్ఞతా సభను నిర్వహించేలా ప్రాథమిక షెడ్యూలు ఖరారైంది. ఢిల్లీ టూర్‌లో జరిగే చర్చల మేరకు దీనిపై రేవంత్‌రెడ్డి స్పష్టమైన ప్రకటన చేయనున్నారు.

కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడిగా రేవంత్‌రెడ్డిని ఎంపిక చేస్తూ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నది. ఎమ్మెల్యేలందరి అభిప్రాయాలను, పార్టీ పరిశీలకుల నివేదికను పరిగణనలోకి తీసుకున్న ఏఐసీసీ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేసింది. అన్ని స్థాయిల్లోని పార్టీ శ్రేణుల నుంచి వచ్చిన అభిప్రాయాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలిపారు. సీఎల్పీ నేతగా ఎన్నిక కావడంతో ముఖ్యమంత్రిగా కూడా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. రాజ్‌భవన్‌లో గురువారం (డిసెంబరు 7న) ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క తదితరులందరితో చర్చించిన తర్వాత సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ అభిప్రాయాల మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లాంఛనంగా నిర్ణయం తీసుకున్నట్లు కేసీ వేణుగోపాల్ తెలిపారు.

సీఎల్పీ నేతగా రేవంత్‌రెడ్డి పేరును హైకమాండ్ ప్రకటించడంతో రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ఖరారైనా డిప్యూటీ సీఎంల విషయంలో ఇంకా పార్టీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. నిర్ణయం తీసుకున్న తర్వాత వెల్లడిస్తామని పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలిపారు. డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్కతో పాటు సీతక్క తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. కానీ దీనిపై ఇంకా పార్టీ నుంచి స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉన్నది. ఈ నెల 7వ తేదీన ఉదయం 10.28 గంటలకు రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉన్నది. సీఎంగా రేవంత్‌తో పాటు మొత్తం (17 మంది) మంత్రివర్గం కూడా ప్రమాణ స్వీకారం చేస్తుందా అనేదానిపై స్పష్టత రావాల్సి ఉన్నది.

సీఎంగా రేవంత్‌ ఎంపిక ఖరారైనప్పటికీ మంత్రివర్గంలో ఎవరెవరుంటారనేది ఆసక్తికరంగా మారింది. జిల్లాలు, సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఏఐసీసీ నిర్ణయించనున్నది. ప్రతీ జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించాలని పార్టీ రాష్ట్ర యూనిట్ భావిస్తున్నందున ఇప్పటికే కొన్ని పేర్లు గాంధీభవన్‌లో చర్చల్లో నలుగుతున్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సహా సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలతో చర్చించిన తర్వాత క్యాబినెట్ కూర్పు, పోర్టుఫోలియోలపై స్పష్టత రానున్నది. సీఎంతో పాటు మరో 17 మంత్రులకు అవకాశం ఉన్నందున ఒకరిద్దరు ఎమ్మెల్సీ కోటా నుంచి ఉండొచ్చని సమాచారం.

ఏఐసీసీ జనరల్ సెక్రటరీ నుంచి ప్రకటన వెలువడే సమయానికి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హోటల్‌లో ఎమ్మెల్యేలతో చర్చిస్తూ ఉన్న రేవంత్‌రెడ్డి వెంటనే ఇంటికి బయలుదేరి అక్కడి నుంచి బేగంపేట చేరుకుని స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీ వెళ్ళారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ తదితరులతో బుధవారం ఢిల్లీలో భేటీ కానున్నారు. రాజ్‌భవన్‌లో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా వ్యక్తిగతంగా వారిని, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆహ్వానించనున్నారు. మరోవైపు మంత్రివర్గ కూర్పు గురించి కూడా ఢిల్లీలో సీనియర్ నేతలతో చర్చించనున్నారు. పరిపాలనకు సంబంధించిన అంశాలపై కూడా వారితో రేవంత్ చర్చించనున్నారు.

సీఎల్పీ నేతగా ఎన్నుకోడానికి సోమవారం ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించిన పార్టీ పరిశీలకులు డీకే శివకుమార్, దీపాదాస్ మున్షీ, కే.మురళీధరన్, కేజే జార్జి, అజయ్ కుమార్ అక్కడ జరిగిన ఏకవాక్య తీర్మానంతో పాటు కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల అభిప్రాయాలతో ఏఐసీసీకి నివేదిక సమర్పించారు. సీఎల్పీ నేతగా ఎన్నికైన ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఆ పోస్టు కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క సైతం ప్రయత్నిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో వారిద్దరూ ఢిల్లీకి వెళ్ళి సీనియర్ నేతలతో సంప్రదింపులు జరిపారు. డీకే శివకుమార్‌తో పాటు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తదితరులతో వారి అభిప్రాయాలను పంచుకున్నారు.

పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలతో పాటు ఎన్నికల ప్రచారం సమయంలోనే వివిధ స్థాయిల్లోని పార్టీ శ్రేణుల నుంచి వివరాలను సేకరించిన అధిష్టానం చివరకు సీఎల్పీ నేతగా, ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డివైపే మొగ్గు చూపింది. సీనియర్ల మధ్య ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా అందరితో చర్చించి, వారి అసంతృప్తిని కన్విన్స్ చేసి పార్టీ నిర్ణయం తీసుకున్నది. పరిపాలన ‘వన్ మాన్ షో’లాగా ఉండదని, టీమ్ వర్క్‌ తో సాగుతుందని కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పోస్టు కోసం పార్టీ నేతల మధ్య పోటీ ఉన్నప్పటికీ అందరితో మాట్లాడి లోతుగా చర్చించి చివరకు పార్టీ ప్రయోజనాలు, ప్రజలకు పరిపాలనా అవసరాల మేరకు రేవంత్‌రెడ్డినే సీఎల్పీ నేతగా, ముఖ్యమంత్రిగా ఖరారు చేసింది.

