బతుకమ్మ పాటకు ఇలా హుషారుగా స్టెప్పులేశారు ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఎమ్మెల్యే

హైదరాబాద్: తెలంగాణలో బతుకమ్మ పండుగ ఘనంగా జరుగుతున్నది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ ఆశ్వయుజ మాసంలో పెత్రమాసనాడు ఆరంభమై తొమ్మిదిరోజుల పాటు అంటే అష్టమి వరకు కొనసాగుతుంది.

తెలంగాణ వ్యాప్తంగా ఆడపడుచులంతా బతుకమ్మ సంబురాలను అంబరాన్నంటేలా జరుపుకుంటున్నారు. ప్రతి రోజు తీరొక్క పూలతో బతుకమ్మను అందంగా పేర్చి సాయంత్రం పూట అందరూ ఓ చోట గుమిగూడి బతుకమ్మ ఆడుతున్నారు. పండుగ జరిగినన్ని రోజులూ బతుకమ్మను ఆరాధించి, ఆపైన నిమజ్జనం చేస్తారు.

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కి చెందిన వైసీపీ ఎమ్మెల్యే, మాజీ ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీ వాణి బతుకమ్మ ఆడారు. హైదరాబాదులోని ఓ పార్కులో మహిళలతో కలిసి ఆమె చాలా సరదగా బతుకమ్మ ఆడారు. అమ్మాయిలు, మహిళలతో కలిసి హుషారుగా బతుకమ్మ పాటకు స్టెప్పులేశారు.

Related Article:

అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తెలంగాణ సంస్కృతిలో భాగమైన పుష్పశ్రీ వాణిని పలువురు అభినందిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు పరస్పరం గౌరవించుకొని ఇలా మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించుకోవాలని సూచిస్తున్నారు.

విజయనగరం జిల్లా కురుపాం ఎమ్మెల్యేగా పుష్పశ్రీ వాణి కొనసాగుతున్నారు. జగన్ కేబినెట్‌లో ఆమె గిరిజన సంక్షేమ శాఖతో పాటు డిప్యూటీ సీఎంగా పని చేశారు. మంత్రివర్గ విస్తరణలో ఆమె తన మంత్రి పదవిని కోల్పోయారు. ప్రస్తుతం ఆమె ఎమ్మెల్యేగా నియోజకవర్గానికే పరిమితమయ్యారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X