दोनों तेलुगु राज्यों में महाशिवरात्रि भक्तिभाव से जारी, भगवान शिव मंदिरों भक्तों की कतारें

हैदराबाद : दोनों तेलुगु राज्यों में महाशिवरात्रि का जश्न भक्तिभाव से जारी है। सभी शिव मंदिर भगवान के नाम स्मरण से गूंज रहे हैं। 15 फरवरी की सुबह से ही मंदिरों खास पूजा और अभिषेक जारी हैं।

महाशिवरात्रि के मौके पर राजन्ना सिरसिला जिले का वेमुलावाड़ा मंदिर भक्तों से खचाखच भरा हुआ है। वेमुलावाड़ा राजन्ना क्षेत्र में भगवान शिव के नाम स्मरण से गूंज रहा है। तेलंगाना अनेक जिलों के साथ-साथ आंध्र प्रदेश, महाराष्ट्र और छत्तीसगढ़ राज्यों से वेमुलावाड़ा के लिए भी भक्त आ रहे हैं। भगवान राजन्ना के दर्शन के लिए भक्त लाइनों में खड़े हैं। मंदिर के पुजारियों ने सुबह-सुबह भगवान की खास पूजा-अर्चना की। भगवान के दर्शन के लिए छह घंटे तक समय लगने की संभावना हैं।

सरकार की ओर से मंत्री पोन्नम प्रभाकर और व्हिप आदि श्रीनिवास रेशमी वस्त्र भेंट करेंगे। वे शाम को स्वामी के मंडप में अनुवंशिक पुजारियों द्वारा महालिंगार्चना कार्यक्रम में भाग लेंगे। रात में लिंगोद्भव के दौरान मंदिर के पुजारी महान्यास पूर्व एकादशी पर रात 11.35 बजे श्री राजराजेश्वर स्वामी का रुद्राभिषेक करेंगे।

आंध्र प्रदेश के नंद्याल ज़िले में श्रीशैलम मंदिर में महाशिवरात्रि ब्रह्मोत्सव धूमधाम से मनाया जा रहा है। सातवें दिन, मल्लिकार्जुन स्वामी, भ्रामराम्बा के साथ, गजवाहन पर सवार होकर भक्तों को दर्शन दिए। श्रीशैलम मंदिर बिजली के दीयों से जगमगा रहे है और भक्तों को आकर्षित कर रहे हैं। पुजारियों और वैदिक विद्वानों ने सुबह से रात तक मंदिर में खास पूजा की।

Also Read-

मल्लिकार्जुन स्वामी की मूर्तियों को, भ्रामराम्बा के साथ, गजवाहन में अक्कामहादेवी अलरंकरण से मंडपम ले जाया गया और खास आरती की गई। श्री स्वामी की मूर्तियों को बिजली के दीयों की रोशनी के बीच गांव के उत्सव में ले जाया गया। गजवाहनम स्वामी को राजगोपुरम से होते हुए ढोल बाजे के बीच एक जुलूस में ले जाया गया, जो देखने लायक नज़ारा था, और यह श्रीशैलम की पुरानी सड़कों से होकर गुज़रा।

चित्तूर जिले के श्रीकालहस्ती में महाशिवरात्रि का जश्न जारी है। आंध्र प्रदेश के साथ-साथ तमिलनाडु से भी भक्त दर्शन के लिए आ रहे हैं। जश्न के हिस्से के तौर पर, कल रात, भगवान स्वामी शेष वाहनम और देवी वाहनम पर माडा की सड़कों पर प्रकट हुए।

Also Read-

తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరగుతున్నాయి. ఆలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. ఫిబ్రవరి 15 తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు కొనసాగుతున్నాయి.

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. శివనామ స్మరణతో వేములవాడ రాజన్న క్షేత్రం మారుమోగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలతో పాటు ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు తరలివస్తున్నారు. రాజన్నను దర్శించుకునేందుకు క్యూ లైన్ లో బారులు తీరారు భక్తులు. తెల్లవారుజామున స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు ఆలయ అర్చకులు. స్వామివారి దర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది.

ప్రభుత్వం తరపున పట్టు వస్ర్తాలు సమర్పించనున్నారు మంత్రి పోన్నం ప్రభాకర్, విప్ అది శ్రీనివాస్. సాయంత్రం స్వామివారి అద్దాల మండపంలో అనువంశిక అర్చకులచే మహాలింగార్చన కార్యక్రమం జరగనుంది. రాత్రి లింగోద్భవ సమయంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశి రాత్రి 11.35 నిమిషాలకు రుద్రాభిషేకం నిర్వహించనున్నారు ఆలయ అర్చకులు.