సీఎల్పీ నేతగా రేవంత్‌రెడ్డిని ఎంపిక చేసినట్లు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో ప్రకటన చేయడంతోనే హైదరాబాద్ హోటల్‌లో ఉన్న ఆయనకు తెలంగాణ పోలీసు శాఖ సెక్యూరిటీ పెంచింది. బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు నాలుగు ఎస్కార్ట్ వాహనాలను ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ సిద్ధం చేసింది. రేర్ గార్డ్స్, ఫ్రంట్ గార్డ్స్ తో పాటు డాగ్ స్క్వాడ్, అంబులెన్స్, జామర్ తదితర వాహనాలన్నీ కాన్వాయ్‌లో ఉండేలా ప్లానింగ్ ఖరారు చేసింది. ప్రస్తుతం ఉన్న సెక్యూరిటీ స్థానంలో 8 ప్లస్ 2 (సాయుధ) పద్ధతిలో మూడు షిప్టుల్లో 24 గంటల భద్రత కొనసాగేలా (మొత్తం 30 మంది) ఇంటెలిజెన్స్ వింగ్ సిద్ధం చేస్తున్నది.

సిటీ పోలీసు కమిషనర్‌తో పాటు వివిధ విభాగాల పోలీసు అధికారులకు ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రికి కల్పించిన భద్రతను వెంటనే అమల్లోకి తెచ్చేలా ఆయన స్పష్టం చేశారు. రేవంత్ నివాసానికి కూడా మూడంచెల పటిష్ట భద్రత ఏర్పాటైంది. ఎవరి వాహనం వచ్చినా పోలీసులు క్షుణ్ణంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యమంత్రికి జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించడం ఆనవాయితీ కావడంతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కూడా అలర్టయ్యారు. తక్షణం నివాసానికి డీఎస్పీ ఆధ్వర్యంలో భద్రత ఏర్పాటైనందున కుటుంబ సభ్యులతో సంప్రదించడానికి కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా సిద్ధమవుతున్నది.

ఢిల్లీలోనూ స్పెషల్ సెక్యూరిటీ ఏర్పాట్లు :

ప్రస్తుతం లోక్‌సభ సభ్యుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి ఢిల్లీలో పార్లమెంటు సెక్రటేరియట్ సమకూర్చిన ఎంఎస్ ఫ్లాట్స్ లోని యమునా బ్లాక్‌లోని ఆయన నివాసానికి అదనపు భద్రత ఏర్పాటైంది. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఢిల్లీలో ఉండే భవన్‌లో సీఎం హోదాలో మకాం ఉండేవారికి కేటాయించే శబరి బ్లాక్ దగ్గర కూడా హై సెక్యూరిటీ ఏర్పాటైంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే ఢిల్లీలో విమానాశ్రయంలో దిగింది మొదలు తిరిగి హైదరాబాద్ చేరుకునేంత వరకు సీఎంకు కల్పించే భద్రతే కొనసాగనున్నది. ఇప్పటికే ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులకు హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ జీఏడీ విభాగం నుంచి ఆదేశాలు వెళ్ళాయి.

శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న రేవంత్ రెడ్డికి తెలుగుదేశం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన ఆయనపై తెలంగాణ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆకాంక్షలను నేరవేర్చాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని కోరారు. పరిపాలనలో ప్రత్యేకమైన ముద్ర వేసి తెలంగాణ ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకోవాలని కోరారు.

తెలంగాణ రాష్ట్ర కంట్రీబ్యూటరీ పెన్షన్స్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పవన్ కుమార్, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్ గౌడ్ తదితరులు కూడా రేవంత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా హర్షం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆరు గ్యారంటీల అమలులో సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు ప్రభుత్వానికి సహకారం అందిస్తామని అభివృద్ధిలో భాగస్వాములవుతామని పేర్కొన్నారు. రెండు దశాబ్దాలుగా నలుగుతున్న సీపీయస్ ఉద్యోగుల డిమాండ్ మేరకు పాత పెన్షన్ ఆకాంక్షను నెరవేరుస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ శుభాకాంక్షలు

తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎంపికైన టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ శుభాకాంక్షలు తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా జర్నలిస్టులకు రక్షణ కల్పించి, దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని, రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులపై ఉన్న అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరింది. గడచిన తొమ్మిదిన్నరేళ్ళుగా జర్నలిస్టులకు అవమానాలు, ఛీత్కారాలే మిగిలాయని, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పని చేస్తున్న మీడియాకు కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలని కోరింది. ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు తదితర అంశాలపై దృష్టి పెట్టాలని కోరింది.

రేవంత్ రెడ్డిగారి ప్రొఫైల్

1969 నవంబరు 8న పుట్టిన రేవంత్ రెడ్డి

నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామంలో పుట్టిన రేవంత్

2006లో మిడ్జిల్ మండలం జడ్పీటీసి సభ్యుడుగా విజయం

2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా స్వాతంత్య్రంగా ఎన్నిక

2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం నుండి కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపు

2014లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్

2014–17 మధ్య వర్కింగ్ ప్రెసిడెంట్

2017 అక్టోబరులో టిడిపికి రాజీనామా

2017లో కాంగ్రెస్‌ పార్టీలో చేరిక

2018లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి ఓటమి

2019 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం

2021లో జూన్ 26న పీసీసీ అధ్యక్ష్యుడిగా రేవంత్

2021 జూలై 7న టీపీసీపీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X