తెలంగాణ సిటిజన్ కౌన్సిల్: జాతీయ ప్లాస్టిక్ ఫ్రీ దినోత్సవం సందర్భంగా ర్యాలీ, అవగానే శిబిరం మరియు విరికి ఘనంగా సన్మానం

హైదరాబాద్: పర్యావరణానికి హాని కలిగిస్తున్న ప్లాస్టిక్ కవర్, బ్యాగులను సంపూర్ణంగా నిషేధించారని, ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించడానికి విద్యార్థులు యువకులు నడుం బిగించాలని ప్రముఖ పర్యావరణ వేత్త ప్రొఫెసర్ కే. పురుషోత్తం రెడ్డి అన్నారు. తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో గురువారం గోలిపురాలోని జ్ఞాన భారతి మోడల్ హై స్కూల్లో జాతీయ ప్లాస్టిక్ ఫ్రీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన అవగాహన శిబిరం ర్యాలీలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ప్లాస్టిక్ సంచుల బదులు కాగితం, జ్యూట్ బ్యాగులు వంటి వస్తువులను వినియోగించాలని ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి ప్రచారం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. జీవ వైవిధ్యానికి ఆరోగ్యపరంగా ఆర్థికంగా ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి విద్యార్థులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ గోశాల ఫెడరేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మహేష్ అగర్వాల్ ప్రసంగిస్తూ ప్రతి ఏడాది సుమారు 400 కోట్ల ప్లాస్టిక్ కవర్లను వినియోగించడం వాటిలో అధిక శాతం ఒకేసారి ఉపయోగించే ప్లాస్టిక్ కవర్లు ఉండటంతో నగరంలో పర్యావరణానికి పెనుముప్పుగా మారుతుంది అన్నారు. ప్లాస్టిక్ పదార్థాలు స్టైరీను, బెంజినలాంటి విష పూరిత రసాయనాల వల్ల క్యాన్సర్ ముప్పును పెంచి నాడీ వ్యవస్థ, శ్వాసకోశ, ప్రత్యుత్పత్తి సమస్యలు, కిడ్నీ, కాలేయం రుగ్మతలకు దారితీస్తుందని ఆవేదన వ్యక్తం వేశారు.

ఈ అవగాహన శిబిరంలో ప్రముఖ విద్యావేత్త శ్రీ వి ప్రభాకర్ రావు ప్రసంగిస్తూ పాతబస్తీల్లో ప్లాస్టిక్ పట్ల అవగాహన శిబిరాల ద్వారా ఇక్కడ ప్రజలను విద్యార్థులను చైతన్యవంతం చేయాలని స్వచ్ఛంద సంస్థలకు సూచన ఇచ్చారు.

తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్ అధ్యక్షత ఉపన్యాసం చేస్తూ గత 30 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణ కాలుష్య నియంత్రణపై ర్యాలీల ద్వారా సెమినార్ల ద్వారా వివిధ కళాశాలలో పాఠశాలలో శిబిరాలు నిర్వహించి పర్యావరణ పరిరక్షించే దానికి ఎన్నో అవగాహన శిబిరాల ద్యారా ప్రజలను చైతన్యవంతం చేస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో పాతబస్తీ తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ అధ్యక్షులు S రామకృష్ణ శాస్త్రి, సంఘ సేవకులు, శ్రీ అన్న రావు కులకర్ణి, శ్రీ .కె శ్యామ్ రావు, స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి రమాదేవి, అధ్యాపకురాలు శ్రీమతి వి. లక్ష్మీ నాగ కుమారి తదితరులు పాల్గొని ప్రసంగించారు.

అంతకుముందు ప్లాస్టిక్ వల్ల వచ్చే అనర్ధాలపై శ్రీ మహేష్ అగర్వాల్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ అవగాహన ర్యాలీలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సంఘ సేవకులు ప్ల కార్డ్స్ చేతబట్టి ప్లాస్టిక్ వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజలను చైతన్యవంతం చేశారు. శ్రీ మహేష్ అగర్వాల్ జన్మదిన సందర్భంగా కేకులు కట్ చేయకుండా ప్లాస్టిక్ వాడకం పై ప్రజలను చేతనవంతం చేస్తున్నారని వివరించారు.

ఈ సందర్భంగా గత 50 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణకై ర్యాలీలు సెమినార్ల ద్వారా రాష్ట్రంలోనే కాకుండా జాతీయస్థాయిలో నిర్విరామంగా కృషి చేస్తున్న ప్రొఫెసర్ కే పురుషోత్తం రెడ్డిని మరియు గత 15 సంవత్సరాలుగా నిరంతరం వివిధ జిల్లాలలో గ్రామీణ ప్రాంతాలలో ప్లాస్టిక్ వాడకాన్ని ప్లాస్టిక్ వచ్చి వల్ల వచ్చే అనర్ధాలపై ఎన్నో వేల అవగాహన కార్యక్రమాలు చేసి ప్రజలును చేతవంతం చేస్తున్న తెలంగాణ గోశాల ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు శ్రీ మహేష్ అగర్వాల్ ను శాలువా మెమెంటో పూలమాలతో ఘనంగా సన్మానించి అభినందించారు.

