- ప్రపంచ రికార్డు దిశగా మన్ కీ బాత్
- తెలంగాణ అగ్రభాగాన నిలిచేలా ప్రజలను భాగస్వాములను చేయండి
- ప్రతి అసెంబ్లీలో 100 సెంటర్లలో కనీసం వంద మందికి తగ్గకుండా వీక్షించేలా ఏర్పాట్ల చేయండి
- పండుగ వాతావరణంలో మన్ కీ బాత్ ను సక్సెస్ చేయండి
-బీజేపీ శ్రేణులకు బండి సంజయ్ కుమార్ పిలుపు
హైదరాబాద్ : ప్రజల మదిలో నిలిచేలా ‘‘మన్ కీ బాత్’’ 100వ ఎపిసోడ్ ను కనీవినీ ఎరగని రీతిలో విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అత్యధిక మంది వీక్షించేలా మన్ కీ బాత్ నిర్వహించడం ద్వారా ప్రపంచ రికార్డు స్రుష్టించబోతుందని, ఈ విషయంలో తెలంగాణ అగ్రభాగాన నిలిచేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
కర్నాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగళూరు వచ్చిన బండి సంజయ్ కుమార్ ఈరోజు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు, అసెంబ్లీ కన్వీనర్లు, శక్తి కేంద్ర ఇంఛార్జీలతోపాటు 7 మోర్చాలకు చెందిన మండల, ఆ పైస్థాయి రాష్ట్ర నాయకులు, జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జీలతో బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
అందులోని ముఖ్యంశాలు…
• ఎల్లుండి నిర్వహించబోయే మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ ను పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలి. పండుగ వాతావరణంలో నిర్వహించాలి. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించే ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం 100 కేంద్రాల్లో సగటున కనీసం 100 మంది హాజరయ్యేలా నిర్వహించాలి.
• ప్రజలందరూ మన్ కీ బాత్ చూసేలా స్ర్కీన్లు ఏర్పాటు చేయడంతోపాటు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలి. సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త పడాలి. ప్రతి మన్ కీ బాత్ సెంటర్ వద్ద అలంకరణ చేయడంతోపాటు ప్రజలు, కార్యకర్తలంతా వీక్షించేలా చర్యలు తీసుకోవాలి. కార్యక్రమం పూర్తయిన వెంటనే ఆ వివరాలను ఫోటోలతోసహా నమో యాప్ లో అప్ లోడ్ చేయాలి.
• పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంపై ప్రజలకు ఇప్పటి నుండే మీడియా, సోషల్ మీడియా వేదికగా విస్త్రతంగా ప్రచారం నిర్వహించండి. తద్వారా మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ ను అద్బుతంగా నిర్వహించే విషయంలో తెలంగాణ అగ్ర స్థానంలో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో మోర్చాల నాయకులు ముందుభాగాన ఉండాలి.
• అంతిమంగా మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ నిర్వహణతోపాటు అత్యధిక మంది ప్రజలు చూసేలా ప్రపంచ రికార్డు స్రుష్టించే అవకాశం ఉంది. ఈ విషయంలో తెలంగాణ అగ్రభాగాన ఉండేలా మనం ప్రజలను భాగస్వాములను చేయాలి.
ప్రతి ఓటర్ ను ఐదుసార్లు కలవండి
కేంద్ర, రాష్ట్రాల అభివ్రుద్దిని వివరించండి
-బెంగళూరులో పార్టీ నాయకులతో సమావేశమైన సంజయ్
-యలహంకలో పలువురు కార్యకర్తల నివాసాలకు వెళ్లి పలకరించిన బండి సంజయ్
-బండి సంజయ్ రాకతో కార్యకర్తల్లో జోష్…
-బాణాసంచా పేల్చి, సెల్ఫీలు దిగుతూ ఆనందం వ్యక్తం చేసిన కార్యకర్తలు
బెంగళూరు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈరోజు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు బెంగళూరు పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కదిరి మాజీ ఎమ్మెల్యే పార్ధసారధి, పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్పతో కలిసి నగరంలోని యలహంకలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక బీజేపీ అభ్యర్ధి ఎస్.ఆర్.విశ్వనాధ్ ను గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్ధించారు. అనంతరం పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచార సరళిని అడిగి తెలుసుకున్నారు.
• ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘‘పోలింగ్ తేదీ దగ్గరపడుతున్నందున ఓటర్లను కలుసుకునే కార్యక్రమాలను వేగవంతం చేయండి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుండి పోలింగ్ తేదీ ముందురోజు వరకు ప్రతి ఇంటికి వెళ్లండి. ఒక్కో ఓటర్ ను 5సార్లు కలవండి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న అభివ్రుద్ధిని వివరించారు. నియోజకవర్గ ప్రజల అభివ్రుద్ధి, సంక్షేమం కోసం బీజేపీ ఎమ్మెల్యే విశ్వనాథ్ చేసిన క్రుషిని వివరించండి. అత్యధిక మెజారిటీతో గెలిపించండి’’అని కోరారు.
• అనంతరం బండి సంజయ్ యలహంకలోని పలువురు కార్యకర్తల నివాసాలకు వెళ్లారు. స్థానిక బీజేపీ నాయకులు ఈశ్వరప్ప, ఏ.ఎస్.రాజన్న సహా పలువురు ఇండ్లకు వెళ్లారు. వారితో కొద్దిసేపు ముచ్చటించారు. ఎన్నికల ప్రచారాన్ని తీవ్రతరం చేయాలని సూచించారు.
• మరోవైపు బండి సంజయ్ రాకతో బెంగళూరు బీజేపీ పార్టీ కార్యకర్తల్లో జోష్ నెలకొంది. తెలంగాణ టైగర్ బండి సంజయ్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ బాణా సంచా పేల్చి సంబురాలు చేసుకున్నారు. సెల్ఫీల కోసం ఎగపడ్డారు. ప్రతి ఒక్కరితో ఓపికగా బండి సంజయ్ సెల్పీ దిగారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్ గారు ఈరోజు హైదరాబాద్ లో విడుదల చేసిన ప్రకటన…
• గోపాల్ గంజ్ జిల్లా కలెక్టర్ గా పనిచేసిన పాలమూరు బిడ్డ క్రిష్ణయ్య గారిని 1994లో అతి కిరాతకంగా చంపిన హంతకుడు ఆనంద్ మోహన్ హైదరాబాద్ వచ్చి క్రిష్ణయ్య కుటుంబ సభ్యులను కలవబోతున్నారని వస్తున్న వార్త కలిచివేస్తోంది. తెలంగాణ ప్రజల రక్తం మరుగుతోంది.
• యావజ్జీవ శిక్షపడి జైలు జీవితం అనుభవిస్తున్న ఆనంద్ మోహన్ ను శిక్షాకాలం పూర్తి కాకముందే నితీశ్ కుమార్ ప్రభుత్వం విడదల చేయడం సిగ్గు చేటు. నితీష్ కుమార్ వైఖరిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతవరకు ఎందుకు స్పందించలేదు? పాలమూరు బిడ్డను చంపేసిన హంతకుడు తెలంగాణలో అడుగుపెడుతుంటే ఎందుకు అనుమతిస్తున్నారో సమాధానం చెప్పాలి.
• ప్రజలను కాల్చి చంపి పేదల రక్తం తాగిన యూపీ గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ ను చంపితే ఖండించిన బీఆర్ఎస్ నేతలు క్రిష్ణయ్య హంతకుల రాకపై ఎందుకు నోరు మెదపడం లేదు?
• క్రిష్ణయ్యను హత్య చేసిన వాళ్లను జైలు నుండి విడిపించడాన్ని కేసీఆర్ సమర్ధిస్తున్నట్లు అర్ధమవుతోంది. నితీశ్ – కేసీఆర్ ఇద్దరూ మాట్లాడుకున్న తరువాతే ఆనంద మోహన్ హైదరాబాద్ వస్తున్నారని భావిస్తున్నాం.
• నితీశ్ కుమార్ – కేసీఆర్ మధ్యనున్న దోస్తీని తెలంగాణ ప్రజలు అర్ధం చేసుకోవాలని కోరుతున్నా. క్రిష్ణయ్య ను చంపిన హంతకులను ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ లో అడుగుపెట్టనీయం. లేనిపక్షంలో ప్రభుత్వం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాం.