MLC Kavitha Challenges MP Arvind To Prove His Accusations Against Her Or To Be Ready To Eat The Humble Pie

Former MP and BRS Party Leader MLC K. Kavitha demands MP Arvind Dharmapuri to show Centre’s share in all the schemes and projects of BRS Government while responding to his claims of Union Government’s aid to Telangana Government

MLC Kavitha says Congress leader Rahul Gandhi’s words are mere scripts shared by local leadership

We the BRS Party represent People’s Front, neither NDA nor I.N.D.I.A alliance : MLC Kalvakuntla Kavitha

There was a time when Revanth Reddy passed inappropriate comments on Former CM Late. YSR and Sonia Gandhi, today the same Revanth Reddy is chaired as the PCC Chief : Former MP Kalvakuntla Kavitha

While Congress and BJP focus on ‘ Election Policy’, the BRS Party envisions and accomplishes ‘ People’s Policy’ : MLC K. Kavitha

MLC Kavitha inaugurates Nizamabad IT HUB Job Mela

Hyderabad: MLC Kavitha inaugurated the Nizamabad IT HUB Job Mela, ahead of the inauguration of Nizamabad IT HUB on July 29 by Minister KTR. MLC Kavitha during the launch interacted with several job aspirants and wished them luck. During her visit to the Nizamabad IT HUB, MLC Kavitha also interacted with the media.

During her interaction, Former MP from Nizamabad lashed out heavily on Nizamabad MP Arvind Dharmapuri and demanded him to prove his accusations against her to be ready to Eat the humble pie as she will ensure that truth triumphs. She further, asked amidst massive rains in the region MP Arvind Dharmapuri has been missing, and that it’s not for the first time that he has been unavailable for the people of Nizamabad.

Responding to MP Arvind Dharmapuri’s recent remarks on Centre’s financial contribution and support to flagship schemes of KCR Government like Kaleshwaram Project, Rythu Bandhu Scheme, Aasara Pensions, KCR kits and many more, the daughter of Telangana CM asked MP Dharmapuri to prove his claims. She added, MP Arvind Dharmapuri has done nothing for Nizamabad except for weak and baseless statements.

MLC Kavitha reiterated that there’s no competition for the BRS Party and the party is all set to sweep Nizamabad yet again. While responding to BRS Party’s support to either of the two existing alliances, MLC said that BRS Party represents People’s Front, neither NDA nor I.N.D.I.A alliance. She accused both Congress and BJP of focusing only on ‘Election Policy’ while CM KCR Led BRS Party envisions and accomplishes ‘ People’s Policy’.

While responding to questions on the Congress Party in Telangana, Former MP from Nizamabad, K. Kavitha said that Congress Leader Rahul Gandhi’s words and speeches are mere scripts written by local leaders. She once again, said that the ‘Anti-Farmer’ agenda of the Congress Party is exposed after evident and vocal remarks of PCC Chief Revanth Reddy on capping and limiting free electricity supply to the farmers of Telangana.

She reminded the Congress Party that today the person who chairs the Telangana PCC is the same person who repeatedly made inappropriate comments against former CM Late YSR and former Congress President and MP Sonia Gandhi. She added, how can Revanth Reddy be seen and treated as Satyawadi Harishchandra with this history by the Congress Party?

MLC Kavitha inaugurated the Nizamabad IT HUB Job Mela today in Nizamabad. The Nizamabad IT HUB is all set to be inaugurated by MLA KTR, Minister of Minister of ITE&C, Municipal Administration and Urban Development; and Industries and Commerce on July 29.

అరవింద్…. 24 గంటల సమయం ఇస్తున్న… నాపై చేసిన ఆరోపణలను రుజువు చెయ్

లేదంటే పులాంగ్ చౌరస్తాలో ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి

బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ కు కల్వకుంట్ల కవిత సవాల్

తప్పుడు ఆరోపణలతో తమాషాలు చేస్తే బాగుండదని హెచ్చరిక

సోనియా గాంధీని దయ్యం అన్న నాయకుడే ఇప్పుడు దేవత అంటున్నాడు

వైఎస్సార్ ను పావురాల గుట్టలో పావురం లా మాయమయ్యాడని విమర్శించిన రేవంత్… ఇప్పుడు వైయస్ మా నేత అని అంటున్నాడు

ధరణిని రద్దుచేసి దళారీలను ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ భావిస్తుంది

మా విధానం ధరణి… కాంగ్రెస్ విధానం దళారి

మేము ఎన్డీఏ కాదు ఇండియా కూటమి కాదు… మేము ప్రజల వైపు

నిజామాబాద్ : తనపై ఆరోపణలు చేస్తున్న బిజెపి ఎంపీ అరవింద్ కు 24 గంటల పాటు సమయం ఇస్తున్నానని, ఆ లోగా ఆరోపణలలో రుజువు చెయ్యకపోతే పులాంగు చౌరస్తాలో ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని అరవిందుకు కల్వకుంట్ల కవిత సవాల్ విసిరారు. అర్థం పడటం లేని ఆరోపణలు చేస్తే బాగుండదని హెచ్చరించారు. శుక్రవారం నాడు నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన కవిత స్థానికంగా విలేకరులతో ఇస్తా గోష్ఠి గా మాట్లాడారు.

ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా పనిచేస్తోందని, అందుకే ఎన్నో కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నామని తెలిపారు. గతంలో పాలించిన పార్టీలు కమిషన్లకు కక్కుర్తి పడేదని, బీఆర్ఎస్ పార్టీలో ఆ పరిస్థితి లేదని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో రింగ్ రోడ్డును పూర్తి చేయలేకపోయారని అన్నారు. తనతో పాటు తమ పార్టీ ఎమ్మెల్యేలు వెంటబడి పరిష్కస్తే నిర్మాణం పూర్తయిందన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డబ్బులు ఎవరు, ఏ కుటుంబం తిన్నదో ప్రజలకు తెలియదా అని ప్రశ్నించారు. “అరవింద్ కు 24 గంటల సమయం ఇస్తున్న.

నాకు ఎవరు ఒక రూపాయి ఇచ్చారో రుజువు చేయాలి. కాయిదం పట్టుకురా… లేకపోతే పులాంగ్ చౌరస్తాలో ముక్కునేలకు రాసి క్షమాపణలు చెప్పాలి. ” అని సవాల్ విసిరారు. తన తండ్రిని అంటే విదిలేశామని, ఇప్పుడు తన భర్తను కూడా విమర్శిస్తున్నారని, ఎవరూ ఊరుకోరని, మజాక్ చేస్తే బాగుండదని హెచ్చరించారు. రాజకీయాల్లో లేని తన భర్త పేరును ఎందుకు తీస్తున్నారని అర్వింద్ ను నిలదీశారు. చౌకాబారు రాజకీయాలు మానుకోవాలని సూచించారు. అరవింద్ ఎక్కడ పోటీ చేసినా అక్కడికి వెళ్లి ఆయనను ఓడించి తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తానని తేల్చిచెప్పారు.

మణిపూర్ అల్లర్లపై, నిరుద్యోగంపై బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడడం లేదని అడిగారు. రైతు బంధు పథకానికి కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, ఎస్ఆర్ఎస్పీ పునరుద్ధరణ ప్రాజెక్టులో బీజేపీది ఒక్క రూపాయి కాంట్రిబ్యూషన్ లేదని చెప్పారు. జాతీయ రహదారులపై గుంతలు ఉంటాయా ఎక్కడైనా ? ఏం చేస్తున్నాడు గడ్డిపీకుతున్నాడా ? అని అర్వింద్ ను ఉద్ధేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో అన్ని విషయాలపై నిలదీస్తామని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి అర్వింద్ ఏం తెచ్చారని నిలదీశారు. అబద్ధాల మీద సమాజం నడవదని సూచించారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అక్కడికి వెళ్లి తప్పుడు హామీలు ఇచ్చి ఓట్లు దండుకోవడమే బీజేపీ ఎజెండా అని ఆరోపించారు.

రైతులు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నేతలు అక్కసు వెల్లగక్కుతున్నారని, రైతులకు మూడు గంటల విద్యుత్ చాలని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ వ్యాపారవేత్తలకు కూడా మూడు గంటలే సరిపోతుందని చెప్పగలదా అని ప్రశ్నించారు. పైసలు ఉన్న వారి పక్షాన మాత్రమే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు నిలబడుతాయని, బీఆర్ఎస్ ఎప్పడూ పేదల పక్షాన నిలబడుతుందని స్పష్టం చేశారు. “కాంగ్రెస్ నేతలు ఏం మాట్లాతున్నారో వాళ్లకే అర్థంకాదు. మూడు గంటలు విద్యుత్ చాలని అంటరు. 25 గంటల కరెంట్ ఇస్తామని అంటారు.

అప్పుడే సోనియా గాంధీ దయ్యమంటరు… పావురాల గుట్టలో పావురం లా మాయమయిపోండని విమర్శించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు వైయస్ ఉచిత కరెంట్ ఇచ్చిండని అంటారు. అర్థంపర్థంలేనటువంటి మాటలు మాట్లాడుతారు.”అని కాంగ్రెస్ నేతలను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో రైతుల పట్ల కాంగ్రెస్ వైఖరి ప్రజలకు అర్థమయిందని చెప్పారు. రైతులకు కాంగ్రెస్ సాయం చేయదన్న ఆలోచన ప్రజల్లో వచ్చిందన్నారు. ధరణిని రద్దు చేసి దళారులను ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుందని ఆరోపించారు. ధరణి వల్ల భూవివాదాలు సమసిపోయాయని, చిన్నచిన్న సాంకేతిక సమస్యలు ఉంటే ప్రభుత్వం సరిదిద్దుతోందని చెప్పారు. ధరణి మా విధానం… దళారి కాంగ్రెస్ విధానం అని విమర్శించారు.

