MLC कविता की जमानत याचिका पर आज सुप्रीम कोर्ट में सुनवाई, बड़ी संख्या में दिल्ली पहुंचे BRS के नेता

हैदराबाद: दिल्ली शराब नीति घोटाले में गिरफ्तार एमएलसी कविता फिलहाल तिहाड़ जेल में बंद है। सुप्रीम कोर्ट आज उनकी जमानत याचिका पर सुनवाई करेगा। उनकी ओर से जाने-माने वकील मुकुल रोहतगी दलीलें सुनाएंगे। बीआरएस नेतृत्व को भरोसा है कि इस बार कविता को जमानत मिल जाएगी।

इसी को लेकर बीआरएस नेता दिल्ली गये हैं। केटीआर, हरीश राव, गंगुला कमलाकर और वड्डीराजू रविचंद्र के साथ सोमवार शाम दिल्ली पहुंच गये हैं। कुछ नेता सोमवार को ही दिल्ली गए है। वहीं खबर है कि कुछ महिला नेता, वरिष्ठ और विधायक मंगलवार को दिल्ली पहुंचे है। जब कविता जमानत पर रिहा होगी तो तब वे सभी उनका स्वागत करेंगे। एमएलसी कविता शराब मामले में 15 मार्च से तिहाड़ जेल में हैं। 22 अगस्त को वह बीमार हो गईं थी। उनका इलाज दिल्ली एम्स में किया गया।

संबंधित खबर-

సుప్రీం కోర్టులో నేడు కవిత బెయిల్‌పై విచారణ

హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో అరెస్టు అయిన ఎమ్మెల్సీ క‌విత‌ ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్నారు. ఆమె బెయిల్ పిటిష‌న్‌పై నేడు సుప్రీం కోర్టులో విచార‌ణ జ‌ర‌గ‌నుంది. ఆమె త‌ర‌ఫున ప్రముఖ న్యాయ‌వాది ముకుల్ రోహ‌త్గీ వాద‌న‌లు వినిపించ‌నున్నారు. ఈసారి కవితకు బెయిల్ తప్పకుండా వస్తుందనే న‌మ్మకం బీఆర్ఎస్ నాయ‌క‌త్వంలో ఉన్నది.

దీంతో బీఆర్ఎస్ నేతలంతా ఢిల్లీ బాట పడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రమే కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు గంగుల కమలాకర్, వద్దిరాజు రవిచంద్ర ఢిల్లీ వెళ్లినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కొంత మంది సోమవారం వెళ్లగా, ఇంకొంత మంది మహిళా నేతలు, సీనియర్లు, ఎమ్మెల్యేలు మంగళవారం వెల్లనున్నట్టు సమాచారం. బెయిల్‌పై కవిత విడుదల కాగానే ఆమెకు స్వాగతం పలికేందుకు వీరంతా వెళ్లినట్లు తెలిసింది.

పార్టీ కార్యకర్తకు, నాయకుడికి ఎవరికి ఏ ఆపద వచ్చినా పార్టీ అండగా ఉంటుందని చాటేందుకే సీనియర్ నేతలంతా ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. కవితలో మనోధైర్యం కల్పించడం, తామంతా అండగా ఉన్నామని చాటేందుకే అందరూ అక్కడికి వెళ్లినట్టు తెలుస్తున్నది. ఇప్పటికే ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం దూకుడుతో బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన మొదలైంది. అక్రమాలను వెలికితీసే పనిలో ప్రభుత్వం నిమగ్నం కావడంతో ఏ నాయకుడు ఎప్పుడు చేజారుతారోనని గులాబీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతుంది. ఎవరూ పార్టీని వీడకుండా కాపాడుకోవడంతో పాటు ఐక్యంగా ఉన్నామని చాటి చెప్పేందుకు ఢిల్లీ ప్రోగ్రామ్‌ను ఎంచుకున్నట్టు తెలుస్తున్నది.

మద్యం కేసులో ఎమ్మెల్సీ క‌విత మార్చి 15వ తేదీ నుంచి తిహార్ జైలులో ఉంటున్నారు. ఆగస్టు 22న ఆమె అస్వస్థతకు గురయ్యారు. ఆమెకు ఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్యం చేయించారు. అయినా పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటి వరకు కవితను పరామర్శించలేదు. కేవలం కేటీఆర్, హరీశ్‌రావును మాత్రమే పంపించి జరిగిన విషయాలు తెలుసుకుంటున్నారు. కోర్టులో వాదనలు, బెయిల్ పిటిషన్లు, జరుగుతున్న పరిణామాలను తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారు. అయితే నేడు కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ ఉండటం, ఇదే కేసులో మనిష్ సిసోడియాకు బెయిల్ రావడంతో కవితకు సైతం వస్తుందనే ఆశతో గులాబీ నేతలు ఎదురుచూస్తున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X