బఫర్ జోన్ లో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ ఫాం హౌస్ ను కూల్చాలి- కెటిఅర్
మంత్రులు,ప్రజా ప్రతినిధుల ఫాం హౌస్ నిర్మాణాలపైన కూడా చర్యలు తీసుకోండి
ప్రభుత్వానికి కెటిఅర్ సవాల్
హైదరాబాద్ : జన్వాడాలో తనకు ఏలాంటి ఫాం హౌస్ లేదని తెల్చి చెప్పిన కెటిఅర్. బఫర్ జోన్ లో ఎవరి నిర్మాణాలు ఉన్న సరే కూల్చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఓకవేళా తాను తప్పు నేను చేసిన సరే… నాపై చర్యలు తీసుకోండన్నారు. జన్వాడాలో తనకు ఏలాంటి నాకు ఫామ్ హౌస్ లేదని నా ఫ్రెండ్ ఫామ్ హౌస్ ను లీజు తీసుకున్నాన అని తెలిపారు. ఒక వేళ ఆ ఫామ్ హౌస్ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూల్చేయండి.
అదే విధంగా ప్రభుత్వానికి దమ్ముంటే ముఖ్యమంత్రి రేవంత్ మంత్రులు పొంగులేటి, మహేందర్ రెడ్డి, వివేక్ లాంటి కాంగ్రెస్ నాయకుల నిర్మాణాలు కూడా కూల్చేయాలన్నారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల రాజభవనాలు కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి. వాటిని కూడా కూల్చేయాలి.
Also Read-
ఇప్పటికైనా హైడ్రా పేరుతో చేస్తున్న హైడ్రామా అపాలన్నారు. నిజాయితీ ఉంటే ప్రభుత్వానికి ఒకే రోజు అక్రమ నిర్మాణాలను కూల్చాలని సవాల్ చేశారు. ముందుగా తమ అక్రమ నిర్మాణాలు కూల్చి ప్రజలకు అదర్శంగా ఉండాలని ముఖ్యమంత్రికి సూచించారు.
రుణమాఫీ పేరుతో రైతులను పచ్చి దగా, మోసం చేస్తున్నారు
ప్రతి రైతుకు రుణం మాఫీ అయ్యే వరకు ఈ దగాకోరు ప్రభుత్వాన్ని వెంటాడుతాం, వేటాడుతాం.
పావు శాతం రుణం మాఫీ చేసి…వందశాతం రైతులను మోసం చేశారు.
రుణమాఫీ పై సీఎంది ఒక మాట, మంత్రులది మరొక మాట. ఎవరినీ నమ్మాలి?
రుణమాఫీ చేయమంటే రైతులపై నాన్ బెయిలబుల్ కేసులా?
ప్రభుత్వం మెడలు వంచేందుకే రేపు బీఆర్ఎస్ రైతు ధర్నా కార్యక్రమం
అటెన్షన్ డైవర్షన్ కోసమే సీఎం బజారు బాష. ఆ ట్రాప్ లో మేము పడం.
బీఆర్ఎస్ ఉన్నంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేయలేదు
తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ లో కేటీఆర్ వ్యాఖ్యలు
రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ రైతులను పచ్చి దగా, మోసం చేస్తోందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రవ్వంత రుణమాఫీ చేసి ఈ ముఖ్యమంత్రి కొండంత డబ్బా కొట్టుకుంటున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ అసలు రైతులకు ఎంత రుణం మాఫీ చేసిందన్నది అటు ముఖ్యమంత్రి సహా మంత్రులకు కూడా తెలుసో… లేదోనని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ రైతులను పచ్చి మోసం చేస్తోందంటూ తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వం పావు శాతం రుణమాఫీ చేసి…వందశాతం రైతులను మోసం చేసిందన్నారు. ముఖ్యమంత్రేమో మొత్తం రుణమాఫీ అయిపోయిందంటే…మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి మాత్రం ఇంకా రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతుందని చెబుతున్నారని వారిని మాటలను కేటీఆర్ మీడియాకు వినిపించారు. ఇక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాత్రం కేవలం రూ. 7500 కోట్లు మాత్రమే రైతుల ఖాతాలో జమ అయ్యాయని చెబుతున్నారని మరీ ఏదీ నిజం, ఏదీ రైతులు నమ్మాలో చెప్పాలన్నారు.
