రేషన్ డీలర్లతో చర్చలు సఫలం, తక్షణమే సమ్మే విరమించి రేషన్ పంపిణీ చేపట్టిన రేషన్ డీలర్లు

2కోట్ల 83లక్షల రేషన్ కార్డుదారుల ప్రయోజనం ప్రభుత్వానికి అత్యంత ముఖ్యం

పేదలు ఆకలితో ఉండకుండా ప్రభుత్వంతో సహకరించాలన్న మంత్రి గంగుల

ప్రజలతో పాటు రేషన్ డీలర్ల సంక్షేమం చూస్తామన్న మంత్రి

కమిషన్ పెంపు ప్రతిపాధన గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి

రేషన్ డీలర్లతో సచివాలయంలో చర్చలు నిర్వహించిన మంత్రి గంగుల కమలాకర్

హైదరాబాద్: తమ డిమాండ్ల సాధనకోసం సమ్మే చేస్తామన్న రేషన్ డీలర్లతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్ నేడు సచివాలయంలో బేటీ అయ్యారు, మంత్రి ఇచ్చిన హామీ మేరకు తక్షణమే సమ్మే విరమించి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ పంపిణీని తక్షణమే ప్రారంభిస్తున్నామని రేషన్ డీలర్ల జేఏసీ ఛైర్మన్ నాయికోటి రాజు ఇతర నేతలు మంత్రి సమక్షంలో ప్రకటించారు.

గతంలో ఇచ్చిన హామీ మేరకు రేషన్ డీలర్ల సంక్షేమం విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి, 2 కోట్ల 83 లక్షల పేదల ప్రయోజనాల పరిరక్షణ ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదన్న ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకోసం రేషన్ డీలర్లు సహకరించాలని సూచించారు.

ఇప్పటికే గత సమావేశంలో మేజర్ సమస్యలపై స్పష్టత నిచ్చామని వాటి పరిష్కారంలో ప్రభుత్వం అన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తుందన్నారు. కమిషన్ పెంపు ప్రతిపాదనను గౌరవ ముఖ్యమంత్రి ద్రుష్టికి తీసుకెళతానని మంత్రి గంగుల ఇచ్చిన స్పష్టమైన హామీపై రేషన్ డీలర్ల జేఏసీ సంతోషం వ్యక్తం చేసింది. తక్షణమే సమ్మే విరమించి రేషన్ పంపిణీని ప్రారంభిస్తున్నామని తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి. అనిల్ కుమార్, చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ బాలమాయాదేవి, జాయింట్ కమిషనర్ ఉషారాణి ఇతర ఉన్నతాధికారులు, రేషన్ డీలర్ల జేఏసీ ఛైర్మన్ నాయికోటి రాజు, కన్వినర్ రవీందర్, కో కన్వినర్ మల్లిఖార్జున్ గౌడ్, గౌరవాధ్యక్షులు అనంతయ్య, హైదరాబాద్ జిల్లా ప్రెసిడంట్ పుస్తె శ్రీకాంత్ ఇతర రేషన్ డీలర్ల ప్రతినిధులు పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X