Hyderabad: ఎమ్మెల్సీ కవిత పేరు ఢిల్లీ లిక్కర్ స్కామ్ రిమాండ్ రిపోర్టులో రావడం తో గురువారం మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ “తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయి. అందుకే మోడీ కంటే ఈడీ ముందుగా వచ్చింది. నా మీద, మా ఎమ్మెల్యేలపై, మంత్రులపై కేసులు పెడుతున్నారు. ఇది రాజకీయ ఎత్తుగడలో భాగంగానే జరుగుతుంది. బిజెపి చీఫ్ ట్రిక్స్ ప్లే చేస్తుంది. కేసులు పెట్టుకోండి. అరెస్టులు చేసుకోండి. జైల్లో పెట్టుకోండి.” కవిత పేర్కొన్నారు.
మోదీ ప్రభుత్వం 8 ఏళ్లలో 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలని బీజేపీ పడగొట్టింది. మోదీకి విజ్ఞప్తి చేస్తున్నా ఈ పంథా మార్చుకోవాలన్నారు. ఈడీ , సీబీఐ ను ఎదుర్కొంటాం. జైలుకు వెళ్ళడానికి కూడా సిద్ధం, అని కవిత అన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ రిమాండ్ రిపోర్టులో కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ చేర్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఈ కేసులో కవిత పాత్ర ఉందంటూ మీడియా లీకులకే పరిమితం అయ్యాయి. కానీ మొదటిసారి అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును చేర్చింది.
