हैदराबाद: केंद्रीय चुनाव आयोग ने दोनों तेलुगु राज्यों में एमएलसी चुनावों का कार्यक्रम जारी किया है। आंध्र प्रदेश और तेलंगाना में कुल छह सीटों के लिए चुनाव होंगे। अधिसूचना 3 फरवरी को जारी होगी, नामांकन पत्रों की जांच 11 फरवरी को होगी, नाम वापस लेने की अंतिम तिथि 13 फरवरी है, मतदान 27 फरवरी को होगा और मतगणना 3 मार्च को होगी।
आंध्र प्रदेश में तीन एमएलसी सीटों के लिए चुनाव होंगे। तेलंगाना में तीन एमएलसी सीटों के लिए भी चुनाव होंगे। संयुक्त गोदावरी और कृष्णा-गुंटूर स्नातक निर्वाचन क्षेत्रों के लिए चुनाव होंगे। श्रीकाकुलम, विजयनगरम और विशाखापत्तनम शिक्षक एमएलसी चुनाव होंगे।
तेलंगाना में तीन एमएलसी सीटों के लिए मतदान होगा। मेदक-निजामाबाद-आदिलाबाद-करीमनगर शिक्षक निर्वाचन क्षेत्र के लिए चुनाव होंगे। केंद्रीय चुनाव आयोग ने मेदक-निजामाबाद-आदिलाबाद-करीमनगर स्नातक निर्वाचन क्षेत्र और वरंगल-खम्मम-नलगोंडा शिक्षक निर्वाचन क्षेत्र के लिए पूरा कार्यक्रम जारी कर दिया है।
एमएलसी चुनाव पर बीआरएस खामोश
एमएलसी चुनाव को लेकर बीआरएस पार्टी में अनिश्चितता बनी हुई है। पार्टी हलकों में चर्चा है कि बीआरएस चुनावों से दूर रहेगी, क्योंकि चुनावों का बिगुल बज चुका है, लेकिन पार्टी में अभी तक कोई हलचल नहीं है। हालांकि, कई उम्मीदवार तेलंगाना भवन के चक्कर काट रहे हैं, लेकिन पार्टी अभी भी चुप है। केटीआर का कहना है कि केसीआर चुनाव का काम संभाल लेंगे, लेकिन वह इस बात पर स्पष्टता नहीं दे रहे हैं कि वह चुनाव लड़ेंगे या नहीं। है। फिर भी इस बात पर बहस चल रही है कि बीआरएस से कौन नेता चुनाव लड़ेगा।
यह भी पढ़ें-
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఏపీ, తెలంగాణలో మొత్తం ఆరు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా, ఫిబ్రవరి 11 నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 13 ఉపసంహరణ గడువు, ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించి మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణలో కూడా మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది.
తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికల జరగనుంది. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం, వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గం,ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి షెడ్యూల్ విడుదల చేసింది.
ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్‌ఎస్ మౌనం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీపై సందిగ్ధత నెలకొంది. ఎన్నికలకు నగారా మోగినా ఇప్పటివరకూ పార్టీలో ఎలాంటి చప్పుడు లేకపోవడంతో ఎన్నికలకు బీఆర్‌ఎస్ దూరంగా ఉంటుందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇప్పటికే పలువురు ఆశావహులు తెలంగాణ భవన్ చుట్టూ తిరుగుతున్నా పార్టీ అధిష్టానం ఇప్పటికీ మౌనం వహిస్తున్నది. ఎన్నికల అంశాన్ని కేసీఆర్ చూసుకుంటారని కేటీఆర్ చెబుతున్నా ఎన్నికల్లో పోటీ చేసేది లేనిది క్లారిటీ ఇవ్వడం లేదు. నిజామాబాద్ –కరీంనగర్–మెదక్–ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ స్థానంతో పాటు నిజమాబాద్–కరీంనగర్–మెదక్ టీచర్ ఎమ్మెల్సీ, నల్గొండ–ఖమ్మం–వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నగారా మోగిన సంగతి తెలిసిందే. అయితే, బీఆర్‌ఎస్ నుంచి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై చర్చ జరుగుతున్నది. (ఏజెన్సీలు)