माओवादी एक्शन टीम ने जारी किया चेतावनी पत्र, BRS नेताओं में दहशत

हैदराबाद : तेलंगाना के मुलुगु जिले के एजेंसी इलाके एटुरुनागारम में माओवादियों के नाम से जारी एक पत्र से हड़कंप मच गया है। माओवादी एक्शन टीम के कामरेड बदरू और वेंकटेश के नाम से चेतावनी पत्र जारी किया गया। दीवार पर लगे पोस्टरों में बीआरएस के कई नेताओं के नामों का खुलासा करते हुए चेतावनी जारी की गई है।

पत्र में एतुरुनागारम बीआरएस टाउन के अध्यक्ष मोहम्मद खाजा पाशा, पार्टी के कुनूर महेश और चिप्पा अशोक के नामों का उल्लेख है। माओवादियों ने इन नेताओं पर रेत दोहन और जमीन हड़पने का आरोप लगाया और जनविरोधी पद्धति को बदलने की चेतावनी दी है। नहीं तो जनता की अदालत में सजा दी जाएगी।

माओवादियों ने पत्र में वन अधिकारियों और पुलिस को भी चेतावनी दी है। उन्होंने कहा कि वन अधिकारी लोगों के खिलाफ मामले दर्ज कर परेशान कर रही हैं। उन्होंने कहा कि पुलिस से ज्यादा वन अधिकारी लोगों के साथ बुरा बर्ताव कर रहे हैं। पत्र में चेतावनी दी गई है कि अधिकारी अपना तरीका बदले तो बेहतर होगा। पुलिस के मुखबिर भी अपने तरीके बदले।

కలకలం రేపుతున్న మావోల హెచ్చరిక లేఖ, బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్

హైదరాబాద్ : తెలంగాణలోని ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన ఏటూరు నాగారంలో మావోయిస్టుల పేరిట విడుదలైన లేఖ కలకలం రేపుతోంది. మావోయిస్టు యాక్షన్ టీం బద్రు, కామ్రేడ్ వెంకటేష్ పేరుతో హెచ్చరిక లేఖను విడుదల చేశారు. వాల్ పోస్టర్లలో పలువురు బీఆర్ఎస్ నేతల పేర్లు వెల్లడిస్తూ హెచ్చరికలు జారీ చేశారు.

ఏటూరు నాగారం బీఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న మహమ్మద్ ఖాజా పాషా, పార్టీకి చెందిన కునూరు మహేశ్, చిప్ప అశోక్ పేర్లను లేఖలో పేర్కొన్నారు. ఇసుక దోపిడీ, భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ప్రజా వ్యతిరేక పద్ధతులు మార్చుకోవాలన్నారు. లేదంటే ప్రజల సమక్షంలో ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు.

ఫారెస్ట్ అధికారులు, పోలీసులను కూడా లేఖలో హెచ్చరించారు. ఫారెస్ట్ అధికారులు ప్రజలపై కేసులు పెట్టి వారిని ఇబ్బందులు పెడుతున్నారన్నారు. పోలీసుల కన్నా ఫారెస్ట్ అధికారులు ఎక్కువ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా అధికారులు పద్ధతి మార్చుకుంటే మంచిదని లేఖలో హెచ్చరించారు. పోలీస్ ఇన్ఫార్మర్లు కూడా పద్ధతి మార్చుకోవాలన్నారు.

అటవీ ప్రాంతంలో పోలీసుల కూలింగ్ ఆపకపోతే బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడి నుండి జిల్లా స్థాయి నాయకుల వరకు ఎవర్ని వదలబోమని హెచ్చరించారు. మావోయిస్టుల లేఖతో ఏటూరు నాగారం ప్రాతంతంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులలో అలజడి మొదలైంది. ఎప్పుడు ఏం జరనుందోనని నేతలు టెన్షన్ పడుతున్నారు. మరోవైపు లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

బెల్లింపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు కూడా మావోయిస్టుులు బెదిరింపు లేఖ రాశారు. సింగరేణి కోల్ బెల్ట్ ఏరియా కమిటీ పేరుతో చిన్నయ్యకు వార్నింగ్ లేఖ రాశారు. సమస్యలతో వచ్చే మహిళలను ఎమ్మెల్యే ప్రలోభపెట్టి లొంగదీసుకుంటున్నాడని మావోయిస్టుల రాసినట్లుగా చెబుతున్న లేఖలో పేర్కొన్నారు. అలా చేయటం ఎమ్మెల్యేకు అలవాటుగా మారిందని అన్నారు.

ఎన్నిసార్లు హెచ్చరించినా పద్దతి మార్చుకోవటం లేదని మావోయిస్టు కోల్ బెల్ట్ ఏరియా కార్యదర్శి ప్రభాత్ పేరిట వార్నింగ్ లేఖ రాశారు. పద్దతి మార్చుకోకపోతే ప్రజా కోర్టులోశిక్ష తప్పదని ప్రభాత్ పేరిట విడుదలైన లేఖలో హెచ్చరించారు. ఇలా వరుసగా మావోయిస్టుల పేరిట లేఖలు విడుదల కావటం కలకలం రేపుతోంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X