హైదరాబాద్ రాజేంద్రనగర్ సర్కిల్, అత్తాపూర్ డివిజన్ పరిధిలోని చిన్న అనంతగిరి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు ఉదయాన్నే ప్రారంభమయ్యాయి. అభిషేకాలు, ఆర్చనలు, ప్రత్యేక అలంకరణలతో శివాలయం భక్తిశ్రద్ధలతో నిండిపోయింది. భక్తులు క్రమబద్ధంగా దర్శనం చేసుకుంటుండగా, ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నది మధ్యలో ఉన్న ఏలేశ్వరంగుట్టకు భక్తులు పోటెత్తారు. ప్రతి సంవత్సరం మహా శివరాత్రికి ఒక్కరోజు మాత్రమే స్వామి దర్శనం చేసుకుంటారు భక్తులు. భక్తులు గుట్టకు చేరుకునేందుకు ఉదయం 6 గంటల నుంచే ప్రత్యేకంగా లాంచీలు నడుపుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులు సుమారు 10 కిలో మీటర్లు నదిలో ప్రయాణించి స్వామి దగ్గరకు చేరుకుంటారు. తర్వాత స్వామివారికి పాలాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు.

మేడ్చల్ జిల్లా కీసర గుట్టలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారు జాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిక్కిరిసి పోయాయి. శివరాత్రి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు.ఫిబ్రవరి13న ప్రారంభమైన బ్ర్మోత్సవాలు 18 వరకు దాదాపు 6 రోజులు కొనసాగానున్నాయి. జాతరలో భాగంగా వచ్చే లేడీస్ కోసం మఫ్టీలో షీ టీమ్స్ భద్రత ఏర్పాటు చేశారు. 2000 వేల మందితో పోలిస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయం చుట్టూ 165 సిసి కెమరాస్,కామాండ్ కంట్రోల్ రుమ్ ఎర్పాటు చేశారు. పార్కింగ్ కోసం 14 ఏరియాస్ లో స్లాట్స్ ఏర్పాటు చేశారు.

ఏపీ నంద్యాల జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏడోరోజు భ్రమరాంబ సమేతుడైన మల్లికార్జునస్వామి గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైలం ఆలయం విద్యుత్ దీపకాంతులతో మిరిమిట్లు గొలుపుతూ భక్తులను ఆకట్టుకుంది. ఆలయంలో తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో గజవాహనంలో ఆవహింపజేసి ప్రత్యేక హారతులిచ్చారు. శ్రీ స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను విద్యుత్ దీప కాంతుల మధ్య కన్నులపండువగా గ్రామోత్సవానికి తరలించారు. రాజగోపురం ద్వారా గజ వాహనం స్వామిఅమ్మవార్లను ఊరేగింపుగా బాజా బజంత్రీల మధ్య కన్నులపండువగా శ్రీశైలం పురవీధుల్లో విహరించారు.

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు నుంచి కూడా భక్తులు తరలివచ్చి ముక్కంటి దర్శనం చేసుకుంటున్నారు. ఉత్సవాల్లో భాగంగా నిన్న రాత్రి స్వామి వారు శేష వాహనంపై.. అమ్మవారు యాలి వాహనంపై మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తుల శివనామస్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా బోరజ్ మండలం కోరాటలో పంచముఖి‌ శివాలయం, నేరడిగొండ మండలం కుంటాల జలపాతంవద్ద గుహలో సోమేశ్వరున్ని, సిరికోండ మండలం సిరి చేల్మా గ్రామంలో మల్లికార్జున స్వామిని దర్శించుకుంటున్నారు భక్తులు. తెల్లవారుజాము నుంచి శివుడిని దర్శించుకుంటున్నారు భక్తులు. నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు క్యూ కట్టారు. తెల్లవారుజామున నుంచి కోనేరులో స్నానం చేసి స్వామివారి దర్శనానికి బారులు తీరారు. గర్భగుడిలో స్వామివారు, ముడుగుడ్లపై ఉన్న స్వామివారి దర్శనానికి గంటలకు కొద్ది సమయం పడుతుంది. అర్చనలు, అభిషేకాలు చేసి మొక్కలు తీర్చుకుంటున్నారు భక్తులు. భక్తుల రద్దీ దృష్ట గుట్టపైకి వాహనాల నిరాకరిస్తున్నారు పోలీసులు. స్వామివారి దర్శనానికి ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X