तेलंगाना नागरिक परिषद: राष्ट्रीय प्लास्टिक मुक्त दिवस रैली, जागरूकता शिविर और इन सेवियों का सम्मान

हैदराबाद: प्रमुख पर्यावरणविद् प्रोफेसर के पुरूषोत्तम रेड्डी ने कहा कि पर्यावरण के लिए हानिकारक प्लास्टिक कवर और बैग पर पूरी तरह से प्रतिबंध लगाया जाना चाहिए और छात्रों और युवाओं को प्लास्टिक मुक्त समाज बनाने के लिए अपनी कमर कसनी चाहिए। उन्होंने गुरुवार को तेलंगाना सिटीजन काउंसिल स्टेट डिपार्टमेंट के तत्वावधान में ज्ञान भारती मॉडल हाई स्कूल, गोलीपुरा में राष्ट्रीय प्लास्टिक मुक्त दिवस के उपलक्ष्य में आयोजित जागरूकता शिविर रैली में मुख्य अतिथि के रूप में यह बात कही।

उन्होंने कहा कि यह हम सभी की जिम्मेदारी है कि प्लास्टिक के उपयोग को कम करने के लिए प्लास्टिक बैग के स्थान पर कागज और जूट के थैलों के उपयोग को बढ़ावा दें। छात्रों से प्लास्टिक के उपयोग को कम करने के लिए आगे आने का आह्वान किया गया है जो जैव विविधता के लिए स्वास्थ्य और आर्थिक खतरा बन गया है।

तेलंगाना गौशाला महासंघ के राज्य मानद अध्यक्ष महेश अग्रवाल ने अपने भाषण में कहा कि हर साल लगभग 400 करोड़ प्लास्टिक कवर का उपयोग किया जाता है क्योंकि उनमें से अधिकांश एकल उपयोग वाले प्लास्टिक कवर होते हैं और यह शहर में पर्यावरण के लिए एक बड़ा खतरा बन जाता है। उन्होंने चिंता व्यक्त की कि प्लास्टिक सामग्री स्टाइरी और बेंजीन जैसे जहरीले रसायनों के कारण कैंसर का खतरा बढ़ाती है और तंत्रिका तंत्र, श्वसन, प्रजनन समस्याओं, गुर्दे और यकृत विकारों को जन्म देती है।

इस जागरूकता शिविर में प्रख्यात शिक्षाविद् श्री वी. प्रभाकर राव ने भाषण दिया और स्वयंसेवी संगठनों को पुराने शहरों में प्लास्टिक जागरूकता शिविरों के माध्यम से लोगों और छात्रों को जागरूक करने की सलाह दी।

तेलंगाना नागरिक परिषद के प्रदेश अध्यक्ष डॉ. राज नारायण मुदीराज ने कहा कि हम पिछले 30 वर्षों से पर्यावरण संरक्षण पर सेमिनार और रैलियों के माध्यम से विभिन्न कॉलेजों और स्कूलों में शिविर आयोजित करके लोगों को पर्यावरण संरक्षण के लिए जागरूक कर रहे हैं और प्रदूषण नियंत्रित करने में भूमिका निभा रहे है।

पुराने शहर के तेलंगाना नागरिक परिषद के अध्यक्ष एस रामकृष्ण शास्त्री, संघ सेवाकुलु, श्री अन्ना राव कुलकर्णी, श्री के श्याम राव, स्कूल प्रिंसिपल श्रीमती रमादेवी, शिक्षक श्रीमती वी। लक्ष्मी नागा कुमारी और अन्य ने भाग लिया और संबोधित किया।

इससे पहले श्री महेश अग्रवाल ने प्लास्टिक से होने वाली बुराईयों के खिलाफ हरी झंडी दिखाकर रैली की शुरूआत की। इस जागरूकता रैली में छात्र, शिक्षक और कार्यकर्ता हाथों में तख्तियां लेकर प्लास्टिक के खिलाफ नारे लगाये। श्री महेश अग्रवाल के जन्मदिन के अवसर पर केक काटने के बजाय लोगों को प्लास्टिक के उपयोग के प्रति जागरूकता कार्यक्रम चलाते है।

इस अवसर पर प्रोफेसर के पुरुषोत्तम रेड्डी, जो पिछले 50 वर्षों से न केवल राज्य बल्कि राष्ट्रीय स्तर पर और पिछले 15 वर्षों से रैलियों, सेमिनारों के माध्यम से पर्यावरण संरक्षण के लिए अथक प्रयास कर रहे हैं। तेलंगाना गौशाला फेडरेशन के मानद अध्यक्ष, तेलंगाना गौशाला फेडरेशन के मानद अध्यक्ष, जिन्होंने विभिन्न जिलों में ग्रामीण क्षेत्रों में प्लास्टिक के उपयोग के खतरों पर हजारों जागरूकता कार्यक्रम आयोजित करने वाले श्री महेश अग्रवाल को शॉल स्मृति चिन्ह फूल माला से सम्मानित किया गया।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X