“గ్రామ పంచాయతీల ముందు ప్రభుత్వ పథకాల వివరాలు, లబ్ధిదారుల సంఖ్య, గ్రామానికి వచ్చే నిధుల బోర్డులు పెట్టాలి”

బిజెపి తెచ్చిన చట్టం వల్లే స్థానిక సంస్థల అధికారాలు నిధులు తగ్గాయి

గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇచ్చే గ్రాంటుకు సమానంగా గ్రాంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

గ్రామ పంచాయతీలను బలోపేతం చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ

దేశంలో పంచాయతీలకు ఇచ్చిన 19 అవార్డుల్లో 18 తెలంగాణకే వచ్చాయి

రాష్ట్ర ప్రగతి జీర్ణించుకోలేక బిజెపి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తుంది

సర్పంచ్ లను బిజెపి తప్పుడు దారి పట్టిస్తోంది మన ప్రభుత్వం చేస్తున్న పథకాలపై అవగాహన కల్పించి సరైన దారిలో పెట్టాలి

ప్రతి రైతు ఆయిల్ ఫామింగ్ చేసే విధంగా ప్రోత్సహించాలి

వరంగల్ జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

వరంగల్ : దేశంలో ఎక్కడా లేనివిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ కు సమానమైన గ్రాంటును అదనంగా ఇస్తూ గ్రామపంచాయతీలను తెలంగాణ ప్రభుత్వం బలోపేతం చేస్తుంటే… కొత్త చట్టాలు తీసుకొచ్చి సర్పంచుల అధికారాలను, నిధులను కేంద్రం తగ్గించిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అన్నారు. తప్పుడు మాటలతో బిజెపి సర్పంచులను తప్పుదారి పట్టిస్తోందని, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల గురించి సర్పంచులకు సంపూర్ణ అవగాహన కల్పించి వారిని సరైన దారిలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మంత్రి అన్నారు. వరంగల్ జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశంలో నేడు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు పాల్గొని మాట్లాడారు.

మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారి మాటలు…

“పెద్ది సుదర్శన్ రెడ్డి నష్ట పరిహారం ఎక్కువ కావాలని అడుగుతున్నారు. కచ్చితంగా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. జిల్లా పరిషత్ మీటింగ్ లో చర్చకు వచ్చిన అంశాలు సీఎం కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. తప్పకుండా సీఎం, వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాను. 1800 కోట్ల రూపాయలు రోడ్ల కోసం సీఎం కేసీఆర్ గారు ఇచ్చారు. ఇందులో మెయింటెనెన్స్ కోసం 1000 కోట్ల రూపాయలు, దెబ్బ తిన్న రోడ్ల కోసం 800 కోట్ల రూపాయలు ఇచ్చారు. అయినా ఇవి సరిపోవు అంటే సీఎం గారు 500 కోట్లు అదనంగా ఇచ్చారు. వీటిలో ఎక్కువగా నష్టపోయిన నర్సంపేట, భూపాలపల్లి, ఇతర ప్రాంతాల్లో ఖర్చు చేస్తాం. రైతులకు ఎవరూ చేయనంత తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది.”

“ఈ ఏడాది వరంగల్ జిల్లాలోనే రైతు బంధు కింద 2,84,000 మందికి 266.20 కోట్లు ఒక్క వానాకాలంలో రైతు బంధు కింద ఇస్తున్నాం. గ్రామం వారీగా రైతు బంధు ఎంత వస్తుంది…? లబ్ది దారుల జాబితా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ ,ఎమ్మెల్యేలకు ఇవ్వాలి. గత 5 ఏళ్ళల్లో ఎంత ఇచ్చాం వివరాలు ఇవ్వాలి. రైతు బీమా 5 లక్షల రూపాయలు ఒక్క తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఇస్తుంది. ఎక్కడా కూడా ఈ పథకం లేదు. గ్రామాల్లో ఎంతమంది చనిపోయారు…ఎంత ఇచ్చామో చెప్పాలి. పక్క రాష్ట్రాల్లో పెన్షన్లు 500 మించి లేదు. మన రాష్ట్రంలోనే 2116 రూపాయిలు ఇస్తున్నాం. కళ్యాణ లక్ష్మి పథకం కింద 1,00116 రూపాయలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణ మాత్రమే. ప్రతి గ్రామ పంచాయతీ ముందు ప్రభుత్వ పథకాలు, లబ్ధిదారులు, నిధుల వివరాల బోర్డు పెట్టాలి. ఎంపిడిఓలు ఇది తయారు చేసి స్థానిక ప్రజాప్రతినిధులకు ఇవ్వాలి. వీటన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి.”

“పామ్ ఆయిల్ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నది. 2000 ఎకరాలు వరంగల్ జిల్లాలో పామ్ ఆయిల్ పెట్టాం. మనకు 6 ఫ్యాక్టరీలు వస్తున్నాయి. ప్రతి రైతు వేసుకునే పంట ఆయిల్ పామ్. అందరినీ ప్రోత్సహించే ఏర్పాటు అధికారులు చేయాలి. హత్యకు గురైన చేర్యాల జెడ్పీటీసీ మల్లేశం నాకు దగ్గరే. ఈ హత్యకు పాల్పడ్డ వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటాను. వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం. సర్పంచ్ లను పక్క దోవ పట్టించే ప్రయత్నం బిజెపి చేస్తుంది. మీరు దీనిని తిప్పి కొట్టాలి.”

“పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం మొత్తం గ్రాంట్ 1202.75 కోట్లు. గ్రామానికి ఇచ్చేవి 5 లక్షలు ఇప్పటి వరకు ఈ ఏడాది జిల్లా పరిషత్ లకు 86 కోట్లు విడుదల చేశాం. కేంద్రం గతంలో ఇచ్చే గ్రాంట్ ను తగ్గించింది. కేంద్రం ఇచ్చే గ్రాంట్ కు సమానంగా ఇస్తుంది కేవలం తెలంగాణ రాష్ట్రం. మిగిలిన రాష్ట్రాల్లో కేంద్రం ఇచ్చే గ్రాంట్ మాత్రమే ఇస్తున్నారు. గతంలో 1830 కోట్లు కేంద్రం ఇచ్చేది.ఈ ఏడాది 500 కోట్లు తగ్గించింది. ఈ ఏడాది ఒక్క రూపాయి ఇవ్వలేదు. అయినా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా 256 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నాం. అడగంగా అడగంగా మొన్న 700 కోట్లు ఇచ్చింది.”

“కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాక సర్పంచ్ లు ఇబ్బందులు పడుతున్నారు. మనం ప్రతి ఏటా పంచాయతీలకు 330 కోట్లు విడుదల చేస్తే అందులో 50 శాతం రాష్ట్ర వాటా కాగా 50 శాతం కేంద్ర వాటా 50 శాతం. కేంద్రం మనకు ఇవ్వాల్సిన నిధుల్లో ఒక్క రూపాయి ఇవ్వకున్నా మనం ప్రతి నెల 256 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. గ్రామ పంచాయతీలు బలోపేతం చేసింది మనమే. పాత గ్రామ పంచాయతీలు 8,684 ఉండగా…కొత్తగా 4,085 చేసుకున్నాం. మొత్తం 12769 గ్రామ పంచాయతీలు చేశాం. ఒక్కో పంచాయతీకి 5 లక్షలు, ట్రాక్టర్ ఇచ్చాం. ట్రాక్టర్ భారం కాదు..ఆదాయ మార్గం. హరిత హారానికి నీళ్ళ కోసం ప్రతి ట్రిప్ కు గతంలో 6 వేలు కిరాయి ఇచ్చేవాళ్లు. కానీ ఇప్పుడు ట్రాక్టర్ ఉండడం వల్ల అన్ని డబ్బులు మిగులుతాయి. పైగా ఆదాయం వస్తుంది. తెలివిగా చేస్తే సర్పంచ్ లకు పంచాయతీలలో మస్తు ఆదాయం వస్తుంది. పొడి చెత్త, తడి చెత్త ఎరువు తయారు చేసి 50 లక్షలు తయారు చేశారు మన వరంగల్ లోని సర్పంచ్.”

“తెలంగాణ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీల ఆదాయం పెంచాం. మనకు విపరీతమైన అవార్డులు వచ్చాయి. దేశంలో 19 అవార్డులు ఇస్తే రాష్ట్రానికి 18 వచ్చాయి. దీన్ని ఓర్వలేక బిజెపి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై మీరు సరైన అవగాహన చేయాలి. గతంలో సర్పంచ్ ల వేతనం 1000 రూపాయలు ఉంటే మనం దానిని 6500కు పెంచాం. జెడ్పీటీసిలకు 2,250 ఉండగా ఇప్పుడు 13,000 ఇస్తున్నాం. వరంగల్ జిల్లా అన్ని విధాల ముందుకు వెళ్తుంది.”

“కేంద్రం చట్టం తెచ్చి స్థానిక సంస్థను ఇబ్బంది పెట్టింది. దీనివల్ల మన అధికారాలు దెబ్బ తిన్నాయి. జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ లకు ఎక్కడా ఇవ్వనన్ని డబ్బులు ఇస్తున్నాం. ఇంకా మీరు తృప్తి పొందే విధంగా ఇస్తాను. ఇద్దరు కలెక్టర్లు డైనమిక్ గా ఉన్నారు. వారితో మంచి పని తీసుకోవాలి. వారు కూడా మీకు అన్ని విధాల సహకరిస్తారు. నాకు ఈ వరంగల్ జెడ్పీతో దీనితో 35 ఏళ్ల అనుబంధం ఉంది. డీసీసీబీ చైర్మన్ గా, ఎమ్మెల్యే గా ఇక్కడ కొనసాగాను.”

సమావేశానికి జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి గండ్ర జ్యోతి గారు అధ్యక్షత వహించగా… ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి , జిల్లా కలెక్టర్ గోపి, హనుమకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ, జడ్పీటీసీలు, ఎంపీపీ , స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X