हैदराबाद : माओवादी केंद्रीय समिति ने राष्ट्रव्यापी बंद का आह्वान किया। यह बंद माओवादियों को केंद्र सरकार द्वारा माओवादियों के खिलाफ चलाए गए अभियान ऑपरेशन कगार के अंतर्गत मुठभेड़ में 21 मई को माओवादी सचिव नंबाला केशव राव उर्फ बसवराज समेत 27 माओवादियों की मौत हो गई।
इसी क्रम में माओवादी केंद्रीय समिति ने प्रवक्ता अभय के नाम से एक पत्र जारी किया है। इसमें आगामी 10 जून को देशव्यापी भारत बंद का आह्वान किया है । पत्र में भारत सरकार पर “नरसंहार” करने का आरोप लगाया गया है और 21 मई को “क्रांतिकारी इतिहास का काला दिन” करार दिया है।

माओवादियों ने यह भी घोषणा की है कि बसवराज सहित मारे गए 27 माओवादियों को श्रद्धांजलि देने के लिए 11 जून से 3 अगस्त तक स्मृति सभाएँ आयोजित की जाएँगी। माओवादियों ने दावा है कि 2024 की शुरुआत से अब तक मुठभेड़ों में 540 माओवादी मारे जा चुके हैं।
Also Read-
माओवादियों ने पत्र में प्रधानमंत्री नरेंद्र मोदी और गृह मंत्री अमित शाह की कड़ी आलोचना की गई है और उन पर बेशर्मी से “नरसंहार” को “ऐतिहासिक जीत” के रूप में मनाने का आरोप लगाया गया है। माओवादियों का आरोप है कि ये ऑपरेशन सत्तारूढ़ पार्टी के “ब्राह्मणवादी हिंदुत्व फासीवादी एजेंडे” को दर्शाते हैं।
शांति वार्ता के लिए अपनी इच्छा दोहराते हुए माओवादी केंद्रीय समिति ने ऑपरेशन कगार के जारी रहने की निंदा की। उन्होंने देश भर के नागरिकों से 10 जून के भारत बंद का समर्थन करने और राज्य प्रायोजित उत्पीड़न के खिलाफ़ विरोध प्रदर्शन करने के लिए स्मारक कार्यक्रमों में भाग लेने का आग्रह किया।
गौरतलब है कि माओवादी सचिव नंबाला केशव राव उर्फ बसवराज सहित 27 माओवादियों की मौत की तुर्की, चीन (क्रांतिकारी), बांग्लादेश, पाकिस्तान, अफगानिस्तान, डेनमार्क, ऑस्ट्रिया, फिलिपिन्स जैसे लगभग 15 देशों की क्रांतिकारी संगठनों ने निंदा की और संस्मरण सभाएं आयोजित की। तात्पर्य बसवराज की मौत इस समय अंतराष्ट्रीय मुद्दा बन गया है। (एजेंसियां)
జూన్ 10న మావోయిస్టుల భారత్ బంద్
హైదరాబాద్ : ఆపరేషన్ కగార్ లో భాగంగా మావోయిస్ట్ పార్టీ కీలక నేత నంబాల కేశవరావుతో పాటు పలువురు అగ్రనేతలను భద్రతా బలగాలు ఎన్ కౌంటర్ చేసాయి. వరుసగా ప్రభుత్వం మావోయిస్టులో పై చేస్తోన్న ఆపరేషన్ కు వ్యతిరేకంగా మావోయిస్ట్ పార్టీ భారత్ బంద్ కు పిలుపు నిచ్చింది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టింది. ఇటీవల తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దు జిల్లాల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మొత్తం 27 మంది మావోయిస్టులను ప్రాణాలు కోల్పోయారు.
ఈ క్రమంలోనే కీలక నేత నంబాల కేశవరావు, దళ సభ్యుల మృతికి నిరసనగా జూన్ 10న భారత్ బంద్‌కు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. అదేవిధంగా జూన్ 11 నుంచి ఆగస్టు 3 వరకు అమర వీరుల స్మారక సభలను నిర్వహించనున్నట్లుగా వెల్లడించారు. 2024 నుంచి ఇప్పటి వరకు 540 మంది మావోయిస్టులు భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో మృతి చెందారు.
తాము శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించినా.. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్‌ను ఆపడం లేదన్నారు. గత రెండు నెలలుగా సంయమనం పాటించామన్నారు. కేంద్ర రాష్ట్ర ఫాసిస్ట్ వైఖరికి నిరసనగా జూన్ 10న భారత్ బంద్‌కు పిలుపునిస్తున్నామని మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ లేఖను విడుదల చేశారు.ఒకవైపు పోలీసులకు చేపట్టిన ఆపరేషన్ కగార్ కు బెంబేలెత్తిపోతున్న మావోయిస్టు నేతలు పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. తాజాగా ములుగు జిల్లా ఎస్పీ శభరీష్ ఎదుట 8 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో డివిజనల్ కమిటీ, ఏరియా కమిటీ, పార్టీ సభ్యులు, మిలిషియా సభ్యులు ఉన్నట్లు ఎస్పీ శబరీష్ తెలిపారు. పోలీస్ ల ఎదుట లొంగిపోయిన ఎనిమిది మావోయిస్టులు. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు వివిధ హోదాల్లో ఉన్న 355 మంది మావోయిస్టులు లొంగిపోయారన్నారు. జనజీవన స్రవంతిలో కలిసిన వారికి ప్రభుత్వ పునరావాస పథకాలు అందజేస్తామన్నారు.
తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలలో మావోయిస్టుల సంచారం ఉందని, సరిహద్దు గ్రామాల ప్రజలు మావోయిస్టు దళాలకు సహకరించవద్దని ములుగు జిల్లా ఎస్పీ శబరేష్ పిలుపునిచ్చారు. మావోయిస్టుల సమాచారం గుర్తిస్తే పోలీస్ స్టేషన్ లో గానీ జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేయాలని కోరారు. ప్రభుత్వం, పోలీస్ శాఖ సహకారంతో అవసరమైన దీర్ఘకాలిక పునరావాస చర్యలు చేపడుతున్నామని ఎస్పీ అన్నారు. ఇక మావోయిస్ట్ పార్టీ భారత్ బంద్ కు ఏ మేరకు ప్రజల్లో స్పందన ఉంటుందో చూడాలి.
మావోయిస్టు కార్యదర్శి నంబాల కేశవ్ రావు అలియాస్ బసవరాజ్ సహా 27 మంది మావోయిస్టుల మరణాన్ని టర్కీ, చైనా (విప్లవాత్మక), బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, డెన్మార్క్, ఆస్ట్రియా, ఫిలిప్పీన్స్ వంటి దాదాపు 15 దేశాల విప్లవాత్మక సంస్థలు ఖండించాయి మరియు స్మారక సమావేశాలు నిర్వహించబడ్డాయి. అంటే బసవరాజ్ మరణం ఈ సమయంలో అంతర్జాతీయ సమస్యగా మారింది. (ఏజెన్సీలు)