బీఆర్ఎస్, బీజేపీకి డీఎన్ఏ మ్యాచ్ కాదని చెప్పారు. ఎన్డీఏ, ఇండియా కూటములకు సమాన దూరంలో ఉంటామని స్పష్టం చేశారు. తమకు కాంగ్రెస్ తోనే పోటీ అని, కానీ ఆ పోటీ కూడా బీఆర్ఎస్ కు కాంగ్రెస్ దూర స్థానంలో ఉంటుందని స్పష్టం చేశారు. గతం కంటే భారీ మెజారిటీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలవబోతున్నారని అనేక సర్వేలు తేల్చాయని వెల్లడించారు.

నిజామాబాద్ ఐటీ హబ్…

యువత ఉజ్వల భవిష్యత్తుకు బాట రెండో దశ ఐటీ హబ్ ను కూడా అభివృద్ధి చేస్తాం.

జాబ్ మేళాలో పాల్గొన్న కల్వకుంట్ల కవిత.

నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఐటీ హబ్ స్థానిక యువత ఉజ్వల భవిష్యత్తుకు బాట వేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.

జిల్లా లో ఐటి హబ్ ఏర్పాటు గొప్ప విషయని, విదేశీ కంపెనీలు రావటానికి సహకరించిన ఎమ్మెల్యే మహేష్ బిగాల కు ధన్యవాదలు తెలిపారు. ఒకపుడు ఐటి ఉద్యోగాలు అంటే కేవలం బెంగళూర్ ,హైదరాబాద్ వంటి నగరాలకే పరిమితం అయ్యేవని, గ్రామీణ స్థాయిలో ఐటి విద్య అభ్యసించినవారి కోసం ఐటిఉద్యోగాలు అందించే లక్షం తో ఈ ఐటి హబ్ ఏర్పాటు చేశామని తెలిపారు. కేవలం ఐటి ఉద్యోగాలు మాత్రమే కాదు చిన్న పరిశ్రమలు స్వంతగా ఏర్పాటు చేయుటకు ఐటి హబ్ ఉపయోగ పడుతుందని చెప్పారు.

ఐటి హబ్ లో ఒక చైర్ కు నెలకు రూ. 3500 చెల్లించి అవకాశాలు కల్పిస్తున్నామని, 50 వేల చదరపు అడుగులు, రూ. 40 కోట్ల పెట్టుబడితో ఐటి హబ్ ఏర్పాటు చేశామని తెలియజేశారు.ఐటి హబ్ అంటే కేవలం ఉద్యోగమే కాదు ఉద్యోగాలు సృష్టించేందుకు దోహద పడుతుందని, యువత తమ స్కిల్స్ తో ఐటి హబ్ స్పేస్ ను వాడు కావాలని పిలుపునిచ్చారు.

ఫస్ట్ ఇంటర్వ్యూ లో జాబ్ రాకుంటే నిరుత్సాహ పడొద్దనీ సూచించారు. 745 సీట్లు ఉన్నాయి.. రెండవ సారి ప్రయత్నం చేయాలని, 745 సీట్ల తో పాటు టాస్క్ అధ్వర్యంలో లో 1000 మంది కి ఐటి లో ఇతర రంగాల్లో శిక్షణ అందిస్తామని,మొత్తం నిజామాబాద్ లో సాఫ్టు వేర్ అభివృద్ధి కి ఐటి హబ్ ఇక కేంద్ర బిందువు అవుతదని వివరించారు.

ఇది మొదటి దశ .త్వరలో రెండవ దశ ఐటి హబ్ కూడా ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఇండస్ట్రియల్ పార్క్ ,ఆటో పార్క్ అభివృద్ధి కి కృషి చేస్తున్నామన్నారు. యువత రాజకీయ ల సంగతి కంటే ముందు ఉద్యోగాల పై దృష్టి పెట్టాలని సూచన చేశారు. నిజామాబాద్ ఐటి హబ్ నంబర్ వన్ గా నిలుస్తుందని కవిత ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేష్ గుప్తా జెడ్పీ ఛైర్మెన్ విఠల్ రావు.బి అర్ ఎస్ ఎన్నారై సెల్ గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేష్ గుప్తా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X