हैदराबाद: संगारेड्डी जिले के जिन्नारम गड्डपोतारम इंडस्ट्रियल एस्टेट स्थित हेटेरो लैब्स में घुसे तेंदुए को वन अधिकारियों ने पकड़ लिया। नेहरू चिड़ियाघर की एक विशेष टीम ने तेंदुए को बंदूक की मदद से नशीला पदार्थ दिया। इसके बाद जंजीर से बांधकर तेंदुए को जू पार्क में ले गये।
आपको बता दें कि शनिवार को सुबह चार बजे कंपनी के एच ब्लॉक में तेंदुआ घुस गया था। यह देख कर्मचारियों ने गेट बंद कर वन विभाग को इसकी सूचना दी। जिला वन अधिकारी श्रीधर के नेतृत्व में वन अधिकारियों ने हेटेरो लैब्स पहुंचकर तेंदुए की तलाश की। अधिकारियों के प्रयास विफल होने के बाद नेहरू चिड़ियाघर की एक विशेष टीम घटनास्थल पर पहुंच गई।
विशेष टीम ने बंदूक की मदद से चीते को नशीले पदार्थ से बेहोश कर दिया। इसके बाद तेंदुए के नींद में चले जाने के बाद उसे पकड़कर पिंजरे में बंद कर दिया गया। बाद में नेहरू जू पार्क ले जाया गया। पिछले तीन महीनों से तेंदुए की आवाजाही से स्थानीय लोग दहशत में थे। तेंदुए को पकड़ जाने से स्थानीय लोगों ने राहत की सांस ली।
హెటెరో ల్యాబ్స్‌లోకి ప్రవేశించిన చిరుతపులిని పట్టుకున్నారు
హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా జిన్నారం గడ్డపోతారం పారిశ్రామికవాడలో హెటిరో ల్యాబ్స్‌లోకి ప్రవేశించిన చిరుతను అధికారులు బంధించారు. నెహ్రూ జూపార్క్‌కు చెందిన ప్రత్యేక బృందం చిరుతకు మత్తు మందు ఇచ్చి ఆ తర్వాత బోన్‌లో బంధించి పార్క్‌కు తరలించారు.
శనివారం తెల్లవారు జామున 4 గంటలకు కంపెనీకి చెందిన హెచ్ బ్లాక్‌లోకి చొరబడిది. దీన్ని గమనించిన ఉద్యోగులు గేట్లకు తాళాలు వేసి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. జిల్లా అటవీ అధికారి శ్రీధర్ ఆధ్వర్యంలో ఫారెస్ట్ అధికారులు హెటిరో పరిశ్రమకు చేరుకొని చిరుత కోసం గాలింపు చేపట్టారు. అధికారుల ప్రయత్నాలు విఫలం కావడంతో నెహ్రూ జూపార్క్‌కు చెందిన ప్రత్యేక బృందం రంగప్రవేశం చేసింది. గన్ సహాయంతో చిరుతకు మత్తుమందు ఇచ్చారు.
ఆ తర్వాత చిరుతపులి నిద్రలోకి జారుకోగానే పట్టుకొని బోన్‌లో నిర్బంధించి ఆ తర్వాత నెహ్రూ జూ పార్క్‌కు తరలించారు. గత మూడు నెలలుగా చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. (Agencies)