“అభివృద్ధి, సంక్షేమ పథకాల రూపంలో ప్రతి ఇంట్లో సీఎం కేసీఆర్”

దేశంలో ఎక్కడా లేనన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలోనే అమలు

తొమ్మిదేళ్లుగా స్వ రాష్ట్రంలో సుపరిపాలన

మరో మారు కేసీఆర్ ని ఆశీర్వదించాలి

దేశం మొత్తంలో అనేక రాష్ట్రాలు మన పథకాల్ని కాపీ కొడుతున్నాయి

చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు కుళ్లుకుంటున్నాయి

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని చీకటాయపాలెం, చెర్లపాలెం, గోపాలగిరి గ్రామాలు కలిపి చెర్లపాలెం గ్రామ శివారులో, అలాగే, కర్కాల, అమర్ సింగ్ తండా, దుబ్బా తండా, హరిపిరాల గ్రామాలు కలిపి హరిపిరాల గ్రామ శివారులో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాల్లో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

తొర్రూరు: సంక్షేమ, అభివృద్ధి పథకాల రూపంలో ప్రతి ఇంట్లో సీఎం కేసీఆర్‌ ఉంటారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని చీకటాయపాలెం, చెర్లపాలెం, గోపాలగిరి గ్రామాలు కలిపి చెర్లపాలెం గ్రామ శివారులో, అలాగే, కర్కాల, అమర్ సింగ్ తండా, దుబ్బా తండా, హరిపిరాల గ్రామాలు కలిపి హరిపిరాల గ్రామ శివారులో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాల్లో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

అంతకుముందు చెర్లపాలెంలో 20 లక్షల తో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. గ్రామంలో సిసి రోడ్డు పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ….

కార్యకర్తలే నా బలం.. ప్రజలే నా బలగమని.. సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇంటింటికీ అందాయని తెలిపారు. వాటిని కార్యకర్తలు ఇంటింటికీ తీసుకుపోవాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల కుట్రలను తిప్పికొట్టాలన్నారు. రాష్ట్రంలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల నిర్మాణంతో సాగు నీరు పుష్కలంగా లభించి వ్యవసాయ బాగా పంటలు పండుతుండడంతో సీఎం కేసీఆర్‌ పాలనలో రైతులు రాజుగా మారుతున్నారన్నారు. తెలంగాణ ఏర్పాటైతే కరెంటు ఉండదని, దీపాలు పెట్టుకోవాల్సి వస్తుందని హేళన చేసిన పార్టీల నోరు మూయించేలా 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.

తెలంగాణ రాకముందు ఏ గ్రామానికి వెళ్లినా కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు దర్శనమిచ్చేవని, పంటలు ఎండిపోయేవన్నారు. ఇప్పుడు తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. రోహిణి కార్తె వస్తే పంట పెట్టుబడి లేక రైతు గుండె దడదడలాడేదని, ఎట్ల నాటేసుకుంటమో… ఏదైనా బంగారం కుదవ పెట్టుకునేటోళ్లు, షావుకార్ల చుట్టూ తిరిగేటోళ్లని గుర్తుచేశారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌ బాగా ఆలోచించి పెట్టుబడి కోసం రైతుబంధు పథకం ప్రవేశపెట్టారన్నారు. రైతు చనిపోతే రూ.ఐదు లక్షలు వారి కుటుంబ సభ్యుల ఖాతాల్లో పడుతున్నాయన్నారు. పంట దళారుల పాలు కాకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదన్నారు.

మిషన్‌ కాకతీయతో చెరువు, కుంటలను అపురూపంగా తీర్చిదిద్దుకున్నామన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలతో అన్ని వర్గాల ఆడపిల్లల పెళ్లిళ్లకు రూ.1,00,116 ఇస్తున్నామన్నారు. 24 గంటల కరెంటు ఇస్తుండడంతో ఓర్వ లేని కేంద్రం ఉచిత కరెంటును నిలిపివేస్తే రాష్ర్టానికి రూ.30 వేల కోట్లు ఇస్తానని చెప్పినా వినకుండా సీఎంకేసీఆర్‌ రైతుల సంక్షేమం కోసం ఉచిత కరెంటు ఇస్తూ కేంద్రం నిర్ణయాన్ని తిరస్కరించినట్లు తెలిపారు.

కేంద్రంలోని మోదీ సర్కారు తెలంగాణపై అడుగడుగునా వివక్ష చూపుతున్నదని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా 157 మెడికల్‌ కాలేజీలను మంజూరుచేస్తే తెలంగాణకు ఒక్కటీ కేటాయించలేదని చెప్పారు. ప్రతిపక్షాలకు సీఎం కెసిఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక, అడ్డగోలుగా మాట్లాడుతున్నాయని ధ్వజమెత్తారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తొమ్మిదేండ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు, కార్యకర్తల కష్టాలు తెలుసుకుందామనే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో అద్భుతంగా అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. దేశంలోని పలు రాష్ర్టాల్లో బీఆర్‌ఎస్‌కు మంచి ఆదరణ లభిస్తుందన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించి మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు.

తెలంగాణ ఉద్యమంలో ఏవిధంగా పాల్గొని రాష్ర్టాన్ని సాధించుకున్నామో అదే తరహాలో బీఆర్‌ఎస్‌ పార్టీని మూడోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపు నిచ్చారు.

కేసీఆర్‌కు తెలంగాణ ఉద్యమ కాలంలోనే ప్రజలు, రైతుల కష్టాలు తెలుసని, వాటిని తీర్చేందుకు అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని, ప్రభుత్వ రంగాలను ప్రైవేటు పరం చేస్తున్నదని విమర్శించారు. మోదీ తెలంగాణపై క్షక్షగట్టి ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థలతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. దేశ వ్యాప్త మార్పు కోసం బీఆర్‌ఎస్‌ పోరాటం చేస్తుందని వివరించారు.

దేశంలో ఒక్క తెలంగాణ మినహా అన్ని రాష్ర్టాల్లో ఆకలి చావులు ఉన్నాయని, మోదీ ప్రధాని అయ్యాక ఇవి మరింత పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ర్టాల్లో తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఒక్కటి కూడా ఎందుకు అమలు చేయడం లేదని మండిపడ్డారు. గుజరాత్‌లో రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌, ఆసరా పింఛన్లు, రైతులకు ఉచిత కరంట్‌ ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు.

అభివృద్ధి విషయంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పింఛన్లు, ఉచిత కరెంట్‌, రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ తదితర సంక్షేమ పథకాలు అమలు చేసి ఏ రాష్ర్టానికి అందనంత ఎత్తులో తెలంగాణ వెలుగొందుతున్నదని తెలిపారు. తెలంగాణ ఆవిర్భవించాకే రాష్ట్రంలో ప్రగతి ప్రారంభమైందని, సీఎం కేసీఆర్‌ దార్శనికత, పట్టుదలతో ఇది సాధ్యమైందని చెప్పారు.

పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో గ్రామంలో రూ. కోటి మేర నిధులు ఖర్చు చేసినట్లు తెలిపారు. రైతుబంధు, 24 గంటల కరెంట్‌, ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి, కేసీఆర్‌ కిట్‌ తదితర పథకాలు కొనసాగి మరింత అభివృద్ధి చెందాలంటే సీఎం కేసీఆర్‌ ప్రభుత్వాన్ని మూడోసారి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.

అభివృద్ధి పథంలో చర్ల పాలెం గత ఐదేళ్లలో 35 కోట్లతో చర్ల పాలెం లో అభివృద్ధి చేశాను.గోపాల గిరి లో పెట్టబోయే ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు లభించేలా చేస్తాను. చర్లపాలెం బొడ్రాయి పండుగ మొత్తం ఖర్చును భరిస్తా. గ్రామంలోని పురాతన దేవాలయ పునరుద్ధరణ పూర్తి చేస్తా. డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు స్థలం ఇచ్చిన దాతలకు ఉపాధి అవకాశం కల్పిస్తాను. మాయమాటలు ఉడికిచ్చి కొట్టాలి. అని మంత్రి చర్ల పాలెం గ్రామం, ఇతర గ్రామాల అభివృద్ధిని ప్రజలకు వివరించారు.

ఈ సందర్భంగా కార్యకర్తలతో కలిసి మంత్రి సహపంక్తి భోజనాలు చేయడంతో పాటు కార్యకర్తలకు దయాకర్ రావు కొసరి కొసరి వడ్డించారు. అనంతరం వారితో సరదాగా గడిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ తూర్పు చిన్న అంజయ్య , జెడ్పిటిసి మంగళపల్లి శ్రీనివాస్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ అనుమాండ్ల దేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, సీనియర్ నాయకులు చిదిరాల చంద్రయ్య, సర్పంచులు సట్ల నాగలక్ష్మి, బూర్గుల సరోజన సరోజన, రావుల మమతారెడ్డి, ధర్మారపు శ్రీనివాసరావు, సేగ్యం సురేఖ , ఈజీఎస్ రాష్ట్ర డైరెక్టర్ లింగాల వెంకటనారాయణ గౌడ్, డీసీసీబీ డైరెక్టర్, పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, వైస్ ఎంపీపీ ఇట్టే శ్యామ్ సుందర్ రెడ్డి, ఎంపీటీసీలు వల్లపు గోపమ్మ, అలివేలు, ధర్మారపు కిరణ్, నాయకులు రామ సహాయం కిషోర్ రెడ్డి, రాయిశెట్టి వెంకన్న , అంకూస్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X