हैदराबाद: तेलंगाना में सनसनी मचा देने वाले बीआरएस विधायक खरीद मामले में हाईकोर्ट ने अहम फैसला सुनाया है। सीबीआई को जांच की अनुमति देते हुए फैसला सुनाया है। इस बीच एसआईटी ने हाईकोर्ट के फैसले को चुनौती देते हुए सुप्रीम कोर्ट का दरवाजा खटखटाने का फैसला किया है। विधायक खरीद मामले में सीबीआई जांच की जरूरत नहीं होने की सुप्रीम कोर्ट में सिट पिटीशन दायर करने का फैसला किया है।
गौरतलब है कि हाईकोर्ट ने सोमवार को विधायकों की खरीद फरोख्त मामले में सुनवाई की। मालूम हो कि तेलंगाना सरकार इस मामले की जांच सीबीआई से कराने के सिंगल बेंच के फैसले के खिलाफ पहले ही हाईकोर्ट में रिट अपील याचिका दायर कर चुकी है। खबर है कि हाईकोर्ट के फैसले प्रति सीबीआई को मिली है। इसके चलते किसी भी समय सीबीआई एफआईआर दर्ज कर सकती है।
హైదరాబాద్ : తెలంగాణలో సంచలనం సృష్టించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వ్యవహారంలో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సీబీఐ విచారణకు అనుమతిస్తూ తీర్పు వెలువరించింది. కాగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సిట్ సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు నిర్ణయించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐ విచారణ అవసరం లేదని సుప్రీం కోర్టులో సిట్ పిటిషన్ వేయాలని నిర్ణయం తీసుకుంది.
అయితే ఎమ్మె్ల్యేల కొనుగోలు కేసులో సోమవారం ఉన్నత న్యాయస్థానం విచారించింది. ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయాలని ఇప్పటికే సింగిల్ బెంచ్ తీర్పు ఇవ్వగా తెలంగాణ ప్రభుత్వం ఈ తీర్పుపై హైకోర్టులో రిట్ అప్పీల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పు కాపీ సీబీఐకి అందినట్లు సమాచారం. దీని వల్ల సీబీఐ ఎప్పుడైనా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయవచ్చు.
ఈ కేసులో జనవరి 18న తీర్పును రిజర్వ్ చేసి ఇవాళ వెల్లడించారు. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని సింగిల్ బెంచ్ తీర్పు అమలు చేయాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉందని ఏజీ తెలిపారు.. అందుకే తీర్పును 15 రోజుల పాటు అమలు చేయకుండా చూడాలని సీజే ధర్మాసనాన్ని కోరారు కానీ హైకోర్టు నిరాకరించింది.
అయితే.. తెలంగాణ సర్కారు ఏర్పాటు చేసిన సిట్ విచారణను పారదర్శకంగా జరపట్లేదంటూ నంద కుమార్, అడ్వకేట్ శ్రీనివాస్‌తో పాటు మరో వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించాలని పిటిషన్‌లో కోరగా ఈ వ్యాజ్యంపై గతేడాది డిసెంబర్ 26న విచారణ చేసిన కోర్టు తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ఈ కేసుపై సీబీఐకి దర్యాప్తు బాధ్యతల్ని అప్పగిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యేలకు ఎర కేసు ముమ్మాటికీ తప్పేనని కానీ సీఎం కేసీఆర్‌కు సాక్ష్యాలు ఎవరు ఇచ్చారో చెప్పడంలో సిట్ విఫలమైందని అభిప్రాయపడింది.
ఈ కేసు దర్యాప్తు సమాచారం సీఎంకు చేరవేయడంపై ఉన్నత న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది. దర్యాప్తు సమాచారాన్ని మీడియాతో సహా ఎవరికీ చెప్పకూడదని దర్యాప్తు ప్రారంభ దశలోనే సిట్ దగ్గర ఉండాల్సిన కీలక ఆధారాలు ప్రజల్లోకి వెళ్లిపోయాయని వ్యాఖ్యానించింది. సిట్ చేసిన దర్యాప్తు సరిగా లేదని ఆధారాలు బయటకు రావడంతో విచారణ సక్రమంగా జరగలేదని వ్యాఖ్యానించింది. సిట్ విచారణ సరిగ్గా జరగనందుకే సీబీఐకి అప్పగిస్తున్నట్లు వివరించింది. (ఏజెన్సీలు)