Continue Update : हीराबेन मोदी की अंतिम संस्कार संपन्न, पीएम नरेंद्र मोदी और उनके भाइयों ने दिया कंधा

हैदराबाद: प्रधानमंत्री नरेंद्र मोदी की मां हीराबेन का अंतिम संस्कार संपन्न हुआ। इससे पहले हजारों की संख्या में अंतिम यात्रा गांधीनगर के शमशान वाटिका में पहुंची। प्रधानमंत्री नरेंद्र मोदी की मां हीराबेन का शुक्रवार अलसुबह निधन हो गया। 100 वर्षीय हीराबेन अहमदाबाद के अस्पताल में भर्ती थी। वहीं शुक्रवार की सुबह पीएम मोदी अहमदाबाद पहुंचे। इसके बाद अंतिम यात्रा निकाली गई। इस दौरान उन्होंने अपने भाईयों के साथ अपनी मां के शव को कंधा दिया। अंतिम यात्रा में हजारों की संख्या में लोगों ने भाग लिया।

Related News:

ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబెన్‌ మోదీ మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, రాజ్యసభలో విపక్షనేత, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, గుజరాత్ సీఎం భూపేంద్ర పాటిల్‌, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌, కేంద్ర మాజీ మంత్రి, డెమోక్రటిక్‌ ఆజాద్‌ పార్టీ చైర్మన్‌ గులాం నబీ ఆజాద్‌ సంతాపం తెలిపారు. హీరాబెన్‌ మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ప్రధాని భావోద్వేగ ట్వీట్

తన మాతృమూర్తి హీరాబెన్‌ కన్నుమూతపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భావోద్వేగ ట్వీట్‌ చేశారు. ‘‘నా తల్లి వందేళ్ల జీవితాన్ని పూర్తి చేసుకుని దేవుడి చెంతకు చేరారు. ఆమె జీవిత ప్రయాణం ఓ తపస్సులాంటిది. సన్యాసిలా, కర్మయోగిలా, విలువలకు కట్టుబడిన వ్యక్తిలా నిస్వార్థ జీవితాన్ని గడిపారు. ఆమెలో త్రిమూర్తులు ఉన్నట్లు భావిస్తున్నా’’ అని ప్రధాని మోడీ ట్విటర్‌లో తెలిపారు. 

సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

ప్రధానమంత్రి నరేంద్రమోడీ మాతృమూర్తి హీరాబెన్ గారి మరణం పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థించారు

హరీశ్ రావుసంతాప ప్రకటన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తల్లి హీరాబెన్ గారి మృతి పట్ల రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సంతాపం ప్రకటించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మోడీ మృతిపట్ల మంత్రి ఎర్రబెల్లి సంతాపం

భారత దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి తల్లి హీరాబెన్ మోడీ (100) గారి మృతి పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు సంతాపం తెలిపారు. తల్లి లేని లోటు ఎవరూ పూడ్చలేనిదని హీరాబెన్ గారు మరణించడం కొడుకుగా మోదీకి తీరనిలోటని అభివర్ణించారు. వందేళ్ళ జన్మదినోత్సవం జరుపుకొని, జీవించినంతకాలం విలువలకి కట్టుబడి, తన కొడుకుని ప్రయోజకుడిగా చేసి దేశానికి ప్రధానిగా అందించిన హీరాబెన్ గారి జీవితం ఆదర్శనీయమన్నారు. తల్లితో మంచి అనుబంధం ఉన్న మోదీ గారికి తల్లి దూరం కావడం పట్ల దేవుడు ధైర్యం ప్రసాదించాలని కోరుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.

శ్రీమతి సత్యవతి రాథోడ్ సంతాప ప్రకటన

ప్రధాని నరేంద్ర మోడీ మాతృమూర్తి హీరా బెన్ మరణం పట్ల రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు సంతాపం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

గంగుల కమలాకర్ సంతాప ప్రకటన

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోది గారి తల్లి శ్రీ హీరాబెన్ మోది గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారు. హీరాబెన్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు మంత్రి గంగుల తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సంతాపం

ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ మ‌ర‌ణం ప‌ట్ల అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సంతాపం తెలిపారు. ప్ర‌ధాని మోదీకి త‌న ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేశారు. ప్ర‌ధాని మోదీకి మ‌నోధైర్యాన్ని ప్ర‌సాదించాల‌ని, హీరాబెన్ ఆత్మ‌కు స‌ద్గ‌తులు క‌ల‌గాల‌ని ప్రార్థించారు.

వద్దిరాజు రవిచంద్ సంతాపం

ప్రధానమంత్రి నరేంద్రమోడీ మాతృమూర్తి హీరాబెన్ మృతి పట్ల రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఒక ప్రకటనలో తీవ్ర సంతాపం ప్రకటించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ప్రధాన మంత్రి మోడీ,వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు రవిచంద్ర తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

హీరాబెన్‌ మృతిపట్ల సీఎం కేసీఆర్‌ మరియు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిసంతాపం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్‌ మృతిపట్ల సీఎం కేసీఆర్‌ మరియు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. ప్రధానికి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబెన్‌ మోదీ శుక్రవారం తెల్లవారుజామున 3.39 గంటలకు కన్నుమూశారు. ఇటీవలే వందో పుట్టినరోజు పూర్తిచేసుకున్న ఆమె.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో అహ్మదాబాద్‌లోని యూఎన్‌ మెహతా దవాఖానలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆమె ఆరోగ్యం విషమించడంతో ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు.

హీరాబెన్‌ మృతిపట్ల మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌ రావు, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌ సంతాపం తెలిపారు.

రేవంత్ రెడ్డి

టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి విడుదల చేసిన ప్రకటన

ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరా బెన్ మృతి పట్ల తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసిన టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి. 100 ఏళ్ళు పూర్తి చేసుకొని సంపూర్ణ జీవితం గడిపిన హీరబెన్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా. ప్రధాని మోడీ గారికి తన సానుభూతిని వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి.

బండి సంజయ్

బండి సంజయ్ కుమార్, పార్లమెంట్ సభ్యులు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు విడుదల చేసిన ప్రకటన

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోది గారి తల్లి హీరాబెన్ మోది గారు మరణించారన్న వార్త తీవ్రంగా బాధించింది. శ్రీమతి హీరాబెన్ గారి మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ, శ్రీ నరేంద్ర మోడీ గారికి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కలిగించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం.

డాక్టర్ కే లక్ష్మణ్

డాక్టర్ కే లక్ష్మణ్ పార్లమెంట్ సభ్యులు బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు విడుదల చేసిన ప్రకటన

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోది గారి తల్లి హీరాబెన్ మోది గారు మరణించారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. శ్రీ నరేంద్ర మోడీ గారు ధైర్యంగా ఉండాలని వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని కలిగించాలి అని కోరుకుంటున్నాం. శ్రీమతి హీరాబెన్ గారి మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేస్తూ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X