“తెలంగాణాలో రైతే రాజు”

కోటి 47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడితో రికార్డ్

సమైక్య రాష్ట్రంలో తెలంగాణ దిగుబడి 40 లక్షల మెట్రిక్ టన్నులే

తెలంగాణా ఏర్పడ్డాక ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండే 47 లక్షల దిగుబడి

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే వ్యవసాయానికి ఆదరణ

సాగర్ ఎడమ కాలువ నుండి వరుసగా 16వ పంటకు నీటి విడుదల

రాష్ట్రం ఏర్పడ్డాకే వ్యవసాయ రంగంలో అద్భుతమైన పురోగతి

భోనగిరి లో రైతుసేవా కేంద్రం భవనానికి మంత్రి జగదీష్ రెడ్డి శంకుస్థాపన హాజరైన జడ్ పి చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి, టేస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి,ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ పరమేష్ రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి తదితరులు.

దండగ అనుకున్న వ్యవసాయం తెలంగాణా లో పండగగా మారిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయం చేస్తున్న అంటే భయపడి సిగ్గుపడే రోజుల నుండి కాలర్ ఎగరేసీ మేము చేస్తున్నది వ్యవసాయం అని చెప్పుకుని మురిసె వాతావరణం నెలకొందన్నారు. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన విప్లవాత్మకమైన సంస్కరణలే దోహదపడ్డాయని ఆయన చెప్పుకొచ్చారు. భోనగిరి యాదాద్రి జిల్లా కేంద్రం భోనగిరి లో స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన 1000 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం గలిగిన గోడౌన్ నిర్మాణానికి సోమవారం ఉదయం మంత్రి జగదీష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక సహకార సంఘం అధ్యక్షుడు పరమెష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జడ్ పి చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి,టేస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి,ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ పరమేష్ రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి తదితరులు పాల్గొన్నారు.

అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాకే కోటి 47 లక్షల ధాన్యం దిగుబడి తో రికార్డ్ సృష్టించిందన్నారు.సమైక్యాంధ్రలో తెలంగాణా ప్రాంతం నుండి కేవలం 40 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడికే పరిమితము కాగా ఇప్పుడు కేవలం ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండే 47 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందాన్నారు.అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ మనసులో తెలియని వెలితి ఉందన్నారు.కష్టానికి,పెట్టుబడికి సరిపడా రైతు దిగుబడి సాదించలేకపోతున్న బాధ ముఖ్యమంత్రి కేసీఆర్ ను వెంటాడుతుందన్నారు.

ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపినప్పుడు మాత్రమే ఎకరాకు మూడు లక్షల వరకు ఆదాయం పొందవచ్చని ఆయన తెలిపారు. కూరగాయల మొదలు అనేక ప్రత్యామ్నాయ పంటలు ఉన్నప్పటికీ మూస పద్దతిలో వ్యవసాయానికి రైతు అలవాటు పడ్డారని ఆయన అన్నారు. తెలంగాణా ఏర్పడితే రైతును రాజును చెయ్యొచ్చు అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అయితే నెరవేరిందని అదే రైతు మరింత సుసంపన్నం కావాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ తపన అని ఆయన చెప్పుకొచ్చారు. సమైక్యాంధ్ర పాలనలో సాగర్ ఎడమ కాలువ కింద భూములకు వరుసగా మూడు మార్లు నీళ్లు విడుదల చెయ్యలేని దుస్థితి నుండి తెలంగాణా ఏర్పడ్డాక వరుసగా 16 వ మారు నీటిని విడుదల చేసుకున్నాం అంటే ముమ్మాటికి అది ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనత నే అని ఆయన కొనియాడారు.

రాష్ట్రం ఏర్పడ్డాకే వ్యవసాయ రంగంలో అద్భుతమైన ఫలితాలు సాధించామని మరింత పురోగతిని సాదించేందుకే ప్రపంచంలో ఎక్కడ లేని విదంగా రైతుబందు పధకం ద్వారా పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణా పేరు ప్రపంచ చిత్రపటంలో మారుమ్రోగుతుందన్నారు. అందుకే వలసల కు కేరాఫ్ గా నిలిచిన మహబూబ్ నగర్,నల్లగొండ, నిజామాబాద్,కరీంనగర్ జిల్లాలకు చెందిన రైతులు వాపస్ రావడమే కాకుండా దేశం నలుమూలల నుండి తెలంగాణా కు వలసల ప్రవాహం జోరందుకుందన్నారు.

మహాబుబ్నాగర్ జిల్లాలో వరి నాట్ల కోసం సరిహద్దు న కర్నాటక తో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ నుండి వస్తున్న వలసలే ఇందుకు నిదర్శనమన్నారు.ఆటోలు,ట్రాలీలు దాటిపోయి లారీలలో నాట్లు వేసేందుకు పొలాలు కోసేందుకు కూలీలు వలసలు వస్తున్నారు అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లో రైతు మకుటం లేని మహారాజు గా వెలుగొందుతున్నారన డానికి అద్దం పడుతుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X