हैदराबाद: देश में माओवादियों को खत्म करने के लिए केंद्र सरकार का ‘ऑपरेशन कगार’ ज़ोर-शोर से जारी किया है। इस साल अब तक लगभग 200 माओवादी मुठभेड़ों में अपनी जान गंवा चुके हैं। सुरक्षा बलों और माओवादियों के बीच, खासकर तेलंगाना-छत्तीसगढ़ सीमा पर अक्सर गोलीबारी होती रहती है।
हालांकि, माओवादी पार्टी ने हाल ही में एक पत्र जारी कर कहा है कि हर साल की तरह इस साल भी 28 जुलाई से 3 अगस्त तक शहीद स्मृति सप्ताह मनाया जाएगा। दंतेवाड़ा ज़िले में आज से शुरू हो रहे इस सप्ताह भर के समारोह के दौरान एक महत्वपूर्ण घटनाक्रम हुआ।
सीआरपीएफ़-195 के जवानों ने काहचेनर गाँव के पास बने कुल 3 स्मारकों की पहचान की और उन्हें ध्वस्त कर दिया। खबर है कि सुरक्षा बलों ने उन स्मारकों को इसीलिए ध्वस्त कर दिया क्योंकि माओवादी सप्ताह भर चलने वाले समारोह के दौरान श्रद्धांजलि देने की ताक में थे। जवानों ने शहीद माओवादी आनंद गड्डम, राम सुकुमार और महिला माओवादी सरिता का स्मारक ध्वस्त किया है।
Also Read-
మావోయిస్టుల 3 స్మారక చిహ్నాలు ధ్వంసం
హైదరాబాద్ : దేశంలో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపడుతోన్న ‘ఆపరేషన్ కగార్’ ఉధృతంగా కొనసాగుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు 200 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య తరచూ ఎదురుకాల్పులు నేటీకి జరుగుతూనే ఉన్నాయి.
అయితే, ప్రతి ఏడాది మాదిరిగానే జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లుగా మావోయిస్టు పార్టీ ఇటీవలే ఓ లేఖను విడుదల చేసింది. నేటి నుంచి వారోత్సవాలు ప్రారంభవుతోన్న వేళ దంతెవాడ జిల్లాలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
కహ్చెనార్ గ్రామ సమీపంలో నిర్మించిన మొత్తం 3 స్మారక చిహ్నాలను సీఆర్‌పీఎఫ్-195 బలగాలు గుర్తించి ధ్వంసం చేశాయి. వారోత్సవాల సందర్భంలో మావోయిస్టులు స్మారక చిహ్నాలకు నివాళులర్పించకూడదనే వాటిని భద్రత బలగాలు కూల్చివేసినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. అమరవీరులైన మావోయిస్టులు ఆనంద్ గడ్డం, రామ్ సుకుమార్ మరియు మహిళా మావోయిస్టు సరితల స్మారక చిహ్నాన్ని సైనికులు కూల్చివేసారు.(ఏజెన్సీలు)
