బడుగులకు పెద్ద పీఠ వేస్తూ అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్న ప్రజా సంక్షేమ బడ్జెట్ : మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ : ప్రజా పాలన ప్రభుత్వం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా రంజక బడ్జెట్ అని మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. బడ్జెట్ లో సంక్షేమ పథకాలకు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత కల్పించారని పేర్కొన్నారు.

వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కు 2025-26 బడ్జెట్ కంటే అదనంగా దాదాపు వెయ్యి కోట్లు ప్రతిపాదించి ఈసారి 2026-27 బడ్జెట్ లో 12511 కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రభుత్వం రాగానే 48 గంటల్లో ఆర్టీసీ మహిళలకు వచ్చిన బస్సు ప్రయాణం ప్రారంభించామని మహిళలకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం బడ్జెట్ నిధులు కేటాయించిందన్నారు. 2026-27 లో మహా లక్ష్మీ పథకం కింద 4305 కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. పేదలు ,బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగేలా బడ్జెట్ లో కొత్త పథకాలు ప్రారంభించారని తెలిపారు.

Also Read-

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరి సంక్షేమం కొరకు సామాజిక అంతరాలతో సంబంధం లేకుండా పేద, మధ్యతరగతి, ధనిక అని తేడా చూడకుండా రాష్ట్రంలోని 1 కోటి 15 లక్షల కుటుంబాలకుప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల జీవిత బీమా అందించే విధంగా జూన్, 02, 2026 నుండి “ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం” ను ప్రారంభించబోతుంది. ఈ పథకానికి బడ్జెట్ లో రూ.4,000 కోట్లు ప్రతిపాదించారు.

చాలా సంవత్సరాలు ఎదురు చూస్తున్న వృద్ధులకు , వికలాంగులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. చేయూత పథకానికి అర్హులైన వారికి 2 లక్షల నూతన పెన్షన్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.ఈ పథకం మొత్తానికి బడ్జెట్ లో రూ.14,861 కోట్లు ప్రతిపాదించారు. కొత్త పెన్షన్లు ప్రకటించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధులకు వికలాంగులకు తదితరులు ఎంతో లబ్ధి చేకురుతుందని పొన్నం ప్రభాకర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఎంపిక చేసిన ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక మౌలిక సదుపాయాలు, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, డిజిటల్ సదుపాయాలు, ప్రత్యేక రవాణా వ్యవస్థలతో అన్ని వనరులతో కూడిన తెలగాణ పబ్లిక్ స్కూళ్ళు గా మార్పు చేయాలని బడ్జెట్లో ప్రతిపాదించారు. ఈ స్కూళ్ళలో ప్రీ ప్రైమరీ నుండి 12 వ తరగతి వరకు 1500 మంది విద్యార్థులకు విద్య అందించబడుతుందనీ ఈ పథకం మొత్తానికి బడ్జెట్ లో రూ.500 కోట్లు ప్రతిపాదించడం అభినందనీయమని జపాలన ప్రభుత్వం విద్య కు ప్రాధాన్యత కల్పిస్తుందని పేర్కొన్నారు.

Also Read-

2026–27 విద్యా సంవత్సరం నుంచి ప్రీ-ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన పోషకాలతో రాష్ట్రంలో నూతనంగా బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించబోతుందని. ఈ బ్రేక్‌ఫాస్ట్‌లో ప్ర‌తి విద్యార్థికి వారానికి మూడు రోజులు పాలు మరియు మిగతా మూడు రోజులు రాగి జావ అందించనున్నారు. ఈ పథకం మొత్తానికి బడ్జెట్ లో రూ.800 కోట్లు ప్రతిపాదించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ అభ్యసిస్తున్న విద్యార్థులకు కూడా ఇకపై నూతనంగా మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరిస్తున్నట్లు ప్రకటించడం అభినందనీయమన్నారు. ఈ పథకం మొత్తానికి బడ్జెట్ లో రూ.100 కోట్లు ప్రతిపాదించారూ. ఉద్యోగస్తులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులందరికీ దాదాపు 23 లక్షల 51 వేల మందికి నగదు రహిత ఆరోగ్య భద్రత పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.

ఈ నగదు రహిత ఆరోగ్య భద్రత పథకాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా అమలు చేస్తాం. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు 421 ఎంపానెల్ ప్రయివేట్ ఆసుపత్రులలో 1,998 వ్యాధులకు ఈ పథకం ద్వారా చికిత్సను పొందవచ్చు ప్రతి ఉద్యోగికి డిజిటల్ హెల్త్ కార్డు అందించనుంది.ఉద్యోగుల భద్రత కోసం దేశంలోనే తొలిసారిగా సమగ్ర ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు.. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రమాదవశాత్తు మరణిస్తే 1 కోటి 20 లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తిస్తుంది, 60 ఏండ్ల వరకు 10 లక్షల రూపాయాల టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, విమాన ప్రమాదంలో మరణిస్తే 2కోట్ల రూపాయలు అదనపుకవరేజి లభించే విధంగా ఈ పథకాన్ని రూపకల్పన చేశార ని ఈ పథకం 7 లక్షల 57 వేల ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు వర్తిస్తుంది. ఈ రెండు పథకాల మొత్తానికి బడ్జెట్ లో రూ.1,056 కోట్లు ప్రతిపాదించారు.

Also Read-

రాష్ట్ర యువతకు వివిధ రంగాలలో తగిన నైపుణ్య శిక్షణను మరియు వారికి ఉపాధి లభించిన ఆయా దేశాలకు సంబంధించిన భాషా జ్ఞానంలో శిక్షణ ఇప్పించడం, వారికివీసా మార్గదర్శకత మరియు విదేశీ ప్రయాణానికి కావలసిన రక్షణను ఇచ్చి విదేశాలలో ఆరోగ్య సేవలు, హస్పిటాలిటీ, నిర్మాణపు పనులు, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం “సి.ఎం.ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రాం”ను ప్రారంభిస్తున్నట్లూ ప్రభుత్వం ప్రకటించింది.

ఈ బడ్జెట్ లో సి.ఎం.ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రాం పథకానికి రూ.1,056 కోట్లు ప్రతిపాదించారు.బడ్జెట్ లో ఉద్యోగులకు ,బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడంపట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ,డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X