హైదరాబాద్: శనివారం రోజు దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌కు రాష్ట్ర పతి హాజరుకానున్న నేపథ్యంలో మంత్రి సత్యవతి రాథోడ్ గారు ఉదయం రాజ్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మినిస్ట్రీ ఇన్ వేటింగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మంత్రి సత్యవతి రాథోడ్ గారు పట్టు చీరను గిఫ్ట్ గా అందజేశారు. బహుమతిని అందుకున్న ద్రౌపది ముర్ము సంతోషాన్ని వ్యక్తం చేశారు.
దీనికంటే ముందు నగరంలోని దుండిగల్‌లో జరిగిన ఎయిర్ ఫోర్స్ అకాడమీ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో రాష్ట్రపతి ముర్ము పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారతీయ వైమానిక దళం అన్ని శాఖల్లోనూ మహిళా ఆఫీసర్లను రిక్రూట్ చేయడం సంతోషకరమన్నారు. మహిళా ఫైటర్ పైలెట్ల సంఖ్య భవిష్యత్తులో మరింత పెరగనున్నట్లు ఆమె వెల్లడించారు.
ఏప్రిల్‌లో తేజ్‌పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో సుఖోయ్ 30 ఎంకేఐ ఫైటర్ జెట్‌లో విహరించినట్లు ఆమె తెలిపారు. దాదాపు 30 నిమిషాల పాటు ఆ జెట్‌లో బ్రహ్మపుత్రి, తేజ్‌పూర్ లోయల్లో విహరించానని, హిమాలయాల అద్భుతాలను వీక్షించినట్లు ఆమె తెలిపారు. సముద్ర మట్టానికి రెండు కిలోమీటర్ల ఎత్తులో దాదాపు గంటకు 800 కిలోమీటర్ల వేగంతో ఎగరడం గొప్ప అనుభూతిని మిగిల్చినట్లు ముర్ము తెలిపారు. భవిష్యత్తు యుద్ధాలను దృష్టిలో పెట్టుకుని వైమానిక దళం ముందుకు సాగుతున్నట్లు ఆమె తెలిపారు.