నిజంగా వంద శాతం రుణమాఫీ అయి ఉంటే రైతులు ఎందుకు ఆందోళనలు చేస్తున్నారో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. 70 లక్షల రైతుల సాక్షిగా ముఖ్యమంత్రి బండారం బట్టబయలైందన్నారు. రుణమాఫీ మొత్తం రణరంగంగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పార్టీ ప్రేరేపించకుండానే రైతులు స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ ఆందోళన చేస్తున్నారన్నారు. బ్యాంకులను ముట్టడిస్తున్నారన్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టు తిరిగేలా చేస్తూ రైతులను గోస పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐతే కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని కేటీఆర్ హెచ్చరించారు. రైతులతో కలిసి ఈ ప్రభుత్వం మెడలు వంచేందుకు గురువారం అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో రైతు ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ ముందుగా 40 వేల కోట్లు అని చెప్పి…ఆ తర్వాత దాన్ని 7500 కోట్లకు తీసుకొచ్చిందన్నారు. రైతు రుణమాఫీ చేయాలని అడిగిన రైతులపై ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు మండలం లో బజార్ హత్నూర్ లో ఈ ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తుందన్నారు. రుణమాఫీ జరగలేదని ఆందోళన చేస్తే రైతులకు ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడేలా కేసులు పెట్టి వేధించటమేమిటని మండిపడ్డారు. వారిపై నాన్ బెయిలెబుల్ కేసులు పెట్టిన ప్రభుత్వాన్ని రైతులు క్షమించరని చెప్పారు. వెంటనే కేసులను ఉపసంహరించుకోవాలని లేదంటే రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి జైలు భరో కార్యక్రమానికి పిలుపునిస్తామన్నారు. లక్షలాది మంది రైతులు, మా పార్టీ కార్యకర్తలపై కేసులు పెడతారా? అని ప్రశ్నించారు.
లక్షలాదిమంది రైతులను మోసం చేసిన ప్రభుత్వం పైన చీటింగ్ కేసు నమోదు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ డ్రామాలు ఇక నడవని హెచ్చరించారు. రుణమాఫీ పూర్తిగా ఎప్పుడు చేస్తారో చెప్పాలి. రైతులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం రైతు దర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయమన్నందుకు ముఖ్యమంత్రి మాట్లాడిన బజారు భాషకు వ్యతిరేకంగా తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి రేపటి ధర్నాను ప్రారంభించాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.
బీఆర్ఎస్ పార్టీ ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేయలేదని కేటీఆర్ అన్నారు. గతంలో తమ ప్రభుత్వం రైతు రుణమాఫీ, రైతు బంధు కోసం ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని చెప్పారు. రుణమాఫీ పూర్తిగా చేయాలని కోరుతుంటే ఈ ముఖ్యమంత్రి అటెన్షన్ డైవర్షన్ కోసం బజారు బాష మాట్లాడుతున్నాడని కేటీఆర్ అన్నారు. ఐనా సరే మేము అటెన్షన్ డైవర్షన్ ను పట్టించుకోకుండా ప్రతి రైతుకు రుణమాఫీ జరిగేలా ప్రభుత్వం మెడలు వంచుతామని స్పష్టం చేశారు.
రైతు రుణమాఫీకి సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేశామని వాటి వివరాలను కేటీఆర్ మీడియా ముందు ఉంచారు. ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్ లోని కోస్గి మండలంలో ఐదు బ్యాంకుల్లో 20, 239 బ్యాంకు అకౌంట్ లోని రైతులకు గాను కేవలం 8, 527 మందికి మాత్రమే రుణమాఫీ అయ్యిందన్నారు. దీన్ని బట్టే ముఖ్యమంత్రి చెప్పిన మాటలు అన్ని మోసాలేనని అర్థమవుతుందన్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో రైతులకు జరిగిన మోసం ఇది. ప్రతి ఊరు, గ్రామంలో ఇదే కథ ఉందన్నారు.
రుణమాఫీకి సంబంధించి పాస్ బుక్ లో పేర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపన్ను దాఖలు చేయటం, రేషన్ కార్డు వంటి కారణాలు చెప్పి అనేక కుంటి సాకులు చెబుతూ ఈ ప్రభుత్వం ఆంక్షలు పెడుతోందన్నారు. రుణమాఫీకే ఇన్ని సాకులు చెబుతున్న ప్రభుత్వం రైతుబంధుకు ఇంకా ఎన్ని ఆంక్షలు పెడుతుందోనని అనుమానం వ్యక్తం చేశారు.
రైతులకు, వ్యవసాయ రంగానికి ఇచ్చిన అన్ని హామీలను రేవంత్ రెడ్డి తుంగలో తొక్కిండని కేటీఆర్ మండిపడ్డారు. ఈ రైతు ద్రోహి ప్రభుత్వాన్ని వదిలిపెట్టకుండా… వెంటాడుతాం, వేటాడుతామని హెచ్చరించారు. అందుకే రేపటి నుంచి మొదటి అడుగు రైతు ధర్నాతో ప్రారంభిస్తామన్నారు. కేవలం మీడియాను, హెడ్ లైన్స్ ను మేనేజ్ చేసి రైతు రుణమాఫీ నుంచి దృష్టి మరల్చాలని చూస్తున్నారని ఆ ఆటలు ఎంతోకాలం సాగవని స్పష్టం చేశారు. ఈ దగాకోరు సర్కార్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని… రైతులకు రేవంత్ రెడ్డి చేసిన చీటింగ్ పై బీఆర్ఎస్ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.